ఎస్కేయూ :
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమో ఇన్ ఇంటిగ్రేటేడ్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ (పీజీ డీఐఎస్‌ఎం) కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, రక్షా అకాడమీ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా డిప్లమో కోర్సును సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. కామర్స్, లా, మేనేజ్‌మెంట్, సైన్సెస్ డిగ్రీలో 50 శాతం ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తుకు అర్హులు. ఈ నెల 15 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారికి కొడికొండ చెక్‌పోస్టు వద్ద గల రక్షా అకాడమీలో ఏడాది పాటు శిక్షణ ఇస్తారు. ఆర్మీ, పోలీసు ఫోర్స్‌లలో ఉద్యోగాలు సాధించడానికి ఈ డిప్లమో కోర్సు దోహదపడుతుంది.