సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశాలు దారుణంగా పడిపోయాయి. సుమారుగా రెండు లక్షల ఇంజనీరింగ్ సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు సంబంధించి ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్ పూర్తయిపోగా, 32 కళాశాలల్లో ఒక్క అడ్మిషనూ రాలేదు. తొలి విడత కౌన్సెలింగ్‌లో ఒక్క అడ్మిషన్ రానీ కళాశాలలు 13 ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్య 32కు చేరింది. తుది విడత సీట్ల కేటాయింపు వివరాలను ఎంసెట్ అడ్మిషన్ల కన్వీనర్ ఆదివారం రాత్రి ఎస్.ఎం.ఎస్. ద్వారా అభ్యర్థులకు చేరవేశారు. కన్వీనర్ కోటాలో ఇంజనీరింగ్ సీట్లు 1,02,105, ఫార్మసీ సీట్లు 8,345 మిగిలిపోయాయి. వీటికి అదనంగా యాజమాన్య కోటాలో దాదాపు లక్ష సీట్లు ఖాళీగా ఉన్నట్టు అంచనా. అంటే ఈ ఏడాది కన్వీనర్, యాజమాన్య కోటాలో కలిపి మొత్తంగా 2 లక్షలకుపైగా ఇంజనీరింగ్ సీట్లు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అడ్మిషన్ల విషయంలో నాణ్యతలేని కళాశాలలు ఈ ఏడాది ఘోరంగా దెబ్బతిన్నాయి.
అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభం కావడంతో దాదాపు 40 వేల మంది రాష్ట్ర విద్యార్థులు డీమ్‌డ వర్సిటీలు, పొరుగు రాష్ట్రాల్లోని ప్రైవేటు వర్సిటీల్లో చేరిపోయారు. 2,19,729 మంది ఎంసెట్‌లో అర్హత సాధించినప్పటికీ ఉపాధి అవకాశాలు కరువవడంతో కేవలం 1,31,396 మంది మాత్రమే కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపారు. తుది విడత కౌన్సెలింగ్‌లో సీటు పొంది న అభ్యర్థులు ఎంసెట్ వెబ్‌సైట్ నుంచి అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకుని, ఫీజును చెల్లించాల్సిన వారు చలానా ద్వారా ఇండియన్ బ్యాంకు, లేదా ఆంధ్రా బ్యాంకులో చెల్లించి అక్టోబర్ 5లోగా కళాశాలలో రిపోర్‌ట చేయాలని అడ్మిషన్ల కన్వీనర్ సూచించారు. అడ్మిషన్ రద్దు చేసుకోదలచిన అభ్యర్థులు హెల్‌పలైన్ సెంటర్‌లో అక్టోబర్ 7లోపు సంప్రదించి రద్దు చేసుకుని సర్టిఫికెట్లు వెనక్కి తీసుకోవచ్చు. కళాశాలలో రిపోర్‌ట చేసినప్పటికీ అక్టోబర్ 7వ తేదీ అనంతరం రద్దు చేసుకోదలచిన అభ్యర్థులు కళాశాల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకుని అక్టోబర్ 10వ తేదీ తరువాత మాసాబ్‌ట్యాంకులోని సాంకేతిక విద్యాభవన్‌లో సర్టిఫికెట్లు పొందవచ్చు.
స్పాట్ అడ్మిషన్లకు అక్టోబర్ 8 నుంచి 23వ తేదీ మధ్య నోటిఫికేషన్ జారీచేయనున్నట్టు అడ్మిషన్ల కన్వీనర్ తెలిపారు. భర్తీ తీరు: 55 కళాశాలల్లో 5 లోపు మాత్రమే అడ్మిషన్లు వచ్చాయి. 20 లోపు మాత్రమే అడ్మిషన్లు ఉన్న కాలేజీల సంఖ్య 102గా ఉంది. 100 సీట్ల లోపు నిండిన కళాశాలలు 260 ఉన్నాయి. దీంతో వీటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. మొత్తం 609 ప్రైవేటు, 34 యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలు, 266 ప్రైవేటు ఫార్మసీ, 12 యూనివర్సిటీ ఫార్మసీ కళాశాలలు కౌన్సెలింగ్‌లో పాల్గొనగా.. 1,24,140 సీట్లు భర్తీ అయ్యాయి. ఠ తుది విడతకు 2 కోర్సులకు కలిపి 1,23,085 సీట్లు అందుబాటులో ఉండగా 28,023 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. తొలి విడతలో 1,26,390 మంది సీట్లు పొందినప్పటికీ కేవలం 1,11,505 మంది మాత్రమే కళాశాలల్లో రిపోర్‌ట చేశారు. ఫార్మసీలో మిగిలిన 8,345 సీట్లను బైపీసీ విభాగం ఎంసెట్ కౌన్సెలింగ్‌కు బదిలీ చేయనున్నారు.
2 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఖాళీ !
Published Mon, Sep 30 2013 4:33 AM | Last Updated on Fri, Sep 1 2017 11:10 PM
Advertisement
Advertisement