
గవర్నర్ గారూ.. న్యాయం చేయండి
ఇంజనీరింగ్ అడ్మిషన్లు, ఫీజు రీయింబర్స్మెంట్ తదితర అంశాలపై జోక్యం చేసుకోవాలని ఇరు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను కాంగ్రెస్ నాయకులు కోరారు. కౌన్సెలింగ్ నుంచి మొదలుపెట్టి ఫీజులు ఇవ్వడం వరకు ప్రతి విషయంలోను రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు, విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్నాయని, ఇలాంటి తరుణంలో గవర్నర్ జోక్యం చేసుకుని విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి ప్రమాదం రాకుండా చూడాలని కోరారు.
ఆలస్యం అయ్యేకొద్దీ వారు విద్యాసంవత్సరాన్ని నష్టపోవాల్సి వస్తుందని, అలాగే ఇప్పటికే రెండో సంవత్సరం, మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థుల ఫీజుల విషయం కూడా ప్రశ్నార్థకంగానే ఉందని చెప్పారు. గవర్నర్ను కలిసిన వారిలో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, బొత్స సత్యానారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, సి.రామచంద్రయ్య తదితరులున్నారు.