వ్యవస్థలోనే లోపం
చెన్నై, సాక్షి ప్రతినిధి: వేలూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్) చెన్నై క్యాంపస్‌లో సోమవారం న్యాయ పాఠశాల ప్రారంభోత్సవానికి మాజీ న్యాయమూర్తి మోహన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యూరు. న్యాయ కళాశాల విద్యార్థుల శిక్షణ తరగతుల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, కోర్టుల్లో కేసులు పేరుకు పోతున్నాయని అందరూ చెబుతుంటారని, కానీ కేసుల సత్వర పరిష్కారానికి కోర్టుల సంఖ్య పెంచడం ఎంత మాత్రం పరిష్కా రం కాదన్నారు.
న్యాయమూర్తులు ఆలస్యంగా సీటులోకి చేరడం, పదే పదే వాయిదాలు వేయ డం, న్యాయవాదులు సైతం అకారణంగా వాయిదాలు కోరడం వంటి క్రమశిక్షణా రాహిత్యం పెచ్చుమీరిపోయిందని పేర్కొన్నారు. బార్ కౌన్సి ల్ నిబంధనల ప్రకారం ఈ కేసునైనా మూడు సార్లు మించి వాయిదా వేయరాదు. ఉదయం 10.30 గంటలకు విధిగా కోర్టు ప్రారంభం కావాలి, కేసులు వినాలి తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే మరో వాయిదా వేయాలని ఆయన అన్నారు. ఇదే విషయాన్ని ప్రస్తుత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి సైతం ఒక ఉత్తరం ద్వారా విన్నవించినట్లు తెలిపారు. తన సర్వీసులో పదేపదే వాయిదాలకు అనుమతించలేదని చెప్పా రు.
న్యాయవాదులు డ్రెస్‌కోడ్ కూడా పాటించకపోవడం విచారకరమన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సూచించిన డ్రెస్‌ను ధరించాలని సూచించారు. ‘సెయ్యుం తొళిలే దైవం’ (చేస్తున్న వృత్తి దైవంతో సమానం) అని మహాకవి భారతియార్ చెప్పిన సూక్తిని ప్రస్తావించారు. కేసులో గెలుపోటములు, ఆర్జించిన డబ్బు న్యాయవాదికి ముఖ్యం కాదు, చేపట్టిన కేసును సక్రమంగా వాదించామా లేదా అనేది గమనించుకోవాలని సూచించారు. బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు దైనందిన జీవితంలో ప్రతి దశలోనూ సర్టిఫికెట్ల ప్రాముఖ్యత ఉందంటే న్యాయవ్యవస్థ ఎంతటి కీలకమైనదో నేటి విద్యార్థులు గుర్తించాలని ఉద్బోధించారు. విట్ యూనివర్సిటీ విద్యారంగంలో ఒక తాజ్‌మహల్‌లా విరాజిల్లుతోందని ప్రశంసించారు.
తమిళనాడు ప్రభుత్వ మాజీ అడ్వకేట్ జనరల్ ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ, విద్యార్థి దశలోనే న్యాయవిద్యపై పూర్తిస్థాయిలో పట్టుసాధిం చాలని, అదే భవిష్యత్తుకు గట్టి పునాది అని ఉద్బోధించారు. న్యాయవిద్యను పూర్తి చేసి బయటకు వచ్చినంత మాత్రాన చదువు అయిపోలేదని, అనుభవాలను క్రోఢీకరించుకుంటూ నిత్య విద్యా ర్థి అనే భావనతో ఉన్నపుడే ఎదుగుదల సాధ్యమన్నారు. దేశ, బహుళజాతి కంపెనీల్లో న్యాయవాదుల పాత్ర విధిగా మారినందున నేటి న్యాయ విద్యార్థులకు మంచి గిరాకీ ఉందని అన్నారు.
విట్ చాన్సలర్ డాక్టర్ జీ విశ్వనాథన్ మాట్లాడుతూ, కోర్టుల్లో కేసులు ఏళ్ల తరబడి పేరుకుపోవడం ప్రధాన సమస్యగా మారిందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 30 మిలియన్ల కేసులు పరిష్కా రం కావాలంటే 320 ఏళ్లు పడుతుందని ఒక న్యాయమూర్తి తనతో అన్నట్లు చెప్పారు.
ఒక మిలియన్ కేసులకు 10.5 శాతం లెక్కన న్యాయమూర్తులు ఉన్నారని తెలిపారు. యూఎస్‌లో సాయంత్రం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా కోర్టులను నిర్వహిస్తారని, అది భారత్‌లో సాధ్యమవునో కాదో తెలియదన్నారు. భారత దేశంలో సమ్మెలు ఒక భాగమైపోయాయి,కోర్టులు ఈ సమ్మెల్లో భాగస్వాములు కాకూడదని ఆకాం క్షించారు. 1984లో కేవలం 180 మంది ఇం జనీరింగ్ విద్యార్థులతో ప్రారంభమైన విట్ ఇప్పు డు వేలాది మంది విద్యార్థుల స్థాయికి ఎదిగి, న్యాయ విభాగాన్ని పరిచయం చేసుకుంటున్న స్థాయికి చేరుకుందన్నారు. సంస్థ వైస్ ప్రెసిడెంట్ శంకర్ విశ్వనాథన్, వైస్ చాన్సలర్ వీ రాజు, వైస్ చాన్సలర్ ఆనంద్ శామ్యూల్, వైస్ ప్రెసిడెంట్ శంకర్ విశ్వనాథన్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ కాదంబరి ఎస్ విశ్వనాథన్, డీన్ డాక్టర్ దినకర్ పాల్గొన్నారు.