పవర్‌గ్రిడ్‌లో ఫీల్డ్‌ ఇంజనీర్లు, సూపర్‌ వైజర్ ఉద్యోగాలు | Power Grid Recruitment 2021: Field Engineer, Supervisor Vacancies | Sakshi
Sakshi News home page

పవర్‌గ్రిడ్‌లో ఫీల్డ్‌ ఇంజనీర్లు, సూపర్‌ వైజర్ ఉద్యోగాలు

Published Fri, Aug 20 2021 8:12 PM | Last Updated on Fri, Aug 20 2021 8:24 PM

Power Grid Recruitment 2021: Field Engineer, Supervisor Vacancies - Sakshi

పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌.. ఒప్పంద ప్రాతిపదికన ఫీల్డ్‌ ఇంజనీర్, సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

భారత ప్రభుత్వ విద్యుచ్ఛక్తి మంత్రిత్వశాఖకు చెందిన మహారత్న సంస్థ పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌.. ఒప్పంద ప్రాతిపదికన ఫీల్డ్‌ ఇంజనీర్, సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (నిట్, వరంగల్‌లో 129 నాన్‌టీచింగ్‌ పోస్టులు)
► మొత్తం పోస్టుల సంఖ్య: 137

పోస్టుల వివరాలు: ఫీల్డ్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌)–48, ఫీల్డ్‌ ఇంజనీర్‌(సివిల్‌)–17, ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌(ఎలక్ట్రికల్‌)–50, ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌(సివిల్‌)–22.

అర్హత: ఫీల్డ్‌ ఇంజనీర్‌ పోస్టులకు కనీసం 55శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ(ఇంజనీరింగ్‌)/బీఈ(పవర్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి. ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌ పోస్టులకు కనీసం 55శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత అనుభవం ఉండాలి.

వయసు: 27.08.2021 నాటికి 29 ఏళ్లు మించకుండా ఉండాలి.

వేతనం: ఫీల్డ్‌ ఇంజనీర్లకు నెలకు రూ.30,000 నుంచి రూ.1,20,000, ఫీల్డ్‌ సూపర్‌వైజర్లకు నెలకు రూ.23,000 నుంచి రూ.1,05,000లతో పాటు ఇతర అలవెన్సులు చెల్లిస్తారు. (టీఎస్‌ఏసీఎస్‌లో ఉద్యోగాలు.. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు)

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్‌(టెక్నికల్‌ నాలెడ్జ్‌ టెస్ట్, అప్టిట్యూడ్‌ టెస్ట్‌), పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 27.08.2021

► వెబ్‌సైట్‌:  http://www.powergrid.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement