Vellore Institute of Technology
-
ఇంజినీర్ విద్యార్ధి ఏఐ టెక్నాలజీ.. అమెరికన్ సైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్‌లోకి..
మనిషి అనుకుంటే సాధించలేనిది లేదని పుస్తకాల్లో చదువుకున్నాం. బుర్రకు పదునుపెడితే మనిషి మహానుభావుడవుతాడు.. తద్వారా గొప్ప అద్భుతాలను సృష్టిస్తాడు. దీనికి నిదర్శనమే వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VIT) విద్యార్ధి 'ప్రియాంజలి గుప్తా'. ఈమె గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VIT) విద్యార్ధి 'ప్రియాంజలి గుప్తా' కంప్యూటర్ సైన్స్ చదువుతోంది. ఈమె అమెరికన్ సైన్ లాంగ్వేజ్‌ని రియల్ టైమ్‌లో ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేసే ఒక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) రూపొందించింది. డేటా సైన్స్‌లో నైపుణ్యం కలిగి ప్రియాంజలి టెన్సార్‌ఫ్లో ఆబ్జెక్ట్ డిటెక్షన్ APIని ఉపయోగించి కొత్త మోడల్‌ను అభివృద్ధి చేసింది. ఇది ssd_mobilenet అనే ప్రీ-ట్రైన్డ్ మోడల్ ద్వారా సంకేతాలను అనువదించగలదు. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదీ చదవండి: ఎక్స్(ట్విటర్)లో మరో అప్డేట్? ఎలాన్ మస్క్ కొత్త వ్యూహం! వీడియోలో గమనించినట్లయితే.. తాను రూపొందించిన ఏఐ డెమోలో ఆరు సంజ్ఞలను ప్రదర్శించింది. అవి హలో, ఐ లవ్ యు, ప్లీజ్, యస్, నో, థాంక్స్ వంటివి ఉన్నాయి. భవిషత్తులో మరిన్ని సంజ్ఞలు రూపొంచే అవకాశం ఉంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కారు కొడుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. Priyanjali Gupta, Indian student from VIT university, Tamil Nadu has developed an algorithm that instantly translates sign language. 👏 pic.twitter.com/jvF1i1xTeA — Indian Tech & Infra (@IndianTechGuide) September 18, 2023 -
వుమెన్ సేఫ్టీ.. గొప్పగా ‘చెప్పు’కోవచ్చు!
తాడులా కనిపించేది ఎప్పుడు పామై కాటేస్తుందో తెలియదు. వెలుగులా గోచరించేది ఎప్పుడు చీకటై ముంచేస్తుందో తెలియదు... అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి అంటారు. ఇందుకు ప్రత్యేకంగా వనరులు సమకూర్చుకోకపోయినా నిత్యజీవితంలో మనం ఉపయోగించే వస్తువులతోనే ‘మహిళల భద్రత’ కు అవసరమైన సాంకేతిక దన్ను అందిస్తుంది శాస్త్రీయజ్ఞానం. వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విఐటి, తమిళనాడు)కు చెందిన పరిశోధకులు మహిళలకు రక్షణ ఇచ్చే పాదరక్షలకు రూపకల్పన చేశారు. ‘మహిళా భద్రతకు ఎన్నో చట్టాలు ఉన్నా, ఎక్కడో ఒకచోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మేము రూపొందించే పాదరక్షలు ఎంతో భద్రతను ఇస్తాయి’ అంటున్నారు ప్రాజెక్ట్ మేకర్స్. తమకు తాముగా జాగ్రత్తపడేలా, విపత్కరమైన పరిస్థితులలో రక్షణ పొందేలా చేసే ఈ స్మార్ట్ పాదరక్షలు ఆత్మరక్షణ ఆయుధాలుగా ఉపయోగపడతాయి. ఎటాకర్స్పై ప్రతిదాడి చేసే అవకాశం వీటిలో ఉంది. జీపిఎస్, జీఎస్ఎం మాడ్యూల్‌ను ఉపయోగించి ఈ పాదరక్షలను డిజైన్ చేశారు. ‘షూ’లలో జీపిఎస్, జీఎస్ఎం మాడ్యుల్ మినియేచర్ వెర్షన్ చిప్‌లను అమర్చుతారు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఎమర్జెన్సీ–కాంటాక్ట్‌ల కోసం ‘షూ’ను గట్టిగా నొక్కితే సరిపోతుంది. ఎటాకర్‌కు షాక్ ఇవ్వవచ్చు. ‘ఎటాకర్’ను గుర్తించే వీడియో లైవ్ స్ట్రీమింగ్ సాంకేతికత కూడా వీటికి ఉండడం మరో విశేషం. తాజా విషయానికి వస్తే... హిమాచల్‌ప్రదేశ్, సొలాన్ జిల్లాలోని జైపీ యూనివర్శిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (జెయుఐటీ)కి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు సరన్ష్ రోహిల్లా, సాంధిత్య యాదవ్‌లు మహిళలకు రక్షణ ఇచ్చే ‘స్మార్ట్’ షూస్‌ను అభివృద్ధిపరిచారు. ఇవి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ‘కాంటాక్ట్స్’ను అప్రమత్తం చేస్తాయి. లొకేషన్ గురించి తెలియజేస్తాయి. ‘డిజైన్ అండ్ ఎనాలసిస్ ఆఫ్ స్మార్ట్షూ ఫర్ వుమెన్ సేఫ్టీ’ పేరుతో పేపర్ సమర్పించారు. ‘మహిళల భద్రతకు సాంకేతిక జ్ఞానాన్ని విరివిగా వాడుకోవాల్సిన సమయం ఇది. ఇందులో మాది ఒక అడుగు’ అంటున్నారు సరన్ష్,సాంధిత్య. -
ఏపీ: సీఎం సహాయనిధికి విట్ వర్సిటీ 50 లక్షల విరాళం..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి సహాయనిధికి వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూ. 50 లక్షల విరాళం ప్రకటించింది. ఈ మేరకు విట్ యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్స్లర్ డాక్టర్ జి. విశ్వనాధన్.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి విరాళాన్ని అందించారు. ఆయనతోపాటు విట్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ శంకర్‌విశ్వనాథన్, వైస్ ప్రెసిడెంట్ శేఖర్ విశ్వనాథన్, వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్ వి కోటారెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ సివీఎల్ శివకుమార్ ఉన్నారు. -
వ్యవస్థలోనే లోపం
చెన్నై, సాక్షి ప్రతినిధి: వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్) చెన్నై క్యాంపస్‌లో సోమవారం న్యాయ పాఠశాల ప్రారంభోత్సవానికి మాజీ న్యాయమూర్తి మోహన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యూరు. న్యాయ కళాశాల విద్యార్థుల శిక్షణ తరగతుల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, కోర్టుల్లో కేసులు పేరుకు పోతున్నాయని అందరూ చెబుతుంటారని, కానీ కేసుల సత్వర పరిష్కారానికి కోర్టుల సంఖ్య పెంచడం ఎంత మాత్రం పరిష్కా రం కాదన్నారు. న్యాయమూర్తులు ఆలస్యంగా సీటులోకి చేరడం, పదే పదే వాయిదాలు వేయ డం, న్యాయవాదులు సైతం అకారణంగా వాయిదాలు కోరడం వంటి క్రమశిక్షణా రాహిత్యం పెచ్చుమీరిపోయిందని పేర్కొన్నారు. బార్ కౌన్సి ల్ నిబంధనల ప్రకారం ఈ కేసునైనా మూడు సార్లు మించి వాయిదా వేయరాదు. ఉదయం 10.30 గంటలకు విధిగా కోర్టు ప్రారంభం కావాలి, కేసులు వినాలి తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే మరో వాయిదా వేయాలని ఆయన అన్నారు. ఇదే విషయాన్ని ప్రస్తుత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి సైతం ఒక ఉత్తరం ద్వారా విన్నవించినట్లు తెలిపారు. తన సర్వీసులో పదేపదే వాయిదాలకు అనుమతించలేదని చెప్పా రు. న్యాయవాదులు డ్రెస్‌కోడ్ కూడా పాటించకపోవడం విచారకరమన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సూచించిన డ్రెస్‌ను ధరించాలని సూచించారు. ‘సెయ్యుం తొళిలే దైవం’ (చేస్తున్న వృత్తి దైవంతో సమానం) అని మహాకవి భారతియార్ చెప్పిన సూక్తిని ప్రస్తావించారు. కేసులో గెలుపోటములు, ఆర్జించిన డబ్బు న్యాయవాదికి ముఖ్యం కాదు, చేపట్టిన కేసును సక్రమంగా వాదించామా లేదా అనేది గమనించుకోవాలని సూచించారు. బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు దైనందిన జీవితంలో ప్రతి దశలోనూ సర్టిఫికెట్ల ప్రాముఖ్యత ఉందంటే న్యాయవ్యవస్థ ఎంతటి కీలకమైనదో నేటి విద్యార్థులు గుర్తించాలని ఉద్బోధించారు. విట్ యూనివర్సిటీ విద్యారంగంలో ఒక తాజ్మహల్లా విరాజిల్లుతోందని ప్రశంసించారు. తమిళనాడు ప్రభుత్వ మాజీ అడ్వకేట్ జనరల్ ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ, విద్యార్థి దశలోనే న్యాయవిద్యపై పూర్తిస్థాయిలో పట్టుసాధిం చాలని, అదే భవిష్యత్తుకు గట్టి పునాది అని ఉద్బోధించారు. న్యాయవిద్యను పూర్తి చేసి బయటకు వచ్చినంత మాత్రాన చదువు అయిపోలేదని, అనుభవాలను క్రోఢీకరించుకుంటూ నిత్య విద్యా ర్థి అనే భావనతో ఉన్నపుడే ఎదుగుదల సాధ్యమన్నారు. దేశ, బహుళజాతి కంపెనీల్లో న్యాయవాదుల పాత్ర విధిగా మారినందున నేటి న్యాయ విద్యార్థులకు మంచి గిరాకీ ఉందని అన్నారు. విట్ చాన్సలర్ డాక్టర్ జీ విశ్వనాథన్ మాట్లాడుతూ, కోర్టుల్లో కేసులు ఏళ్ల తరబడి పేరుకుపోవడం ప్రధాన సమస్యగా మారిందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 30 మిలియన్ల కేసులు పరిష్కా రం కావాలంటే 320 ఏళ్లు పడుతుందని ఒక న్యాయమూర్తి తనతో అన్నట్లు చెప్పారు. ఒక మిలియన్ కేసులకు 10.5 శాతం లెక్కన న్యాయమూర్తులు ఉన్నారని తెలిపారు. యూఎస్‌లో సాయంత్రం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా కోర్టులను నిర్వహిస్తారని, అది భారత్‌లో సాధ్యమవునో కాదో తెలియదన్నారు. భారత దేశంలో సమ్మెలు ఒక భాగమైపోయాయి,కోర్టులు ఈ సమ్మెల్లో భాగస్వాములు కాకూడదని ఆకాం క్షించారు. 1984లో కేవలం 180 మంది ఇం జనీరింగ్ విద్యార్థులతో ప్రారంభమైన విట్ ఇప్పు డు వేలాది మంది విద్యార్థుల స్థాయికి ఎదిగి, న్యాయ విభాగాన్ని పరిచయం చేసుకుంటున్న స్థాయికి చేరుకుందన్నారు. సంస్థ వైస్ ప్రెసిడెంట్ శంకర్ విశ్వనాథన్, వైస్ చాన్సలర్ వీ రాజు, వైస్ చాన్సలర్ ఆనంద్ శామ్యూల్, వైస్ ప్రెసిడెంట్ శంకర్ విశ్వనాథన్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ కాదంబరి ఎస్ విశ్వనాథన్, డీన్ డాక్టర్ దినకర్ పాల్గొన్నారు.