
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా మంచిర్యాల, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, జగిత్యాల, రామగుండం, వనపర్తిలో వచ్చే ఏడాదే కొత్త వైద్య కళాశాలలు ప్రారంభం కానున్నాయి. ప్రతీ కాలేజీలో 150 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున 1,200 సీట్లు 2022–23 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తాయి.
కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు కోసం జాతీయ వైద్య కమిషన్‌కు శనివారం దరఖాస్తు చేసినట్లు రాష్ట్ర వైద్య, విద్య సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్ రమేశ్ రెడ్డి తెలిపారు. నవంబర్, డిసెంబర్‌లో సంబంధిత అధికారులు తనిఖీలకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. కొత్త కాలేజీలకు అవసరమైన అధ్యాపకులు, ఇతర వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment