వండర్’ తాత
116 ఏళ్ల వయసులో ధరమ్‌పాల్ పరుగు
కోయంబత్తూరు: 116 ఏళ్ల వయసున్న వృద్ధుడు బతికి ఉండటమే ప్రస్తుత రోజుల్లో గొప్ప. తన పనులు తాను చేసుకుంటూ, కర్ర సాయంతో నడవడమే చాలా గొప్ప.
అలాంటిది ఉత్తరప్రదేశ్‌కు చెందిన 116 ఏళ్ల వయసున్న ధరమ్‌పాల్ గుజ్జార్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటున్నారు. జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 200 మీటర్ల పరుగును 46.74 సెకన్లలో పూర్తి చేసి అబ్బురపరిచారు. 400 మీటర్ల పరుగులో స్వర్ణం కూడా గెలిచారు. 1897 అక్టోబరు 6న జన్మించిన ధరమ్‌పాల్ ఓ వ్యవసాయ కూలి.
మీరట్ జిల్లాలోని గుడా అనే గ్రామంలో జీవిస్తున్నారు. తోటి కూలీల ఆర్థికసహాయంతో ఆయన ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వాలు తనకి సహకరిస్తే అంతర్జాతీయ పోటీలకు కూడా వెళ్లేవాడినని ధరమ్‌పాల్ చెప్పారు.