రేపు ఎంబీఏ, ఎంసీఏ సీట్ల కేటాయింపు జాబితా వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-2013 తొలి విడత కౌన్సెలింగ్ అనంతరం ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న సీట్ల వివరాలను సాంకేతిక విద్యాశాఖ పొందుపరిచింది. ఎంసెట్ వెబ్‌సైట్ https://apeamcet.nic.inలో ‘ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్’ అన్న లేబుల్‌ను క్లిక్ చే సి కళాశాల, బ్రాంచీల వారీగా ఖాళీగా ఉన్న సీట్ల వివరాలను చూడొచ్చు. తొలి విడతలో సీటు లభించినప్పటికీ రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనదలిచిన అభ్యర్థులు ప్రస్తుతం లభించిన సీటు కంటే మెరుగైన సీట్లకే ఆప్షన్ ఇచ్చుకోవాలని సాంకేతిక విద్యాశాఖ తెలిపింది. అభ్యర్థికి రెండో విడతలో దక్కిన సీటు మాత్రమే ఖరారవుతుందని స్పష్టంచేసింది.
ఫీజులను చూసి మోసపోని విద్యార్థులు
రాష్ట్రంలోని కొన్ని కళాశాలలు బోధనలో నాణ్యత లేనప్పటికీ ఫీజులను మాత్రం రూ.60 వేలు, రూ.70 వేల వరకు ప్రతిపాదించాయి. అయితే వీటిలో బోధన, ఉత్తీర్ణత, వసతులు నామమాత్రంగానే ఉన్నాయని గ్రహించిన విద్యార్థులు వాటిని తిరస్కరించారు. రాజధాని, చుట్టుపక్కల ప్రాంతాల్లోని కొన్ని అత్యధిక ఫీజులు ఉన్న కాలేజీల్లో ఖాళీగా ఉన్న సీట్ల వివరాలను చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. నాణ్యత ఉండి ఫీజు రూ.35 వేలు ఉన్న కాలేజీల్లో కూడా సీట్లు పూర్తిగా భర్తీ అయ్యాయి. అలాగే నాణ్యత ఉండి లక్ష వరకు ఫీజులు ఉన్నా సీట్లు మొత్తం భర్తీ అయిన కళాశాలలూ ఉన్నాయి.
ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు ముగిసిన కౌన్సెలింగ్
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న వెబ్‌కౌన్సెలింగ్ శుక్రవారంతో ముగియనుంది. శనివారం సీట్ల కేటాయింపు జాబితాను వెల్లడించనున్నట్టు అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి డాక్టర్ కె.రఘునాథ్ వెల్లడించారు.
ఎంసెట్ వెబ్‌సైట్‌లో ఖాళీల వివరాలు
Published Fri, Sep 20 2013 1:39 AM | Last Updated on Fri, Sep 1 2017 10:51 PM
Advertisement
Advertisement