న్యూఢిల్లీ: దేశంలో 70 శాతం వైద్య కళాశాలలు ఎంబీబీఎస్ విద్యార్థులకు సక్రమంగా స్టైపెండ్ చెల్లించకపోవడంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంత జరుగుతున్నా జాతీయ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) ఏం చేస్తోందని నిలదీసింది.
స్టైపెండ్ చెల్లించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీ విద్యార్థుల నుంచి భారీగా డొనేషన్లు, క్యాపిటేషన్ ఫీజులు వసూలు చేస్తుంటాయని పేర్కొంది. ఎంబీబీఎస్ విద్యార్థులు నిర్బంధ కారి్మకులు కాదని తేలి్చచెప్పింది. వారికి తక్షణమే స్టైపెండ్ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఎన్‌ఎంసీని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment