
విద్యార్థిపై పోలీస్ జూలుం
విద్యార్థిపై పోలీస్ జూలుం
మంత్రాలయం రూరల్, : మాధవరంలో సోమవారం పోలీసులు ఓ విద్యార్థిని అకారణంగా చితకబాదారు. మాధవరం గ్రామానికి చెందిన షేక్ ఖాజవలి డిప్లోమా చదువుతున్నాడు.
రోడ్డుపై అడ్డంగా నిలుచున్నాడనే కారణంతో ఎస్‌ఐ చంద్రమెహన్, కానిస్టేబుల్ రామాకృష్ణ స్టేషన్‌కు పిలిపించారు. అనంతరం కానిస్టేబుల్ విద్యార్థిని కొట్టాడు. విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు సోమవారం స్టేషన్ ముందు బెఠాయించారు. కారణం లేకుండా ఎలా కొడతారని నిలదీయగా తనకేమీ తెలియదని ఎస్‌ఐ సమాధానం ఇచ్చారు. విచారణ చేపట్టి సదరు కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించారు.