- హాజరు కానున్న 2,681 మంది అభ్యర్థులు
అనంతపురం అర్బన్:
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) ఆధ్వర్యంలో ఆదివారం అనంతపురంలోని ఎనిమిది కేంద్రాల్లో సివిల్ సర్వీసెస్ (ప్రిలిమనరీ) పరీక్ష జరగనుంది. ఇందుకు సంబంధించి అధికార యంత్రాగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. సివిల్స్ పరీక్షకు జిల్లావ్యాప్తంగా 2,681 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
పేపర్–1 ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు జరుగుతుంది. పేపర్–2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.30 గంటల వరకు ఉంటుంది. పరీక్షల నిర్వహణకు 32 మంది అధికారులను నియమించారు. ఇందులో ఎనిమిది మంది లైజన్ ఆఫీసర్లు, ఎనిమిది రూట్ అధికారులు, ఎనిమిది పరిశీలకులు, ఎనిమిది మంది అసిస్టెంట్ సూపర్‌వైజర్లు ఉంటారు.
అరగంట ముందే ఉండాలి
అభ్యర్థులు పరీక్ష సమయానికి అర్ధ గంట ముందుగానే కేంద్రంలోకి చేరుకోవాలి. ఉదయం పరీక్షకు 9.10 గంటల్లోగా, మధ్యాహ్నం పరీక్షకు 2.10 గంటల్లోగా కేంద్రంలోకి చేరుకోవాల్సి ఉంటుంది. వెంట ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు.