సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఎంసెట్ ఇంజనీరింగ్ వెబ్ కౌన్సెలింగ్ మళ్లీ వాయిదా పడింది. జూలై 1వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియ అయిదో తేదీకి వాయిదా పడింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన విద్యార్థులు జూలై 5 నుంచి వెబ్ ఆప్షన్లు ద్వారా కోర్సు, కళాశాల ఎంపిక చేసుకోవచ్చు. కాగా కొన్ని కళాశాలలు కోర్టు కెళ్ళి ఫీజులు పెంచుకున్న విషయం తెలిసిందే. దీంతో కాలేజీలు ఫీజుల పెంపుపై ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లనుంది. ఈలోపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసి, ఆ కళాశాలల ఫీజుల వ్యవహారం తేలాకే వెబ్ ఆప్షన్లుకు అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment