ముంబై: రెండు అనుబంధ సంస్థల ద్వారా రత్తన్‌ఇండియా పవర్ లిమిటెడ్(ఆర్‌ఐపీఎల్)లో రూ. 732 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు కొటక్ మహీంద్రా బ్యాంక్ వెల్లడించింది. మార్పిడిరహిత డిబెంచర్ల(ఎన్‌సీడీఏలు) జారీ ద్వారా చేపట్టిన తాజా పెట్టుబడులతో బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ రుణ చెల్లింపు వ్యయాలు తగ్గేందుకు వీలు చిక్కనున్నట్లు పేర్కొంది.
కొటక్ స్ట్రాటజిక్ సిట్యుయేషన్స్ ఇండియా ఫండ్–2 ద్వారా రూ. 582 కోట్లు, కొటక్ ప్రయివేట్ క్రెడిట్ ఫండ్(కేపీసీఎఫ్) ద్వారా రూ. 150 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు తెలియజేసింది. తగిన రిస్క్ సర్దుబాటు చేసిన రాబడుల కోసం క్యాపిటల్ స్టాక్‌లో పాల్గొన్న తమ కొత్త క్రెడిట్ ఫండ్స్ నుంచి ఇది మొదటి పెట్టుబడి అని కోటక్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీని శ్రీనివాసన్ పేర్కొన్నారు.ృ
Comments
Please login to add a commentAdd a comment