సాగర్‌నగర్ (విశాఖపట్నం) : గీతం వర్సిటీ విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు క్యాంపస్‌లలో ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులలో ప్రవేశానికి జూన్9 వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు అడ్మిషన్ల డెరైక్టర్ కె. నరేంద్ర తెలిపారు. ఆన్‌లైన్ విధానంలో జరిగే ఈ అడ్మిషన్ కౌన్సెలింగ్ కోసం విశాఖ, హైదరాబాద్ సిటీ, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ రూద్రారం గీతం ప్రాంగణం, బెంగళూరు సిటీ , కర్ణాటకలోని దొడ్డబళ్ళాపూర్ ప్రాంగణంలో కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
జూన్9వ తేదీన 1నుంచి 5000 ర్యాంకు వరకు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. అలాగే 10వ తేదీన 5001 నుంచి 9500 ర్యాంకు వరకు, 11వ తేదీన 9501 నుంచి 14000 వరకు, 12వ తేదీన 14001 నుంచి 18500 వరకు, 13వ తేదీన 18501 నుంచి 23000 ర్యాంకు వరకు, 14వ తేదీన 23001 నుంచి 28000 ర్యాంకు వరకు అడ్మిషన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ప్రకటించారు. 14వ తేదీన మధ్యాహ్నం ఎం.ఫార్మసీ, ఎంటెక్ కోర్సులకు అడ్మిషన్ కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. విద్యార్థులు గీతం విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ www.gitam.edu నుంచి కౌన్సెలింగ్ కాల్ లెటర్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన సూచించారు.
జూన్ 9 నుంచి గీతం ఇంజనీరింగ్ అడ్మిషన్ కౌన్సెలింగ్
Published Sun, Jun 7 2015 8:21 AM | Last Updated on Sun, Sep 3 2017 3:23 AM
Advertisement