నాలుగో ఏడాదీ ‘విట్’ రికార్డులు
వెల్లూర్: అత్యధిక మంది విద్యార్థులకు ఒకే స్లాట్‌లో ప్లేస్మెంట్లు సాధించిన విట్ యూనివర్సిటీ... వరుసగా నాలుగో ఏడాదీ లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిందని ఆ వర్సిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. 2015లో కోర్సులు పూర్తిచేసే విద్యార్థుల కోసం 2014 సెప్టెంబర్ 1 నుంచి 11వ తేదీ వరకు ఈ ప్లేస్మెంట్లు జరిగాయని తెలిపింది. నాలుగు ఐటీ కంపెనీలు వెయ్యి మందికిపైగా విద్యార్థులను తీసుకోగా... ఒక్క కాగ్నిజెంట్ సంస్థ 1911 మందిని రిక్రూట్ చేసుకుందని తెలిపింది.
ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన తమ ప్రవేశపరీక్షకు రికార్డు స్థాయిలో 2,02,406 మంది రిజిస్టర్ చేసుకున్నారని.. ఇలా రికార్డులను తిరగరాయడం తమ వర్సిటీకే చెల్లిందని విట్ వ్యవస్థాపకుడు, చాన్సలర్ జి.విశ్వనాథన్ పేర్కొన్నారు.