రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే వెబ్ ఆప్షన్ల ప్రక్రియలో వన్‌టైమ్ పాస్‌వర్డ్ విధానాన్ని అమలు చేయాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. వెబ్‌సైట్లో విద్యార్థులు తమ వివరాలను ఇవ్వగానే వారి మొబైల్ నంబర్‌కు వన్‌టైమ్ పాస్‌వర్డ్ వచ్చేలా, దానితో లాగిన్ అయి ఆప్షన్లు ఇచ్చుకునేలా చర్యలు చేపట్టింది. ఈ వన్‌టైమ్ పాస్‌వర్డ్ 20 నిమిషాల పాటు పనిచేస్తుంది. మళ్లీ ఆప్షన్లు ఇచ్చుకోవాలంటే మళ్లీ వన్‌టైమ్ పాస్‌వర్డ్ పొందాల్సి ఉంటుంది.