కొందరూ తల్లులు పేదరికం, దారుణమైన కుటుంబ పరిస్థితులు వంటి కారణాల రీత్యా చారిటీ సంస్థల వద్ద లేదా దత్తత కింద తమ పిల్లలను ఇచ్చేయడం జరుగుతుంది. ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్లై.. తమను పెంచిన వాళ్లు అసలైన తల్లిదండ్రులు కాదని తెలిస్తే.. ఆ బాధ మాములుగా ఉండదు. అక్కడ నుంచి మొదలవుతాయి తమ తల్లిదండ్రులు ఎవరూ, ఎక్కడ ఉంటారనే ఆలోచనలు. వాళ్లు అసలు బతికే ఉన్నారా? ఒకవేళ బతికే ఉంటే ఒక్కసారి వాళ్లను తమ కళ్లతో చూసుకోవాలనే ఆరాటం, ఆత్రం మాటలకందని విధంగా ఉంటాయి. అలాంటి భావోద్వేగపు కథ ఈ స్విడిష్ యువతి గాథ!
అసలేం జరిగిందంటే..స్వీడన్‌కి చెందిన 41 ఏళ్ల ప్యాట్రిసియా ఎరిక్సన్ ఫిబ్రవరి 1983లో నాగాపూర్‌లోని డాగా హాస్పిటల్‌లో జన్మించింది. ఒక ఏడాది తర్వాత స్వీడిష్ దంపతులు ఆమెను దత్తత తీసుకున్నారు. తనన పెంచి పెద్ద చేసిన తల్లి తన కన్నతల్లి కాదని తెలుసుకుని భావోద్వేగానికి గురవ్వుతుంది. అయినప్పటికీ ఇన్నేళ్లు తనను ఎంతో ప్రేమగా పెంచిన పెంపుడు తల్లి పట్ల అపారమైన కృజ్ఞత ఉన్నప్పటికీ ఒక్కసారి తన తల్లిని తనవితీరా చూడాలని కోరుకుంటుంది.
అందుకోసం ఆమె తన తల్లి ఎక్కడ ఉండేది అనే దిశగా ఆమె ఆచూకీకై వెతకడం ప్రారంభించింది. అలా ఆమె తన తల్లిని వెతుక్కుంటూ నాగ్‌పూర్‌కి చేరుకుంది. అక్కడ తన తల్లి ఆచూకీకి సంబంధించిన వివరాలు, ఆధారాలు సేకరించడం మొదలు పెట్టింది. ఆ భావోద్వేగపూరిత అన్వేషణలో ఎరిక్సన్‌కి అంజలా పవార్ అనే న్యాయవాది సాయం అందిస్తున్నారు. ఇలా జీవ సంబంధమైన తల్లుల కోసం వేరే దేశ యువతలు భారతదేశానికి వచ్చి కోరడం అనేది తొలిసారి కాదు.
ఇంతకుమునుపు స్విస్ మహిళ విద్యా ఫిలిప్పన్ కూడా ముంబైలో తన జీవసంబంధమైన తల్లి కోసం ఒక దశాబ్దంగా వెతుకుతూ ఉంది. అయితే ఆ కేసులో ఆమె తల్లి చిరునామా, ప్రస్తుతం ఉనికిలో లేకపోవడమే ఆ యువతి ప్రధాన సవాలుగా మారింది. దీంతో ఆమె తల్లి ఎక్కడకు వెళ్లి ఉంటుందనేది చిక్కముడి వీడని మిస్టరీలా మారిపోయింది.
#WATCH | Nagpur, Maharashtra: Swedish National Patricia Eriksson comes to Nagpur to search for her biological mother.
— ANI (@ANI) April 3, 2024
She says, "The kids in school started to explain that they have their mother's hair and father's nose. Then I realised I couldn't do the same... From a child's… pic.twitter.com/bcyXL4se6o
(చదవండి: హెయిర్ స్ట్రైయిట్‌నింగ్ చేయించుకుంటున్నారా? వైద్యులు వార్నింగ్)
Comments
Please login to add a commentAdd a comment