అమెరికా: అమెరికాలో ఒక హై స్కూల్లో స్టేజి మీద డాన్స్ చేసినందుకు ఓ విద్యార్థినికి డిప్లొమా పట్టా ఇవ్వడానికి నిరాకరించారు ఆ స్కూలు ప్రిన్సిపాల్. దీంతో ఇన్నేళ్ల శ్రమ మొత్తం బూడిదలో పోసినట్టయ్యిందని ఆ విద్యార్థిని తోపాటు ఆమె తల్లిదండ్రులు వాపోతున్నారు.
జూన్ 9న ఫిలడెల్ఫియా బాలికల హై స్కూల్ స్నాతకోత్సవంలో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తమ పిల్లలు డిగ్రీలు స్వీకరిస్తున్న సమయంలో ఎలాంటి గోల, అరుపులు చేయవద్దని.. కనీసం చప్పట్లు కూడా కొట్టవద్దని స్ట్రిక్ట్ గా చెప్పింది స్కూల్ యాజమాన్యం. దీంతో నిశ్శబ్ద వాతావరణంలో పట్టా ప్రదానోత్సవం జరుగుతుండగా హఫ్సా అబ్దుల్ రహ్మాన్ అనే అమ్మాయి తన పేరు పిలవగానే స్టేజి మీదకు వచ్చింది. కానీ డిగ్రీ పట్టా సాధిస్తున్నానన్న సంతోషంలో ఉండబట్టలేక చిన్నగా చిందేసింది. అదికాస్తా ప్రిన్సిపాల్ దృష్టిలో పడేసరికి ఆమెకు పట్టా అందివ్వలేదు సరికదా మర్యాదగా స్టేజి విడిచి వెళ్ళమని ఆదేశించారు.
దీంతో స్టేజి విడిచి వెళ్లిన హఫ్సా అబ్దుల్ రహ్మాన్ ప్రిన్సిపాల్ పట్టా అందివ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసింది. నేనే తప్పూ చేయలేదు, ఏ నిబంధనను అతిక్రమించలేదని తెలిపింది. ఇదే స్నాతకోత్సవంలో హఫ్సా తనతో పాటు 2014లో కాల్పుల్లో చనిపోయిన తన సోదరి ఐషా తరపున కూడా డిగ్రీ పట్టా స్వీకరించాల్సి ఉంది. కానీ అంతలోనే ఆమెను స్టేజి విడిచి వెళ్ళమనడంతో బోరున ఏడ్చేసింది.
హఫ్సా తల్లి మాట్లాడుతూ.. నాలుగేళ్లపాటు కోవిడ్ సమయంలో మానసికంగానూ, శారీరకంగానూ చాలా ఇబ్బందులు ఎదుర్కొని చదువుకున్నారని. ప్రిన్సిపాల్ ఇలా చేయడం అమానుషమని అన్నారు.
Controversy at Philadelphia Girls' High School as Muslim graduate Hafsah Abdur-Rahman's diploma denied on stage for a celebratory dance.
Despite the district's apology, her family calls for rule changes. pic.twitter.com/qbiIG0Rlr7
— Middle East Eye (@MiddleEastEye) June 18, 2023
ఇది కూడా చదవండి: మోస్ట్ వాంటెడ్ ఖలిస్థాన్ ఉగ్రవాది హతం..
Comments
Please login to add a commentAdd a comment