vit
-
ఇంజినీర్ విద్యార్ధి ఏఐ టెక్నాలజీ.. అమెరికన్ సైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్‌లోకి..
మనిషి అనుకుంటే సాధించలేనిది లేదని పుస్తకాల్లో చదువుకున్నాం. బుర్రకు పదునుపెడితే మనిషి మహానుభావుడవుతాడు.. తద్వారా గొప్ప అద్భుతాలను సృష్టిస్తాడు. దీనికి నిదర్శనమే వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VIT) విద్యార్ధి 'ప్రియాంజలి గుప్తా'. ఈమె గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VIT) విద్యార్ధి 'ప్రియాంజలి గుప్తా' కంప్యూటర్ సైన్స్ చదువుతోంది. ఈమె అమెరికన్ సైన్ లాంగ్వేజ్‌ని రియల్ టైమ్‌లో ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేసే ఒక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) రూపొందించింది. డేటా సైన్స్‌లో నైపుణ్యం కలిగి ప్రియాంజలి టెన్సార్‌ఫ్లో ఆబ్జెక్ట్ డిటెక్షన్ APIని ఉపయోగించి కొత్త మోడల్‌ను అభివృద్ధి చేసింది. ఇది ssd_mobilenet అనే ప్రీ-ట్రైన్డ్ మోడల్ ద్వారా సంకేతాలను అనువదించగలదు. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదీ చదవండి: ఎక్స్(ట్విటర్)లో మరో అప్డేట్? ఎలాన్ మస్క్ కొత్త వ్యూహం! వీడియోలో గమనించినట్లయితే.. తాను రూపొందించిన ఏఐ డెమోలో ఆరు సంజ్ఞలను ప్రదర్శించింది. అవి హలో, ఐ లవ్ యు, ప్లీజ్, యస్, నో, థాంక్స్ వంటివి ఉన్నాయి. భవిషత్తులో మరిన్ని సంజ్ఞలు రూపొంచే అవకాశం ఉంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కారు కొడుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. Priyanjali Gupta, Indian student from VIT university, Tamil Nadu has developed an algorithm that instantly translates sign language. 👏 pic.twitter.com/jvF1i1xTeA — Indian Tech & Infra (@IndianTechGuide) September 18, 2023 -
VIT Webinar: ఇంటర్ తర్వాత ఏంటి?
ఇంటర్ తర్వాత ఏ కోర్సు తీసుకుందామని ఆలోచిస్తున్నారా? సాధారణంగా ఇంటర్మీడియట్ కోర్సు అయిపోయిన తర్వాత కెరీర్లో ముందుకు సాగాలనుకునే వారికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇంటర్ పూర్తైన తర్వాత కొంతమంది సంప్రదాయ కోర్సు డిగ్రీ వైపు మళ్లితే.. మరికకొందరు ఇంజనీరింగ్, మెడిసిన్‌తో పాటు వృత్తి విద్యా కోర్సులను ఎంచుకుంటారు. అయితే మనం ఎంచుకునే మార్గం సరైనదా కాదా అనే డౌట్ చాలామందికి వస్తుంది. అలాంటి వారి సందేహాలు నివృత్తి చేసుకోవడానికి మే 18న సాక్షి, VIT AP యూనివర్సిటీ నిర్వహిస్తున్న 'కెరీర్ గైడెన్స్ వెబినార్'కు అటెండ్ అవ్వండి. మరి ఇంకెందుకు ఆలస్యం. వెబినార్ అటెండ్ అవ్వండి.. మీ సందేహాలు తీర్చుకొండి. To Register Logon: https://www.arenaone.in/webinar/ -
విఐటీ–ఏపీలో ‘స్టార్స్’ 3వ బ్యాచ్ ప్రారంభం
సాక్షి, అమరావతి: విఐటీ ఏపీ వర్సిటీలో ‘స్టార్స్’ 3వ బ్యాచ్ శుక్రవారం ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంత విద్యార్థుల ఉన్నత చదువులకు పేదరికం అడ్డుకాకూడదనే సంకల్పంతో తమ వర్సిటీ స్టార్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు విఐటీ–ఏపీ వర్సిటీ వైస్ ప్రెసిడెంట్ శంకర్ విశ్వనాథన్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ (ఎంపీసీ) చదివి జిల్లాలో మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థులకు విఐటీ–ఏపీ వర్సిటీలో నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సుతో పాటు వసతిని ఉచితంగా కల్పిస్తున్నామని వివరించారు. స్టార్స్ 3వ బ్యాచ్ కార్యక్రమాన్ని, వర్సిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన సింథటిక్ టెన్నిస్ కోర్టుని తాటికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి శుక్రవారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ..విఐటీ అంటే విజన్, ఇన్నోవేషన్, ట్రాన్స్ఫార్మేషన్ అని అభివరి్ణంచారు. స్టార్స్ 3వ బ్యాచ్ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లను అందజేశారు. కార్యక్రమంలో వర్సిటీ వీసీ డాక్టర్ డి.శుభాకర్, రిజి్రస్టార్ డాక్టర్ సీఎల్వీ శివకుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ (అడ్మిషన్స్) డాక్టర్ ఖాదర్ పాషా తదితరులు పాల్గొన్నారు. -
వీఐటీని సందర్శించిన అమెరికన్ కాన్సులేట్ బృందం
సాక్షి, అమరావతి: అమరావతిలోని వీఐటీ–ఏపీ యూనివర్సిటీని అమెరికన్ కాన్సులేట్ బృందం గురువారం సందర్శించింది. యూనివర్సిటీలో ల్యాబ్స్ , లైబ్రరీ, తరగతి గదులను పరిశీలించింది. అమెరికాలోని పర్ డ్యూ, న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీ, రోచెస్టర్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్, మిచిగాన్ డీర్ బోర్న్ యూనివర్సిటీలతో పాటు పలు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో తమ వర్సిటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని ఈ సందర్భంగా వీఐటీ–ఏపీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శేఖర్ విశ్వనాథన్ వివరించారు. ఇంటర్నేషనల్ ట్రాన్సఫర్ ప్రోగ్రాం ద్వారా బీటెక్ రెండు సంవత్సరాలు వీఐటీ ఏపీలో, మిగతా రెండేళ్లు అమెరికాలో చదివేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో చదివే విద్యార్థుల్లో ఎక్కువ మంది భారతీయులేనని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేవారే అధికమని కాన్సులెట్ వైస్ కౌన్సిల్ చార్లెస్ స్పెక్ట్ అన్నారు. రాబోయే రోజుల్లో అమెరికాలో విద్యని అభ్యసించేందుకు అవసరమైన స్కాలర్‌షిప్‌లపై అవహగాన కల్పించేందుకు విఐటీ–ఏపీతో కలిసి పని చేయనున్నట్లు కల్చరల్ అఫైర్స్ అసిస్టెంట్ సెంథిల్‌కుమార్ చెప్పారు. ఈ కార్యక్రమంలో కల్చరల్ అఫైర్స్ అసిస్టెంట్ సెంథిల్ కుమార్, యూఎస్ ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ రీజనల్ ఆఫీసర్ మోనికా సేటియా, వీఐటీ–ఏపీ వర్సిటీ వైస్‌చాన్సలర్ డాక్టర్ శుభకర్, రిజిస్ట్రార్ డాక్టర్ సిఎల్వీ శివకుమార్ పాల్గొన్నారు. -
ఏపీని ఎడ్యుకేషనల్ హబ్‌గా మారుస్తాం
-
నాలుగో ఏడాదీ ‘విట్’ రికార్డులు
వెల్లూర్: అత్యధిక మంది విద్యార్థులకు ఒకే స్లాట్‌లో ప్లేస్మెంట్లు సాధించిన విట్ యూనివర్సిటీ... వరుసగా నాలుగో ఏడాదీ లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిందని ఆ వర్సిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. 2015లో కోర్సులు పూర్తిచేసే విద్యార్థుల కోసం 2014 సెప్టెంబర్ 1 నుంచి 11వ తేదీ వరకు ఈ ప్లేస్మెంట్లు జరిగాయని తెలిపింది. నాలుగు ఐటీ కంపెనీలు వెయ్యి మందికిపైగా విద్యార్థులను తీసుకోగా... ఒక్క కాగ్నిజెంట్ సంస్థ 1911 మందిని రిక్రూట్ చేసుకుందని తెలిపింది. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన తమ ప్రవేశపరీక్షకు రికార్డు స్థాయిలో 2,02,406 మంది రిజిస్టర్ చేసుకున్నారని.. ఇలా రికార్డులను తిరగరాయడం తమ వర్సిటీకే చెల్లిందని విట్ వ్యవస్థాపకుడు, చాన్సలర్ జి.విశ్వనాథన్ పేర్కొన్నారు.