invests
-
రత్తన్‌ఇండియా పవర్లో కొటక్ మహీంద్రా బ్యాంక్ పెట్టుబడులు
ముంబై: రెండు అనుబంధ సంస్థల ద్వారా రత్తన్‌ఇండియా పవర్ లిమిటెడ్(ఆర్ఐపీఎల్)లో రూ. 732 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు కొటక్ మహీంద్రా బ్యాంక్ వెల్లడించింది. మార్పిడిరహిత డిబెంచర్ల(ఎన్సీడీఏలు) జారీ ద్వారా చేపట్టిన తాజా పెట్టుబడులతో బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ రుణ చెల్లింపు వ్యయాలు తగ్గేందుకు వీలు చిక్కనున్నట్లు పేర్కొంది. కొటక్ స్ట్రాటజిక్ సిట్యుయేషన్స్ ఇండియా ఫండ్–2 ద్వారా రూ. 582 కోట్లు, కొటక్ ప్రయివేట్ క్రెడిట్ ఫండ్(కేపీసీఎఫ్) ద్వారా రూ. 150 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు తెలియజేసింది. తగిన రిస్క్ సర్దుబాటు చేసిన రాబడుల కోసం క్యాపిటల్ స్టాక్‌లో పాల్గొన్న తమ కొత్త క్రెడిట్ ఫండ్స్ నుంచి ఇది మొదటి పెట్టుబడి అని కోటక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీని శ్రీనివాసన్ పేర్కొన్నారు.ృ -
ఏ అండ్ టీలో రిలయన్స్ రిటైల్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్ (ఆర్ఆర్వీఎల్) తాజాగా లగ్జరీ ఫ్యాషన్ సంస్థ అబ్రహం అండ్ ఠాకూర్‌లో (ఏ అండ్ టీ) మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. అయితే, ఇందుకోసం ఎంత వెచ్చించినదీ వెల్లడించలేదు. అబ్రహం అండ్ ఠాకూర్‌లో మెజారిటీ వాటాల కోసం ఇన్వెస్ట్ చేసినట్లు రిలయన్స్ రిటైల్ ఒక ప్రకటనలో తెలిపింది. డేవిడ్ అబ్రహం, రాకేష్ ఠాకూర్ 1992లో ఏ అండ్ టీని ప్రారంభించారు. ఇందు లో కెవిన్ నిగ్లి తర్వాత భాగస్వామి గా చేరారు. లిబర్టీ, బ్రౌన్స్, హరోడ్స్, సెల్ఫ్రిజెస్ వంటి అంతర్జాతీయ స్టోర్స్‌లో కూడా భారతీయ చేనేత వస్త్రాల కలెక్షన్లను ఏ అండ్ టీ అందుబాటులోకి తెచ్చింది. ఏ అండ్ టీ వినూత్న డిజైన్లకు దేశీ లగ్జరీ కస్టమర్లలో మంచి ఆదరణ ఉంటోందని ఆర్ఆర్వీఎల్ డైరెక్టర్ ఇషా అంబానీ తెలిపారు. ఆర్ఆర్వీఎల్తో భా గస్వామ్యం ద్వారా హోమ్ ఫర్నిషింగ్స్, లాంజ్‌వేర్ సహా పలు ఫ్యాషన్స్, లైఫ్ స్టయిల్ కలెక్షన్లను మరింత విస్తృతంగా అందుబాటులోకి తేగలమని డేవిడ్ అబ్రహం తెలిపారు. -
ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీలో రతన్ టాటా పెట్టుబడి
న్యూఢిల్లీ: ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఓలాకు చెందిన వ్యాపార విభాగం ‘ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ’ (ఓఈఎం)లో టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా పెట్టుబడి పెట్టారు. ఈయన తన వ్యక్తిగత స్థాయిలో... సిరీస్ ఏ రౌండ్ ఫండింగ్‌ను అందించారని ఓలా సోమవారం అధికారికంగా ప్రకటించింది. అయితే, ఎంత మొత్తంలో ఈ పెట్టుబడి ఉందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ‘ఎలక్ట్రిక్ మొబిలిటీ విజయవంతంగా ఆచరణలోకి వచ్చేందుకు రతన్ టాటాకు ఉన్నటువంటి లోతైన అనుభవం, సలహాదారు హోదా ఓలా సంస్థ అభివృద్ధికి దోహదపడనుంది’ అని మాతృ సంస్థ ప్రకటించింది. మరోవైపు ఓలా భాగస్వామ్య సంస్థ ఏఎన్ఐ టెక్నాలజీలో సైతం 2015 జూలైలోనే ఈయన ఇన్వెస్ట్‌చేసి.. ఈ టెక్నాలజీలో పెట్టుబడి పెట్టిన తొలి ఇన్వెస్టర్‌గా నిలిచారు. ఇక తాజా పెట్టుబడిపై స్పందించిన టాటా.. ‘విద్యుత్ వాహన రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ వృద్ధిలో ఓలా కీలకపాత్ర పోషించనుందని భావిస్తున్నాం’ అని అన్నారు. ఓలా ఎలక్ట్రిక్ విభాగంలోకి రతన్ టాటాను సలహాదారునిగా, పెట్టుబడిదారునిగా చాలా సంతోషంగా ఆహ్వానిస్తున్నామని ఓలా సహ వ్యవస్థాపకుడు, సీఈఓ భవిష్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. -
విస్తారాలో భారీ పెట్టుబడులు
టాటా-సింగపూర్ ఎయిర్‌లైన్స్ భాగస్వామ్యంతో ఏర్పాటైన ఎయిర్‌లైన్స్ సంస్థ 'విస్తారా'లో సింగపూర్ఎయిర్లైన్స్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. దాదాపు 100 మిలియన్లకు పైగా సింగపూర్ డాలర్లను ఇన్వెస్ట్చేయనుంది. విస్తారా పనితీరుపట్ల ఆకర్షితమై అనుకున్నదానికి కంటే దాదాపు రెట్టింపు పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఇరు సంస్థలు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అయితే పెట్టుబడులను ధృవీకరించిన ఎస్ఏఐ ఎంత పెద్దమొత్తంలో అనేది వెల్లడించడానికి మాత్రం నిరాకరించింది. కమర్షియల్ కాన్ఫిడెన్సియల్ అని తెలిపింది. న్యూఢిల్లీ-ఆధారిత క్యారియర్ 2020వరకు లాభాలను ఆశించకపోయినప్పటికీ రెండు సంవత్సరాలకు పైగా దేశీయంగా సేవలందిస్తూ మంచి గ్రోత్‌ను సాధిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. తమ ప్రాంతీయ క్యారియర్ సిల్క్ ఎయిర్ ద్వారా వినియోగదారులను పెంచుకునేందుకు విస్తారాతోభాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ద్వారా సింగపూర్క స్టమర్ సింగపూర్ నుంచి ఢిల్లీకి వెళ్లడానికి టికెట్ బుక్ చేసుకోవడానికి, అక్కడినుంచి 10 దేశీయ గమ్యస్థానాలకు విస్తారా ద్వారా బుక్ చేసుకునే సౌలభ్యం లభించనుంది. అంతర్జాతీయ మార్కెట్లలో తమ బ్రాండ్ గురించి ఎక్కువ అవగాహనను విస్తరించడంలో ఈ ఒప్పందం కీలక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, తమ అంతర్జాతీయ ఆకాంక్షలకు మద్దతు ఇస్తుందని విస్తారా ప్రతినిధి తెలిపారు. ఇప్పటికే విస్తారాలో ఎస్ఏఐ 49శాతం వాటాను కలిగిఉంది. వచ్చే ఏడాది జూన్‌నాటికి విస్టారా దాని 20 వ విమానం కొనుగోలుతో ముఖ్యమైన మైలురాయిని తాకుతుందని, అంతర్జాతీయ విమానాలను నిర్వహించడానికి వైమానిక మార్గాలను సుగమం చేస్తుందని భావిస్తున్నారు. జాయింట్ వెంచర్ వైమానిక సంస్థలో టాటా గ్రూప్ 51 శాతం వాటాను కలిగి ఉంది. ప్రస్తుతం 45 దేశీయ రూట్లలో13 విమానాలను విస్తారా కలిగింది. భారత పౌరవిమానయాన నియమాల ప్రకారం, ఇంర్నేషనల్ సేవలందించలంటే విస్టారాకు కనీసం 20 విమానాలు ఉండాలి. ఈ నేపథ్యంలో సుమారు 50 వైడ్ బాడీస్ సహా 100 విమానాలను కొనుగోలు ప్రణాళికలోఉన్నట్టు సమాచారం. అయితేఈ వార్తలను విస్తారా కొట్టిపారేసింది. టఫ్ ఆపరేటింగ్ వాతావరణం ఉన్నప్పటికీ ఇండియన్ మార్కెట్ విస్తరించాలనేప్రణాళికలను పదేపదే ఎస్ఐఏ ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రకారం ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్ గా భారతదేశం ఉంది. -
మ్యూజిక్ సర్వీసులో ట్విట్టర్ పెట్టుబడి
మైక్రోబ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్ ఓ కొత్త పద్ధతిలో మ్యూజిక్ సర్వీసుల్లోకి ప్రవేశించింది. పాపులర్ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసు సౌండ్ క్లౌడ్ లో 700లక్షల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ట్విట్టర్ సౌండ్ క్లౌడ్ లో పెట్టుబడులుగా పెట్టినట్టు టెక్నాలజీ వెబ్ సైట్ రీ/కోడ్ రిపోర్టు నివేదించింది. నెలకు 300 మిలియన్ యాక్టివ్ యూజర్లు కలిగిఉన్న ట్విట్టర్, తిరోగమనంలో ఉన్న తన వృద్ధిని పెంచుకోవడానికి ఈ పెట్టుబడులు పెట్టినట్టు రిపోర్టు పేర్కొంది. ఈ పెట్టుబడుల విషయాన్ని ట్విట్టర్ సైతం అంగీకరించింది. కానీ ఎలాంటి ఫైనాన్సియల్ వివరాలు బయటికి వెల్లడించలేదు. దాదాపు రెండేళ్ల క్రితం ఈ మైక్రోబ్లాగింగ్ వెబ్ సైట్, సౌండ్ క్లౌడ్ ను కొనుగోలు చేయాలని తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. కానీ తర్వాత ఈ కొనుగోలుపై మౌనం పాటించడం మొదలుపెట్టింది. ట్విట్టర్ తమ కంపెనీలో పెట్టుబడులు పెట్టిందని సౌండ్ క్లౌడ్ అధికారిక ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. సమకాలనీ సంస్కృతి నుంచి స్ఫూర్తిపొందిన ఈ రెండు కంపెనీలు, గ్లోబల్ గా లక్షలాది మందిని చేరుకోవడానికి కృషిచేస్తున్నామని చెప్పారు. సౌండ్ క్లౌడ్ ప్లాట్ ఫామ్ ఇటు సృష్టికర్తలకి, అటు శ్రోతలకి వారధిలా ఉంటుంది. మ్యూజిక్ ను అప్ లోడ్ చేయడానికి, షేర్ చేయడానికి, ఇతర ఆడియో ఫైల్స్ కు ఇది ఓ ప్లాట్ ఫామ్. మ్యూజిక్ సిస్టమ్ లోకి ప్రవేశించడానికి ట్విట్టర్ 2013లోనే ప్రయత్నాలు చేసింది. ట్విట్టర్ మ్యూజిక్ సర్వీసును ఆవిష్కరించింది. అయితే ఏడాది తర్వాత ఈ సేవలు మూతపడ్డాయి. కొత్త పద్ధతిలో మ్యూజిక్ సర్వీసులను తీసుకొస్తామని ఆ సమయంలోనే ట్విట్టర్ ప్రకటించింది.