న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్ (ఆర్‌ఆర్‌వీఎల్) తాజాగా లగ్జరీ ఫ్యాషన్ సంస్థ అబ్రహం అండ్ ఠాకూర్‌లో (ఏ అండ్ టీ) మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. అయితే, ఇందుకోసం ఎంత వెచ్చించినదీ వెల్లడించలేదు. అబ్రహం అండ్ ఠాకూర్‌లో మెజారిటీ వాటాల కోసం ఇన్వెస్ట్ చేసినట్లు రిలయన్స్ రిటైల్ ఒక ప్రకటనలో తెలిపింది. డేవిడ్ అబ్రహం, రాకేష్ ఠాకూర్ 1992లో ఏ అండ్ టీని ప్రారంభించారు.
ఇందు లో కెవిన్ నిగ్లి తర్వాత భాగస్వామి గా చేరారు. లిబర్టీ, బ్రౌన్స్, హరోడ్స్, సెల్‌ఫ్రిజెస్ వంటి అంతర్జాతీయ స్టోర్స్‌లో కూడా భారతీయ చేనేత వస్త్రాల కలెక్షన్‌లను ఏ అండ్ టీ అందుబాటులోకి తెచ్చింది. ఏ అండ్ టీ వినూత్న డిజైన్లకు దేశీ లగ్జరీ కస్టమర్లలో మంచి ఆదరణ ఉంటోందని ఆర్‌ఆర్‌వీఎల్ డైరెక్టర్ ఇషా అంబానీ తెలిపారు. ఆర్‌ఆర్‌వీఎల్‌తో భా గస్వామ్యం ద్వారా హోమ్ ఫర్నిషింగ్స్, లాంజ్‌వేర్ సహా పలు ఫ్యాషన్స్, లైఫ్ స్టయిల్ కలెక్షన్లను మరింత విస్తృతంగా అందుబాటులోకి తేగలమని డేవిడ్ అబ్రహం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment