న్యూఢిల్లీ: భారత్–22 ఈటీఎఫ్( ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్) ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీఓ)కు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. ఈ ఆఫర్ ద్వారా రూ.6,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బిడ్‌లు ఎక్కువగా వస్తే, అదనంగా రూ.2,400 కోట్ల మేర నిధులను అట్టేపెట్టుకోవాలని (గ్రీన్ షూ ఆప్షన్) కూడా భావించింది. ఈ నెల 19న ప్రారంభమైన ఈ ఈటీఎఫ్ ఎఫ్‌పీఓ శుక్రవారం ముగిసింది.
ఈ ఎఫ్‌పీఓ రెండు రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. రూ.6,000 కోట్లకు గాను రూ.12,500 కోట్లకు బిడ్‌లు వచ్చాయి. యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 3.44 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. ఈ ఎఫ్‌పీఓను ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ నిర్వహించింది. భారత్–22 ఈటీఎఫ్‌లో మొత్తం 22 కంపెనీలున్నాయి. ఓఎన్‌జీసీ, ఐఓసీ, ఎస్‌బీఐ, బీపీసీఎల్, కోల్ ఇండియా, నాల్కో, ఎన్‌బీసీసీ, ఎన్‌టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ, గెయిల్, ఎన్‌ఎల్‌సీ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ తదితర షేర్లు ఈ ఈటీఎఫ్‌లో ఉన్నాయి.
67 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయిన రీట్స్ ఐపీఓ
న్యూఢిల్లీ: రైల్వే కన్సల్టెన్సీ సంస్థ ‘రీట్స్’ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. శుక్రవారం ముగిసిన ఈ ఐపీఓ 67 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. ఈ ఐపీఓలో భాగంగా కంపెనీ 2.52 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తోంది. 167 కోట్ల షేర్లకు గాను బిడ్‌లు వచ్చాయి. రూ.180–185 ప్రైస్‌బ్యాండ్‌తో ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ. 466కోట్లు సమీకరించనున్నదని అంచనా. ఈ ఆర్థిక సంవత్సరంలో ఐపీఓకు వచ్చిన తొలి ప్రభుత్వ రంగ కంపెనీ ఇది. వచ్చే నెల 2న ఈ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment