భారతదేశంలో ఎంతోమంది వ్యాపారవేత్తలకు స్ఫూర్తిగా నిలిచిన 'మహాశయ్ ధరంపాల్ గులాటీ' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన చనిపోయి రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ పేరు మాత్రం సజీవంగానే ఉంది. కేవలం రూ. 1500తో భారతదేశానికి వచ్చి ఏకంగా 5వేల కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
1923లో పాకిస్థాన్ సియాల్‌కోట్‌లో సుగంధ ద్రవ్యాల వ్యాపారి చున్నీలాల్ కుటుంబంలో జన్మించిన ధరంపాల్ చిన్నప్పటి నుంచే వ్యాపారంలో తండ్రికి సహాయం చేస్తూ ఆ వ్యాపారాన్నే నేర్చుకున్నాడు. ఆ తరువాత చాలా తక్కువ డబ్బుతో భారతదేశంలో అడుగుపెట్టాడు. తన దగ్గర ఉన్న ఆ తక్కువ డబ్బుతోనే ఒక గుర్రపు బండిని కొనాలని నిర్ణయించుకున్నాడు.
గుర్రపు బండి కొన్న తరువాత దానిపైనే ఢిల్లీ నగరంలో మసాలాలు విక్రయిస్తూ వ్యాపారం ప్రారంభించాడు. చిన్న కొట్టుతో మొదలై మహాషియాన్ డి హట్టి (MDH) పేరుతో మంచి ఆదాయం పొందాడు. అతి తక్కువ కాలంలో భారతదేశపు 'మసాలా కింగ్'గా కీర్తి పొందాడు.
(ఇదీ చదవండి: క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్సాక్షన్ - సులభంగా ఇలా!)
ధరంపాల్ గులాటీ కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా తన వ్యాపారాన్ని ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చేసి కోట్లలో సంపాదించడం మొదలెట్టాడు. 2017లో ఆయన సంస్థ ఆదాయం ఏకంగా రూ. 1000 కోట్లు దాటింది. కాగా 2020లో 98 సంవత్సరాల వయసులో మరణించారు. అప్పటికి ఆయన ఆస్తుల విలువ సుమారు రూ. 5,000 కోట్లు దాటింది.
అతి తక్కువ కాలంలోనే భారతదేశపు మసాలా కింగ్ స్థాయికి ఎదిగిన ధరంపాల్ గులాటీ విలాసవంతమైన కార్లను కూడా కలిగి ఉన్నారు. నివేదికల ప్రకారం ఆయన గ్యారేజీలో రోల్స్ రాయల్ ఘోస్ట్, క్రిస్లర్ 300 సి లిమోసిన్, మెర్సిడెస్ బెంజ్ ఎం-క్లాస్ ఎంఎల్ 500 వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. అంతే కాకుండా ఆయన మరణానికి ముందే ఫుడ్ ప్రాసెసింగ్ ఫీల్డ్‌లో ఆయన కృషికి భారత ప్రభుత్వం 'పద్మభూషణ్' పురస్కారం అందించి గౌరవించింది.
Comments
Please login to add a commentAdd a comment