మధుబని: ఎవరైనా ఇష్టంగా ఒక వృత్తిలో చేరాక దానిని మానివేయడం కష్టంగా మారుతుందని అంటారు. ఇదేవిధంగా యాచనను వృత్తిగా ఎంచుకున్న ఒక వ్యక్తి మూడు ఆటోలకు ఓనర్‌గా మారాడు. బీహార్‌లోని దర్భంగా, మధుబని రైల్వే సెక్షన్‌లో భిక్షాటన సాగించే బంభోలా అలియస్ సూరదాస్ ఇప్పడు వార్తల్లో నిలిచాడు.
సూరదాస్ 25 ఏళ్ల క్రితం రైలులో భిక్షాటన చేయడం ప్రారంభించాడు. అంధత్వం కలిగిన సూరదాస్ రైలులో పాటలు పాడుతూ యాచిస్తుంటాడు. తాను ఏ పనీ చేయలేని పరిస్థితిలో ఉన్నానని, తనకు భిక్షాటన మాత్రమే ఆసరా అని సూరదాస్ మీడియాకు తెలిపాడు. యాచనే తనకు జీవితమని పేర్కొన్నాడు.
ఇప్పుడు సూరదాస్ కథ భిక్షాటనకే పరిమితం కాలేదు. ఇప్పుడు అతను మూడు ఆటోలకు యజమాని. తనకు వచ్చే ప్రతీపైసా కూడబెట్టి ఆటోలను కొనుగోలు చేసినట్లు సూరదాస్ తెలిపాడు. తన యాచనతో వచ్చిన సంపాదనతోనే కుటుంబం నడుస్తుందని, యాచనను తన ఊపిరి ఉన్నంతవరకూ కొనసాగిస్తానని తెలిపాడు. కష్టాలు ఎదురైనా మనిషి తన కలలను నెరవేర్చుకునేందుకు కృషి చేయాలని ఆయన చెబుతుంటాడు.
ఇది కూడా చదవండి: కనువిందు చేస్తున్న విదేశీ వలస పక్షులు
Comments
Please login to add a commentAdd a comment