
డోన్ రూరల్: తాను చదవలేకపోతున్నానంటూ డోన్ పట్టణంలోని శ్రీరామ నగర్ కాలనీకి చెందిన కె.ప్రియాంక (20) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీరామ నగర్ కాలనీలో నివాసముండే కటికె రాముడు కుమార్తె ప్రియాంక. ఏడాది క్రితం స్థానికంగా డిప్లొమా పూర్తి చేసింది. పైచదువులకు వెళ్లాలని తల్లిదండ్రులు సూచించారు. అయితే..తాను చదవలేకపోతున్నానంటూ ఇంటి వద్దనే ఉండిపోయింది. చాలారోజులుగా ఇదే దిగులుతో ఉండేది. ఈ నేపథ్యంలో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి రాముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీహరి తెలిపారు.