Engineering branch
-
బూమ్.. బూమ్ సాఫ్ట్వేర్.. కంప్యూటర్ కోర్సులదే హవా..
మచిలీపట్నం(కృష్ణా జిల్లా): ఒకప్పుడు ఎవర్‌గ్రీన్‌గా వెలుగొందిన మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్ కోర్సుల నిర్వహణ నేడు ప్రశ్నార్థకమవుతోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సాఫ్ట్వేర్ బూమ్‌తో ఇంజినీరింగ్ విద్యలో కంప్యూటర్ కోర్సుల హవా కొనసాగుతోంది. గత కొన్నేళ్లుగా విద్యార్థుల నుంచి కంప్యూటర్ కోర్సునకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. ఇదే క్రమంలో కోర్ బ్రాంచ్‌లుగా పేరున్న మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లకు ఆదరణ తగ్గుతోంది. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా కొత్త కొత్త కంప్యూటర్ కోర్సులను నిర్వహించుకునేలా అవకాశం కల్పించాలని కాలేజీల యాజమాన్యాలు సాంకేతిక విద్యాశాఖకు దరఖాస్తు చేస్తున్నాయి. చదవండి: వీటిని ఎక్కువ కాలం వాడుతున్నారా?.. అయితే డేంజర్లో పడ్డట్టే! ఇదే సాక్ష్యం.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 30 ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. 2021–22 విద్యా సంవత్సరంలో అన్ని కాలేజీల్లో కలిపి 13,283 సీట్లు భర్తీకి సాంకేతిక విద్యాశాఖ నుంచి అనుమతులు ఉన్నాయి. మూడు విడతలుగా జరిగిన కౌన్సెలింగ్, అదే విధంగా మేనేజ్మెంట్ కోటాతో కలుపుకొని 9,396 సీట్లు భర్తీ అయ్యాయి. వీటిలో కంప్యూటర్స్, దీనికి అనుబంధ కోర్సులకు 95 నుంచి 100 శాతం డిమాండ్ ఉంటే.. మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్‌లో 30 శాతం మాత్రమే నిండాయి. ఈ రెండు బ్రాంచ్‌ల్లో ఏడు కాలేజీల్లో ఒక్క సీటు కూడా భర్తీ కాకపోగా, మరో 13 కాలేజీల్లో పది లోపే విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఎందుకిలా.. ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్వేర్ రంగం రాజ్యమేలుతోంది. కంప్యూటర్ కోర్సులు చేసిన వారికే వీటిలో అవకాశాలు దక్కుతున్నాయి. క్యాంపస్ ప్లేస్మెంట్లలో కంప్యూటర్ ఇంజినీర్లదే పైచేయిగా నిలుస్తోంది. కోర్ బ్రాంచ్‌లు చదువుకుని అటువైపు వెళ్లిన విద్యార్థులకు మళ్లీ కంప్యూటర్ సంబంధిత కోర్సుల్లో ప్రావీణ్యంపై పరీక్ష పెడుతున్నారు. దీంతో మెకానికల్, సివిల్ ఇంజినీర్లు చాలా మంది ప్రత్యామ్నాయాలు వెతుక్కోవాల్సి వస్తోంది. కొత్త కంప్యూటర్ కోర్సుల కోసం.. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్(సీఎస్ఈ) కోర్సుకు ఉన్న డిమాండ్‌తో దీనికి అనుబంధంగా కొత్త కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ అండ్ మెషిన్ లెరి్నంగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిజినెస్ సిస్టమ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్, ఐవోటీ, ఆటోమేషన్ ఇలా వివిధ రకాల కోర్సుల కోసమని కాలేజీల నుంచి సాంకేతిక విద్యాశాఖకు దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. పూర్వవైభవం తీసుకొచ్చేలా.. విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సాంకేతిక కోర్సుల నిర్వహణపై కూడా దృష్టి సారించింది. కోర్సు ఏదైనా నైపుణ్యానికి పెద్ద పీట వేసేలా మార్పునకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చేపడుతున్న కార్యక్రమాలతో నిర్మాణ, పారిశ్రామిక రంగాలు మళ్లీ పుంజుకుంటుండటంతో మెకానికల్, సివిల్ ఇంజినీర్లకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఇదే ఊపును కొనసాగించేలా కోర్ బ్రాంచ్‌లకు కొత్తరూపు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. నైపుణ్యం అవసరం.. ఉన్నత విద్యలో ఏ కోర్సు ఎంచుకున్నా, దానిలో నైపుణ్యం ఉన్న వారికే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అందుకనే ఉన్నత విద్యలో ప్రక్షాళన దిశగా ప్రభుత్వం దృష్టి సారించింది. ఇంజినీరింగ్‌లో కంప్యూటర్స్, సివిల్, మెకానికల్‌లో దేని ప్రాముఖ్యత దానిదే. – డాక్టర్ ఎం. రామిరెడ్డి, రిజిస్ట్రార్, కృష్ణావర్సిటీ అవి ఎప్పటికీ ఎవర్గ్రీన్ కోర్ బ్రాంచ్‌లైన మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీర్లకు ఎప్పటికీ ఆదరణ ఉంటుంది. ఏ రంగమైనా యంత్రాలు లేకుండా ముందుకెలా నడుస్తుంది. ఈ కోర్ సబ్జెక్టుల ప్రాధాన్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. అయితే విద్యార్థులు సాఫ్ట్‌వేర్‌పైనే మక్కవ పెంచుకుంటున్నారు. -డాక్టర్ జ్యోతిలాల్, ఇంజినీరింగ్ అధ్యాపకుడు, నూజివీడు మెకానికల్ మంచిదే.. ఆటోమేషన్ వల్ల ఇంజినీర్లకు పనితగ్గింది. అయినప్పటికీ గుండు సూది నుంచి రైలు ఇంజిన్ వరకు తయారీలో మెకానికల్ ఇంజినీర్ ఉండాల్సిందే. కంప్యూటర్ సైన్స్‌కు ఎంత డిమాండ్ ఉన్నా అన్ని వ్యవస్థలకు ఆధారం మెకానికల్. -వి. ఎలీషా దేవసహాయం, సీనియర్ మెకానికల్ ఇంజినీర్, సాంకేతిక విద్యాశాఖ -
డిప్లొమా, ఇంజనీరింగ్, ఐటీఐ అప్రెంటిస్ ఖాళీలు
జీఆర్ఎస్ఈలో 256 అప్రెంటిస్‌లు కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్(జీఆర్ఎస్ఈ).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం ఖాళీల సంఖ్య: 256 » ఖాళీల వివరాలు: ట్రేడ్ అప్రెంటిస్ (ఎక్స్–ఐటీఐ)–170, ట్రేడ్ అప్రెంటిస్ (ఫ్రెషర్)–40, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్–16, టెక్నీషియన్ అప్రెంటిస్–30. » ట్రేడ్ అప్రెంటిస్(ఎక్స్–ఐటీఐ): ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, పైప్ ఫిట్టర్, కార్పెంటర్, డ్రాఫ్ట్స్‌మెన్, పెయింటర్ తదితరాలు. అర్హత: సంబంధిత ట్రేడులో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్‌తోపాటు క్రాఫ్ట్స్‌మెన్ ట్రెయినింగ్ స్కీమ్ కోసం ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 14 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. » ట్రేడ్ అప్రెంటిస్(ఫ్రెషర్): ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, పైప్ ఫిట్టర్. అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 14ఏళ్ల నుంచి 20ఏళ్ల మధ్య ఉండాలి. » గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్. అర్హత: 2018, 2019, 2020లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులైనవారు మాత్రమే అర్హులు. ఎంఈ/ఎంటెక్/ఎంబీఏ అభ్యర్థులు అర్హులు కాదు. వయసు: 14ఏళ్ల నుంచి 26ఏళ్ల మధ్య ఉండాలి. » టెక్నీషియన్ అప్రెంటిస్: విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, సివిల్. అర్హత: 2018, 2019, 2020లో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 14 నుంచి 26ఏళ్ల మధ్య ఉండాలి. » ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు. » దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. » ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 01.10.2021 » వెబ్సైట్: https://apprenticeshipindia.org చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్‌లో 492 అప్రెంటిస్‌లు చిత్తరంజన్(పశ్చిమ బంగ)లోని చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్.. