జీఆర్ఎస్ఈలో 256 అప్రెంటిస్‌లు
కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్(జీఆర్ఎస్ఈ).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం ఖాళీల సంఖ్య: 256
» ఖాళీల వివరాలు: ట్రేడ్ అప్రెంటిస్ (ఎక్స్–ఐటీఐ)–170, ట్రేడ్ అప్రెంటిస్ (ఫ్రెషర్)–40, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్–16, టెక్నీషియన్ అప్రెంటిస్–30.
» ట్రేడ్ అప్రెంటిస్(ఎక్స్–ఐటీఐ): ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, పైప్ ఫిట్టర్, కార్పెంటర్, డ్రాఫ్ట్స్‌మెన్, పెయింటర్ తదితరాలు. అర్హత: సంబంధిత ట్రేడులో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్‌తోపాటు క్రాఫ్ట్స్‌మెన్ ట్రెయినింగ్ స్కీమ్ కోసం ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 14 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి.
» ట్రేడ్ అప్రెంటిస్(ఫ్రెషర్): ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, పైప్ ఫిట్టర్. అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 14ఏళ్ల నుంచి 20ఏళ్ల మధ్య ఉండాలి.
» గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్. అర్హత: 2018, 2019, 2020లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులైనవారు మాత్రమే అర్హులు. ఎంఈ/ఎంటెక్/ఎంబీఏ అభ్యర్థులు అర్హులు కాదు. వయసు: 14ఏళ్ల నుంచి 26ఏళ్ల మధ్య ఉండాలి.
» టెక్నీషియన్ అప్రెంటిస్: విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, సివిల్. అర్హత: 2018, 2019, 2020లో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 14 నుంచి 26ఏళ్ల మధ్య ఉండాలి.
» ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 01.10.2021
» వెబ్సైట్: https://apprenticeshipindia.org
చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్‌లో 492 అప్రెంటిస్‌లు
చిత్తరంజన్(పశ్చిమ బంగ)లోని చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్.. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం ఖాళీల సంఖ్య: 492
» ట్రేడులు: ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, రిఫ్రిజిరేషన్స్ అండ్ ఏసీ మెకానిక్స్, పెయింటర్.
» అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ(ఎన్సీవీటీ) ఉత్తీర్ణులవ్వాలి.
» వయసు: 15.09.2021 నాటికి 15ఏళ్ల నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి.
» ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ/ఓరల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది:03.10.2021
» వెబ్సైట్: https://clw.indianrailways.gov.in
ఎస్ఈసీఎల్, బిలాస్పూర్లో 450 అప్రెంటిస్‌లు
బిలాస్‌పూర్‌లోని సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం ఖాళీల సంఖ్య: 450
» ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ మైనింగ్–140, టెక్నీషియన్ అప్రెంటిస్ మైనింగ్/మైన్ సర్వేయింగ్–310.
» అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
» వయసు: 05.10.2021 నాటికి 18ఏళ్లు నిండి ఉండాలి.
» వేతనం: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు నెలకు రూ.9000, టెక్నికల్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.8000 చెల్లిస్తారు.
» ఎంపిక విధానం: డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 05.10.2021
» వెబ్సైట్: www.secl.cil.in
ఎస్ఈసీఆర్, బిలాస్పూర్ డివిజన్లో 432 అప్రెంటిస్‌లు
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే(ఎస్ఈసీఆర్), బిలాస్పూర్ డివిజన్.. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం ఖాళీల సంఖ్య: 432
» ట్రేడులు: కోపా, స్టెనోగ్రాఫర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వైర్‌మెన్, వెల్డర్, ప్లంబర్, పెయింటర్, కార్పెంటర్ తదితరాలు.
» అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
» వయసు: 01.07.2021 నాటికి 15ఏళ్ల నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి.
» ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దర ఖాస్తులకు చివరి తేది:10.10.2021
» వెబ్సైట్: https://secr.indianrailways.gov.in
Comments
Please login to add a commentAdd a comment