నాలుగో ఏడాదీ ‘విట్’ రికార్డులు | vit placed in limca book of records, said college sources | Sakshi
Sakshi News home page

నాలుగో ఏడాదీ ‘విట్’ రికార్డులు

Published Tue, Sep 1 2015 9:15 AM | Last Updated on Sun, Sep 3 2017 8:33 AM

అత్యధిక మంది విద్యార్థులకు ఒకే స్లాట్‌లో ప్లేస్‌మెంట్లు సాధించిన విట్ యూనివర్సిటీ... వరుసగా నాలుగో ఏడాదీ లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిందని ఆ వర్సిటీ ఒక ప్రకటనలో పేర్కొంది.

వెల్లూర్: అత్యధిక మంది విద్యార్థులకు ఒకే స్లాట్‌లో ప్లేస్‌మెంట్లు సాధించిన విట్ యూనివర్సిటీ... వరుసగా నాలుగో ఏడాదీ లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిందని ఆ వర్సిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. 2015లో కోర్సులు పూర్తిచేసే విద్యార్థుల కోసం 2014 సెప్టెంబర్ 1 నుంచి 11వ తేదీ వరకు ఈ ప్లేస్‌మెంట్లు జరిగాయని తెలిపింది. నాలుగు ఐటీ కంపెనీలు వెయ్యి మందికిపైగా విద్యార్థులను తీసుకోగా... ఒక్క కాగ్నిజెంట్ సంస్థ 1911 మందిని రిక్రూట్ చేసుకుందని తెలిపింది.

ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన తమ ప్రవేశపరీక్షకు రికార్డు స్థాయిలో 2,02,406 మంది రిజిస్టర్ చేసుకున్నారని.. ఇలా రికార్డులను తిరగరాయడం తమ వర్సిటీకే చెల్లిందని విట్ వ్యవస్థాపకుడు, చాన్సలర్ జి.విశ్వనాథన్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement