ముంబై: ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవో) పూర్తిగా సబ్‌స్క్రయిబ్ అయినప్పటికీ ఇష్యూను ఉపసంహరించుకోవాలని అదానీ గ్రూప్ నిర్ణయించింది. ప్రస్తుతం అసాధారణ పరిస్థితులు, మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు నెలకొన్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. ఎఫ్‌పీవో ద్వారా సేకరించిన నిధులను ఇన్వెస్టర్లకు తిరిగి ఇవ్వనున్నట్లు సంస్థ చైర్మన్ గౌతమ్ అదానీ తెలిపారు.
తమ బ్యాలెన్స్ షీట్ పటిష్టంగానే ఉందని, రుణాల తిరిగి చెల్లింపుల్లో మంచి ట్రాక్ రికార్డు ఉందని పేర్కొన్నారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్ రూ. 20,000 కోట్ల ఎఫ్‌పీవో జనవరి 31న ముగిసిన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్ ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్టుతో బుధవారం కూడా గ్రూప్ సంస్థల షేర్లు భారీగా నష్టపోయిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.
చదవండి: Union Budget 2023: ఇళ్ల కొనుగోలుదారులకు శుభవార్త.. ఆ పథకానికి భారీగా నిధులు పెంపు!
Comments
Please login to add a commentAdd a comment