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం ఖాళీల సంఖ్య: 492 » ట్రేడులు: ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, రిఫ్రిజిరేషన్స్ అండ్ ఏసీ మెకానిక్స్, పెయింటర్. » అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ(ఎన్సీవీటీ) ఉత్తీర్ణులవ్వాలి. » వయసు: 15.09.2021 నాటికి 15ఏళ్ల నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. » ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ/ఓరల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపికచేస్తారు. » దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. » ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది:03.10.2021 » వెబ్సైట్: https://clw.indianrailways.gov.in ఎస్ఈసీఎల్, బిలాస్పూర్లో 450 అప్రెంటిస్‌లు బిలాస్‌పూర్‌లోని సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం ఖాళీల సంఖ్య: 450 » ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ మైనింగ్–140, టెక్నీషియన్ అప్రెంటిస్ మైనింగ్/మైన్ సర్వేయింగ్–310. » అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. » వయసు: 05.10.2021 నాటికి 18ఏళ్లు నిండి ఉండాలి. » వేతనం: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు నెలకు రూ.9000, టెక్నికల్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.8000 చెల్లిస్తారు. » ఎంపిక విధానం: డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. » దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. » ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 05.10.2021 » వెబ్సైట్: www.secl.cil.in ఎస్ఈసీఆర్, బిలాస్పూర్ డివిజన్లో 432 అప్రెంటిస్‌లు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే(ఎస్ఈసీఆర్), బిలాస్పూర్ డివిజన్.. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం ఖాళీల సంఖ్య: 432 » ట్రేడులు: కోపా, స్టెనోగ్రాఫర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వైర్‌మెన్, వెల్డర్, ప్లంబర్, పెయింటర్, కార్పెంటర్ తదితరాలు. » అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. » వయసు: 01.07.2021 నాటికి 15ఏళ్ల నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. » ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. » దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. » ఆన్లైన్ దర ఖాస్తులకు చివరి తేది:10.10.2021 » వెబ్సైట్: https://secr.indianrailways.gov.in -
రేపటి నుంచి ఏపీఈఏపీ సెట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్టు (ఏపీఈఏపీసెట్)–2021 గురువారం (ఈనెల 19వ తేదీ) నుంచి ప్రారంభం కానుంది. కంప్యూటర్ ఆధారిత విధానం (సీబీటీ)లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఉన్నత విద్యామండలి, సెట్ నిర్వహణ సంస్థ అయిన కాకినాడ జేఎన్టీయూ ఏర్పాట్లు పూర్తిచేశాయి. నీట్‌తో మెడికల్ సీట్లు వేరేగా భర్తీ అవుతుండడంతో.. గతంలో ఏపీఎంసెట్గా ఉన్న ఈ పరీక్ష పేరును ఏపీఈఏపీసెట్‌గా మార్చిన విషయం తెలిసిందే. ఇంజనీరింగ్ స్ట్రీమ్ విద్యార్థులకు ఈనెల 19, 20, 23, 24, 25 తేదీల్లో మొత్తం 10 సెషన్లలోను, అగ్రి, ఫార్మసీ స్ట్రీమ్ విద్యార్థులకు సెప్టెంబర్ 3, 6, 7 తేదీల్లో మొత్తం 6 సెషన్లలోను పరీక్ష నిర్వహించనున్నారు. మన రాష్ట్రంలోను, తెలంగాణలోను మొత్తం 120 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో 1.75 లక్షల మంది అభ్యర్థులు ఏపీఈఏపీ సెట్–2021కు మొత్తం 2,59,564 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,26,156 మంది మహిళలు కాగా, 1,33,408 మంది పురుష అభ్యర్థులు. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు 1,75,796 మంది, అగ్రికల్చర్, ఫార్మా స్ట్రీమ్‌కు 83,051 మంది దరఖాస్తు చేశారు. 717 మంది రెండు స్ట్రీమ్‌లలో పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేశారు. దరఖాస్తు చేసిన మహిళల్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు 70,072 మంది, అగ్రి, ఫార్మా స్ట్రీమ్‌కు 55,686 మంది.. రెండు పరీక్షలు రాసేందుకు 398 మంది ఉన్నారు. పురుషుల్లో ఇంజనీరింగ్‌కు 1,05,724 మంది, అగ్రి, ఫార్మాకు 27,365 మంది, రెండు పరీక్షలకు 319 మంది దరఖాస్తు చేశారు. 70 మంది ఉర్దూ మాధ్యమాన్ని, మిగతావారు తెలుగు, ఆంగ్ల మాధ్యమాలను ఎంపిక చేసుకున్నారు. 23 మంది సహాయక లేఖరికోసం విన్నవించారు. పరీక్షలో 160 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో కూడిన ప్రశ్నపత్రం తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ఉంటుంది. ఉర్దూ మాధ్యమం వారికి ప్రత్యేక కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షకు ఇప్పటికే 1.72 లక్షల మంది హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారని ఉన్నత విద్యామండలి వర్గాలు తెలిపాయి. ఏయూ పరిధినుంచి అత్యధిక దరఖాస్తులు ఈఏపీసెట్‌కు దరఖాస్తు చేసిన వారిలో ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధినుంచి ఎక్కువమంది ఉన్నారు. ఏయూ పరిధినుంచి 1,59,278 మంది, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధినుంచి 86,774 మంది, ఉస్మానియా వర్సిటీ ప్రాంతం నుంచి 10,669 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక 2,843 మంది నాన్‌లోకల్ అభ్యర్థులున్నారు. ఉస్మానియా వర్సిటీ తెలంగాణ పరిధిలో ఉన్నప్పటికీ గతంలో ఈ యూనివర్సిటీ పరిధిలో చదువుకున్న విద్యార్థులు రాష్ట్ర విభజన అనంతరం ఏపీలోకి మారి స్థిరనివాసం ఏర్పరుచుకుని ఉంటే వారు ఏపీ స్థానికులుగానే పరిగణనలోకి వస్తారు. ఉస్మానియా పరిధిలో చదువుకుని ఏపీ స్థానికత లేనివారిని మాత్రం నాన్‌లోకల్‌గా పరిగణిస్తారు. ఈఏపీసెట్కే 100 శాతం వెయిటేజీ గతంలో ఏపీఎంసెట్‌లో ఇంటర్మీడియెట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ అమల్లో ఉంది. కోవిడ్ కారణంగా ఈ విద్యాసంవత్సరం ఇంటర్మీడియెట్ పరీక్షలు నిర్వహించకుండానే ఫలితాలు ప్రకటించడంతో ఈ ఏడాది ఈఏపీసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీని రద్దుచేసినట్లు ఉన్నత విద్యామండలి ఇంతకుముందే ప్రకటించింది. ఏపీఈఏపీసెట్‌లో విద్యార్థులు సాధించిన మార్కులనే వందశాతం వెయిటేజీగా పరిగణనలోకి తీసుకుని ర్యాంకులను ప్రకటించనున్నారు. ఇంజనీరింగ్ విభాగం పరీక్షకు ఆగస్టు 25న, అగ్రి, ఫార్మా స్ట్రీమ్ పరీక్షకు సెప్టెంబర్ 7న ప్రాథమిక కీలను విడుదల చేయనున్నారు. వాటిపై అభ్యంతరాలను స్వీకరించి నిపుణుల కమిటీ పరిశీలన అనంతరం ఫైనల్ కీని విడుదల చేస్తారు. కంప్యూటర్ ఆధారంగా బహుళ సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తున్నందున విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు సాధారణీకరణ ప్రక్రియననుసరించి ర్యాంకులు ప్రకటిస్తారు. కోవిడ్ బాధిత విద్యార్థులకు వేరుగా పరీక్ష: మంత్రి సురేష్ కోవిడ్ పాజిటివ్ లక్షణాలుండి బాధపడుతున్న విద్యార్థులను ఈ పరీక్షలకు అనుమతించడం లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఇతర విద్యార్థుల ఆరోగ్య రక్షణకు ఈ చర్యలు చేపడుతున్నామన్నారు. కోవిడ్ పాజిటివ్ విద్యార్థులకు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. పాజిటివ్ ఉన్న వారి హెల్త్ సర్టిఫికెట్లను పరిశీలించి ఈఏపీసెట్‌ను ప్రత్యేక సెషన్లలో నిర్వహిస్తామని తెలిపారు. ఈ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, వెయ్యిమంది ఇన్విజిలేటర్లు, 200 మంది పరిశీలకులను నియమించామని చెప్పారు. -
చందా...దందా: ఓ ఉన్నతాధికారి కుమార్తె పెళ్లికి వసూళ్ల పర్వం
మంత్రి పేషీలోని ఉన్నతాధికారి కుమార్తె పెళ్లికి వసూళ్ల పర్వం సాక్షి ప్రతినిధి, గుంటూరు : ఎంకిపెళ్లి సుబ్చి చావుకొచ్చిందన్నట్లు.. ఒక అధికారి ఇంట్లో పెళ్లి కిందిస్థాయి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. వేలాది రూపాయలు ఇండెంట్ పెట్టి మరీ వసూలు చేస్తుండటంతో దిక్కుతోచకపోయినా.. ఇవ్వకపోతే ఏం ఇబ్బంది వస్తుందోనని వారు ముడుపులు చెల్లిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో ఈ వ్యవహారం సాగుతోంది. రాష్ట్ర పురపాలక శాఖామంత్రి ఎం. మహీధరరెడ్డి పేషీలో ఒక ఉన్నతాధికారి కుమార్తె వివాహం ఈ నెల 14న హైదరాబాద్‌లో జరగనుంది. దీంతో ఒక ఉన్నతాధికారి రంగంలోకి దిగి రాష్ట్రంలోని నగరపాలక సంస్థ, మున్సిపాలిటీల్లో అధికారులకు ఇండెంట్లు ఇచ్చినట్లు తెలిసింది. గుంటూరు కార్పొరేషన్‌లోని ఉన్నతాధికారికే ఈ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ‘ఇది చాలా కాన్ఫెడెన్షియల్ మ్యాటర్.. బయటకు వచ్చిందంటే చర్యలు తప్పవు..’ అంటూ ముందే హెచ్చరికలు జారీచేశారు. విభాగాల వారీగా అధికారుల క్యాడర్‌ను బట్టి ఇండెంట్‌ను నిర్ణయించారు. ఇంజినీరింగ్ విభాగంలో ఇద్దరు అధికారులకు ఈ బాధ్యతలను అప్పగించారు. అసిస్టెంట్ ఇంజినీరు క్యాడర్ అయితే రూ.6 వేలు, డీఈ క్యాడర్ అయితే రూ.8 వేలు, ఈఈ క్యాడర్‌కు రూ.10 వేలు చొప్పున, పట్టణ ప్రణాళికా విభాగం ఉన్నతాధికారి ద్వారా బిల్డింగ్ ఇన్స్పెక్టర్ నుంచి టీపీఎస్ క్యాడర్ వరకు రూ.6 వేలు, అసిస్టెంట్ సిటీప్లానర్, ఆ పైస్థాయి వారి నుంచి రూ.8 వేల నుంచి పదివేల వరకు వసూలు చేస్తున్నారు. ఇలా ప్రతి విభాగంలో అధికారులు, సిబ్బంది నుంచి సొమ్ము వసూళ్లు సాగుతున్నాయి. మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున సొమ్ము వసూలు చేస్తున్నారు.