Kotak Investment
-
రత్తన్‌ఇండియా పవర్లో కొటక్ మహీంద్రా బ్యాంక్ పెట్టుబడులు
ముంబై: రెండు అనుబంధ సంస్థల ద్వారా రత్తన్‌ఇండియా పవర్ లిమిటెడ్(ఆర్ఐపీఎల్)లో రూ. 732 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు కొటక్ మహీంద్రా బ్యాంక్ వెల్లడించింది. మార్పిడిరహిత డిబెంచర్ల(ఎన్సీడీఏలు) జారీ ద్వారా చేపట్టిన తాజా పెట్టుబడులతో బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ రుణ చెల్లింపు వ్యయాలు తగ్గేందుకు వీలు చిక్కనున్నట్లు పేర్కొంది. కొటక్ స్ట్రాటజిక్ సిట్యుయేషన్స్ ఇండియా ఫండ్–2 ద్వారా రూ. 582 కోట్లు, కొటక్ ప్రయివేట్ క్రెడిట్ ఫండ్(కేపీసీఎఫ్) ద్వారా రూ. 150 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు తెలియజేసింది. తగిన రిస్క్ సర్దుబాటు చేసిన రాబడుల కోసం క్యాపిటల్ స్టాక్‌లో పాల్గొన్న తమ కొత్త క్రెడిట్ ఫండ్స్ నుంచి ఇది మొదటి పెట్టుబడి అని కోటక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీని శ్రీనివాసన్ పేర్కొన్నారు.ృ -
పవర్‌గ్రిడ్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ సక్సెస్
న్యూఢిల్లీ: విద్యుత్ రంగ దిగ్గజం పవర్‌గ్రిడ్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీవో) చివరి రోజుకి ఇన్వెస్టర్ల నుంచి 6.7 రెట్లు అధికంగా బిడ్స్ లభించాయి. కంపెనీ 78.70 కోట్ల షేర్ల(17% వాటా)ను అమ్మకానికి పెట్టగా, 530 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు దాఖలయ్యాయి. షేరుకి రూ. 85-90 ధరను నిర్ణయించగా, ఉద్యోగులు, రిటైలర్లకు ధరలో 5%(రూ. 4.50) డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 13% వాటాకు సమానమైన 60.18 కోట్ల షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ప్రభుత్వం 18.51 కోట్ల షేర్లను(4% వాటా) విక్రయానికి పెట్టింది. తద్వారా కంపెనీ రూ. 5,416 కోట్లు, ప్రభుత్వం రూ. 1,666 కోట్లను అందుకోనున్నాయి. కాగా, బీఎస్ఈలో శుక్రవారం షేరు ధర దాదాపు 3% లాభపడి రూ. 99 వద్ద ముగిసింది. ఇష్యూ కారణంగా కంపెనీలో ప్రభుత్వ వాటా 69.42% నుంచి 57.89%కు తగ్గనుంది.