ఉమ్మడి పరీక్షలకు ఇలా సెట్ అవ్వండి | Diploma, B.Sc. Lateral entry students | Sakshi
Sakshi News home page

ఉమ్మడి పరీక్షలకు ఇలా సెట్ అవ్వండి

Published Thu, Apr 2 2015 3:07 AM | Last Updated on Sat, Sep 2 2017 11:42 PM

Diploma, B.Sc. Lateral entry students

ఈసెట్
డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమెటిక్స్) విద్యార్థులకు లేటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశం కల్పించే ఈసెట్ (ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)కు నోటిఫికేషన్ వెలువడింది. ఈ పరీక్షను జేఎన్‌టీయూ -హైదరాబాద్ నిర్వహిస్తుంది. వివరాలు..
 
 ఈసెట్‌లో నిర్దేశించిన అర్హత సాధించిన విద్యార్థులు బీఈ/బీటెక్ కోర్సుల్లో నేరుగా రెండో సంవత్సరంలో ప్రవేశం పొందొచ్చు. వీరికి యూనివర్సిటీ, ప్రైవేట్, అన్ ఎయిడెడ్ ఇన్‌స్టిట్యూట్‌లలో సీట్లను కేటాయిస్తారు. అదేవిధంగా ఫార్మసీ డిప్లొమా (డి.ఫార్మసీ) విద్యార్థులు నేరుగా బీ.ఫార్మసీ రెండో సంవత్సరంలో అడ్మిషన్ పొందొచ్చు.  అర్హత: స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ గుర్తింపు పొందిన కళాశాల నుంచి 45 శాతం మార్కులతో సం బంధిత బ్రాంచ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత. చివరి సంవత్సరం విద్యార్థులూ అర్హులే. లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 45 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్‌గా డిగ్రీ ఉత్తీర్ణత. రాత పరీక్ష: ఆబ్జెక్టివ్ విధానంలో ఇంగ్లిష్ మాధ్యమంలో 200 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో సమాధానాలను మూడు గంటల్లో గుర్తించాలి. ప్రశ్నపత్రం డిప్లొమా హోల్డర్లకు, బీఎస్సీ (మ్యాథమెటిక్స్) విద్యార్థులకు వేర్వేరుగా ఉంటుంది.
 
 ఇంజనీరింగ్
 సబ్జెక్ట్    మార్కులు
 మ్యాథమెటిక్స్    50    అన్ని బ్రాంచ్‌లకు కామన్
 ఫిజిక్స్    25    అన్ని బ్రాంచ్‌లకు కామన్
 కెమిస్ట్రీ    25    అన్ని బ్రాంచ్‌లకు కామన్
 ఇంజనీరింగ్    100    ఎంచుకున్న బ్రాంచ్‌ను బట్టి
 {పశ్నలు వేర్వేరుగా ఉంటాయి
 ఫార్మసీ
 సబ్జెక్ట్    మార్కులు
 ఫార్మస్యూటిక్స్    50
 ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ    50
 ఫార్మకాగ్నసీ    50
 ఫార్మకాలజీ    50
 
 బీఎస్సీ (మ్యాథమెటిక్స్)
 సబ్జెక్ట్    మార్కులు
 మ్యాథమెటిక్స్    100
 అనలిటికల్ ఎబిలిటీ    50
 కమ్యూనికేటివ్ ఇంగ్లిష్    50
 ప్రశ్నల క్లిష్టత: సంబంధిత సబ్జెక్ట్‌లలో ప్రాథమిక అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లలో అడిగే ప్రశ్నల క్లిష్టత స్థాయి ఇంటర్మీడియెట్. బ్రాంచ్ సబ్జెక్ట్ మాత్రం డిప్లొమా స్థాయిలో ఉంటుంది. మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీటు రావాలంటే 200లోపు ర్యాంకు సాధించాలి.
 
 నోటిఫికేషన్ సమాచారం:
 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 15, 2015. (రూ. 500 లేట్ ఫీజుతో: ఏప్రిల్ 25 వరకు, రూ. 1000 లేట్ ఫీజుతో: మే 2 వరకు, రూ. 5000 లేట్ ఫీజుతో: మే 9 వరకు, రూ. 10,000 లేట్ ఫీజుతో: మే 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు)
 రాత పరీక్ష తేదీ: మే 21, 2015.
 
 పీజీఈసెట్
 గేట్ తర్వాత రాష్ట్ర విద్యార్థులకు ఇంజనీరింగ్ పీజీ కోర్సుల్లో చేరడానికి అవకాశం కల్పిస్తున్న పరీక్ష పీజీఈసెట్ (పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎం ట్రెన్స్ టెస్ట్). 2015-16 విద్యా సంవత్సరానికి పీజీఈసెట్ నోటిఫికేషన్ వెలువడింది. ఉస్మానియా యూనివర్సిటీ ఈ పరీక్షను నిర్వహిస్తుంది. వివరాలు..
 
 పీజీఈసెట్ ద్వారా రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలు, అనుబంధ పీజీ కళాశాలల్లో ఎంఈ/ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్, ఫార్మ్‌డీ (పోస్ట్ బాక్యులరేట్) కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది బీటెక్ విద్యార్థులు బయటికి వస్తున్నారు. కాబట్టి జాబ్ మార్కెట్లో ఎంఈ/ఎంటెక్ డిగ్రీ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత లభిస్తుంది.
 
 అర్హతలు: సంబంధిత లేదా అనుబంధ బ్రాంచ్‌లతో బీటెక్/బీఈ/ఏఎంఐఈ/బీఫార్మసీ/బీఆర్క్/బీప్లానింగ్. ఫైనలియర్ విద్యార్థులు కూడా అర్హులే.రాత పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ పద్ధతిలో రాతపరీక్షను నిర్వహిస్తారు.ఇందులో 120ప్రశ్నలు ఉంటాయి. వీటికి 120 నిమిషాల్లో సమాధానాలను గుర్తించాలి. ఇందులో 60 శాతం థియరీ, 40 శాతం ప్రాబ్లమ్స్ (ఫార్ములా బేస్డ్) ఉంటాయి. జాతీయ స్థాయిలో నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(గేట్) మాదిరిగానే పీజీఈసెట్ సిలబస్ ఉంటుం ది. ప్రశ్నలు క్లిష్టత స్థాయి మాత్రం కొంచెం తక్కువ.
 
 నోటిఫికేషన్ సమాచారం:
 దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 27, 2015. (రూ. 500 లేట్ ఫీజుతో: మే 11 వరకు, రూ. 2000 లేట్ ఫీజుతో: మే 22 వరకు, రూ. 5000 లేట్ ఫీజుతో: మే 28 వరకు, రూ. 10,000 లేట్ ఫీజుతో: జూన్ 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు)
 రాత పరీక్ష తేదీలు: జూన్ 2 నుంచి 8 వరకు.

 ఇలా చదవాలి ఈసెట్
 డిప్లొమా విద్యార్థులు: మ్యాథమెటిక్స్‌లో క్యాలికులస్, ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా, కో-ఆర్డినేట్ జామెట్రీ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటిల్లో క్యాలికులస్, ట్రిగ్నోమెట్రీ అంశాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఫిజిక్స్‌లో యూనిట్స్, డెమైన్షన్స్, వెక్టార్స్, కైనమెటిక్స్, ఫ్రిక్షన్, వర్క్, పవర్, ఎనర్జీ, హీట్, సౌండ్ మోడ్రన్ ఫిజిక్స్ వంటి అంశాలు కీలకమైనవి. కెమిస్ట్రీలో వాటర్ ట్రీట్‌మెంట్, కరోజన్, సొల్యూషన్స్,ఫ్యూయల్స్, పొల్యూషన్, పాలిమర్స్ అంశాలను క్షుణ్నంగా చదవాలి. డిప్లొమా సబ్జెక్ట్‌లో ప్రతి అంశం నుంచి ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ప్రామాణిక పుస్తకాలను చదువుతూ.. ప్రాథమిక భావనలను అవగాహన చేసుకుంటూ ఆబ్జెక్టివ్ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. ఈ పరీక్షలో నెగిటివ్ మార్కు లు ఉండవు.
 
 ఈ నేపథ్యంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయడం ఉత్తమం. ప్రస్తుత ఏడాది డిప్లొమా పూర్తి చేస్తున్న విద్యార్థులకు ఈ-సెట్ ప్రిపరేషన్ కోసం తక్కువ వ్యవధి మాత్రమే లభిస్తుంది. కాబట్టి వీలైనన్నీ ఆబ్జెక్టివ్ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. ఈ క్రమంలో సాధ్యమైనన్నీ షార్ట్‌కట్ మెథడ్స్ తెలుసుకోవాలి.బీఎస్సీ విద్యార్థులు: మ్యాథమెటిక్స్‌కు అత్యధిక వెయిటేజీ ఉంటుంది. ఇందులోని ప్రశ్నల క్లిష్టత డిగ్రీ స్థాయిలో ఉంటుంది. ఇప్పటికే డిగ్రీ పరీక్షల కోసం మ్యాథమెటిక్స్‌ను ప్రిపేర్ అయి ఉంటారు. కాబట్టి మరోసారి మాదిరి ప్రశ్నపత్రాలను పరిశీలిస్తూ పునశ్చరణ చేసుకుంటూ పోతే ఇందులో మెరుగైన మార్కులు సాధించవచ్చు. ఇంగ్లిష్‌లో ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, సినానిమ్స్, ఆంటోనిమ్స్, వర్డ్ రీప్లేస్-సబ్‌స్టిట్యూట్ తరహా ప్రశ్నలు అడుగుతారు. అనలిటికల్ ఎబిలిటీలో డేటా సఫిషియన్సీ, కాలం, వేగం, నిష్పత్తి, వడ్డీ, వయసు, కోడింగ్- డీకోడింగ్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
 
 పీజీఈసెట్
 ఇంజనీరింగ్ రెండో సంవత్సరం, మూడో సంవత్సరం మొదటి సెమిస్టర్ సిలబస్ నుంచి ఎక్కువ ప్రశ్న లు అడిగే అవకాశం ఉంది. కాబట్టి వీటిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ప్రధానంగా సంబంధిత బ్రాంచ్‌లో బేసిక్స్, ఫండమెంటల్స్, ముఖ్యమైన నిర్వచనాలు, ఫార్ములాలపై పట్టు సాధించాలి. ప్రతి ప్రాబ్లమ్‌ను కాన్సెప్ట్, ఫార్ములాను ఆధారం చేసుకొని వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. గేట్, ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ పేపర్లను ప్రాక్టీస్ చేయడం కూడా మంచిది. పీజీఈసెట్ ప్రిపరేషన్.. ట్రాన్స్‌కో, జెన్‌కో, ఏఈఈ, బీఎస్‌ఎన్‌ఎల్ (జేటీఓ), డీఆర్‌డీఓ వంటి ఉద్యోగ నియామక పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది.-జి.ర మణ, డెరైక్టర్, సాయి మేధ విద్యా సంస్థలు.
 
 లాసెట్/పీజీలాసెట్
 అవకాశాల వారధిగా మారుతున్న లా కోర్సుల్లో చేరడానికి ఉత్సాహం చూపిస్తున్న యువత సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని న్యాయ కళాశాల్లో బ్యాచిలర్, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి వీలుకల్పించే లాసెట్, పీజీలాసెట్ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో సంబంధిత వివరాలు..

 లాసెట్ (లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్): ఈ పరీక్ష ద్వారా మూడేళ్లు/ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు.
 ర్హత: మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు-45 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ (10+2+3 విధానంలో).
 ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు-45 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్/తత్సమానం (10+2 విధానంలో).
 రాత పరీక్ష విధానం: లా, సమకాలీన అంశాల్లో అభ్యర్థుల అవగాహనను పరీక్షించే విధంగా ఆబ్జెక్టివ్ పద్ధతిలో లాసెట్ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో 120 ప్రశ్నలు ఉంటాయి. వీటికి కేటాయించిన మార్కులు 120. గంటన్నర ( 90 నిమిషాలు)లో సమాధానాలను గుర్తించాలి. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. అవి..
 విభాగం    అంశం    ప్రశ్నలు    మార్కులు
 పార్ట్-ఎ    జనరల్ నాలెడ్జ్ అండ్
     మెంటల్ ఎబిలిటీ     30    30
 పార్ట్-బి    కరెంట్ అఫైర్స్    30    30
 పార్ట్-సి    ఆప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా    60    60
 మొత్తం        120    120
 
 ఐదేళ్ల లా కోర్సుకు నిర్వహించే పరీక్షలో ప్రశ్నల క్లిష్టత ఇంటర్మీడియెట్ స్థాయిలో, మూడేళ్ల కోర్సు కోసం నిర్వహించే పరీక్షలో డిగ్రీ స్థాయిలో ప్రశ్నల క్లిష్టత ఉంటుంది. నెగెటివ్ మార్కులు లేవు.పార్ట్-ఎలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, చరిత్ర, జాగ్రఫీ, కంప్యూటర్, తదితర అన్ని రంగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఉదాహరణకు.. 1975లో నిర్మితమైన మొదటి పర్సనల్ కంప్యూటర్ పేరు?పార్ట్-బిలో కరెంట్ అఫైర్స్‌లో భాగంగా గత ఏడాది కాలంగా అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయంగా చోటు చేసుకున్న సంఘటనల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఉదాహరణ-సంస్కృతి ప్రతిష్టాన్ పురస్కారం అందుకున్న వ్యక్తి?పార్ట్-సిలో న్యాయ సూత్రాలు, రాజ్యాంగానికి సంబంధించిన ప్రాథమిక అవగాహనను పరీక్షించే ప్రశ్నలు ఉం టాయి. ఉదాహరణకు-భారత రాజ్యాంగంలో మూడు లెజిస్లేటివ్ పట్టికలను ఎందులో ఉటంకించారు?
 
 నోటిఫికేషన్ సమాచారం:
 దరఖాస్తు రుసుం: రూ.250
 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 10, 2015. (రూ. 250 లేట్ ఫీజుతో: ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 21 వరకు, రూ. 500 లేట్ ఫీజుతో: ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 30 వరకు, రూ. 1000 లేట్ ఫీజుతో: మే 1 నుంచి మే 7 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు)
 రాత పరీక్ష తేదీ: మే 19, 2015.
 
 పీజీలాసెట్:
 ఎల్‌ఎల్‌ఎం/ఎంఎల్ కోర్సుల్లో ప్రవేశానికి పీజీలాసెట్ (పోస్ట్‌గ్రాడ్యుయేట్ లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) నిర్వహిస్తారు.అర్హత: ఎల్‌ఎల్‌బీ/బీఎల్ (మూడు/ఐదేళ్లు). చివరి సంవత్సరం విద్యార్థులు కూడా ద రఖాస్తు చేసుకోచ్చు.
 
 రాత పరీక్ష:
 రాత పరీక్షలో 120 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో పార్ట్-ఎ, బి అనే రెండు భాగాలు ఉంటాయి. వీటికి 90 నిమిషాల్లో సమాధానాలను గుర్తించాలి. వివరాలు..
 
 పార్ట్-ఎలో 40 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో జూరిస్ ప్రుడెన్స్‌పై 20 ప్రశ్నలు (20 మార్కులు), కాన్‌స్టిట్యూషనల్ లాపై 20 ప్రశ్నలు (20 మార్కులు) అడుగుతారు. పార్ట్-బిలో 80 ప్రశ్నలు ఇస్తారు. వీటిలో అంశాలవారీగా వచ్చే ప్రశ్నల సంఖ్య-మార్కులు: పబ్లిక్ ఇంటర్నేషనల్ లా (16 ప్రశ్నలు-16 మార్కులు), మర్కంటైల్ లా (16 ప్రశ్నలు-16 మార్కులు), లేబర్ లా (16 ప్రశ్నలు-16 మార్కులు), క్రైమ్స్ అండ్ టోర్ట్స్ (16 ప్రశ్నలు-16 మార్కులు), ఐపీఆర్ అండ్ అదర్ లాస్ (16 ప్రశ్నలు-16 మార్కులు).
 
 నోటిఫికేషన్ సమాచారం:
 దరఖాస్తు రుసుం: రూ.500 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 10, 2015. (రూ. 250 లేట్ ఫీజుతో: ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 21 వరకు, రూ. 500 లేట్ ఫీజుతో: ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 30 వరకు, రూ. 1000 లేట్ ఫీజుతో: మే 1 నుంచి మే 7 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు)
 రాత పరీక్ష తేదీ: మే 19, 2015.
 వెబ్‌సైట్: http://tslawcet.org/

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement