
సాక్షి, హైదరాబాద్ : ఇంజనీరింగ్ సీట్లు ఇప్పిస్తానని చెప్పి రూ.5లక్షలు వసూలు చేసి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న నారాయణ కాలేజీ ఏఓను బుధవారం వనస్థలీపురం పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణ కాలేజీ ఏఓ రఘు విద్యార్థులకు ఇంజనీరింగ్ సీట్లు ఇప్పిస్తానని చెప్పి దాదాపు 5లక్షల రూపాయలు వసూలు చేశాడు. రఘు వారికి సీట్లు ఇప్పించకపోవటంతో ఇద్దరు విద్యార్థులు విద్యాసంవత్సరాన్ని కోల్పోయారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు వనస్థలీపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఏఓ రఘుపై కేసు నమోదు చేసిన పోలీసులు అతనితో పాటు ప్రశాంత్‌రెడ్డి అనే మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment