
మనిషి అనుకుంటే సాధించలేనిది లేదని పుస్తకాల్లో చదువుకున్నాం. బుర్రకు పదునుపెడితే మనిషి మహానుభావుడవుతాడు.. తద్వారా గొప్ప అద్భుతాలను సృష్టిస్తాడు. దీనికి నిదర్శనమే వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VIT) విద్యార్ధి 'ప్రియాంజలి గుప్తా'. ఈమె గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VIT) విద్యార్ధి 'ప్రియాంజలి గుప్తా' కంప్యూటర్ సైన్స్ చదువుతోంది. ఈమె అమెరికన్ సైన్ లాంగ్వేజ్‌ని రియల్ టైమ్‌లో ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేసే ఒక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) రూపొందించింది.
డేటా సైన్స్‌లో నైపుణ్యం కలిగి ప్రియాంజలి టెన్సార్‌ఫ్లో ఆబ్జెక్ట్ డిటెక్షన్ APIని ఉపయోగించి కొత్త మోడల్‌ను అభివృద్ధి చేసింది. ఇది ssd_mobilenet అనే ప్రీ-ట్రైన్డ్ మోడల్ ద్వారా సంకేతాలను అనువదించగలదు. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇదీ చదవండి: ఎక్స్(ట్విటర్)లో మరో అప్డేట్? ఎలాన్ మస్క్ కొత్త వ్యూహం!
వీడియోలో గమనించినట్లయితే.. తాను రూపొందించిన ఏఐ డెమోలో ఆరు సంజ్ఞలను ప్రదర్శించింది. అవి హలో, ఐ లవ్ యు, ప్లీజ్, యస్, నో, థాంక్స్ వంటివి ఉన్నాయి. భవిషత్తులో మరిన్ని సంజ్ఞలు రూపొంచే అవకాశం ఉంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కారు కొడుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
Priyanjali Gupta, Indian student from VIT university, Tamil Nadu has developed an algorithm that instantly translates sign language. 👏 pic.twitter.com/jvF1i1xTeA
— Indian Tech & Infra (@IndianTechGuide) September 18, 2023