గ్రాడ్యుయేషన్ వేడుకలో యజమాని తోపాటు డిగ్రీ అందుకుని విస్మయపరిచింది ఓ శునకం. ఆ కుక్క తన యజమాని తోపాటు ప్రతి తరగతికి క్రమంత తప్పకుండా అటెండెంట్ అయ్యింది. దీంతో ఆ వేడుకలో స్టేజ్‌పై ఆ కుక్కకి డిప్లొమా డిగ్రీ అందజేసింది సదరు యూనివర్సిటీ.
వివరాల్లోకెళ్తే..యూఎస్‌లోని న్యూజెర్సీలోని సెటన్ హాల్ యూనివర్సిటీలో జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుకలో జస్టిన్ అనే సర్వీస్ డాగ్ డిప్లోమా డిగ్రీని అందుకుని అందర్నీ ఆకర్షించింది. సెటన్ హాల్‌కి చెందని జోసెఫ్ నైర్ గ్రేస్ మరియాని, తన కుక్క జస్టిన్‌లు ఈ వేడుకలో డిగ్రీలను అందుకున్నారు. మరియాని బ్యాచిలర్ ఆప్ సైన్స్ ఇన్ ఎడ్యుకేషన్ డిగ్రీతో పట్టుభద్రురాలైంది. ఆమె కుక్క యూనివర్సిటీలో ఉన్న అన్ని సమయాల్లో ఆమె పక్కనే ఉండి అన్ని తరగతులకు హజరయ్యి.. యజమాని పట్ల అచంచలమైన అంకితభావంతో పనిచేసింది.
అందుకు గాను గ్రాడ్యుయేషన్ వేడుకలో ఆమెకు డిప్లొమా డిగ్రీని ప్రధానం చేశారు. తన యజమాని మరియాని తోపాటు ఆ కుక్క అన్ని శిక్షణా తరుగుతుల్లో ఉండటం అనేది చాలా అరుదైన విషయం అని ప్రశంసిస్తూ యూనివర్సిటీ ఈ డిగ్రీని సదరు కుక్కకి బహుకరించింది. ఇక మరియాని తన కుక్క సహచర్యంతోనే ప్రాథమిక పాఠశాలలో భోదించాలని భావిస్తున్నట్లు పేర్కొంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Seton Hall President Joseph E. Nyre, Ph.D. presents Justin, the service dog for Grace Mariani, of Mahwah, NJ, with a diploma for attending all of Grace’s classes at Seton Hall. pic.twitter.com/sZgHD5Fs3X
— Seton Hall (@SetonHall) May 23, 2023
(చదవండి: శునకాన్ని చిన్నపాటి కొమ్మతో అదిలించాడు..అంతే అది రెచ్చిపోయి...)
Comments
Please login to add a commentAdd a comment