swedish woman
-
కన్నతల్లి ఆచూకీకై పరితపిస్తున్న స్వీడిష్ యువతి!
కొందరూ తల్లులు పేదరికం, దారుణమైన కుటుంబ పరిస్థితులు వంటి కారణాల రీత్యా చారిటీ సంస్థల వద్ద లేదా దత్తత కింద తమ పిల్లలను ఇచ్చేయడం జరుగుతుంది. ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్లై.. తమను పెంచిన వాళ్లు అసలైన తల్లిదండ్రులు కాదని తెలిస్తే.. ఆ బాధ మాములుగా ఉండదు. అక్కడ నుంచి మొదలవుతాయి తమ తల్లిదండ్రులు ఎవరూ, ఎక్కడ ఉంటారనే ఆలోచనలు. వాళ్లు అసలు బతికే ఉన్నారా? ఒకవేళ బతికే ఉంటే ఒక్కసారి వాళ్లను తమ కళ్లతో చూసుకోవాలనే ఆరాటం, ఆత్రం మాటలకందని విధంగా ఉంటాయి. అలాంటి భావోద్వేగపు కథ ఈ స్విడిష్ యువతి గాథ! అసలేం జరిగిందంటే..స్వీడన్‌కి చెందిన 41 ఏళ్ల ప్యాట్రిసియా ఎరిక్సన్ ఫిబ్రవరి 1983లో నాగాపూర్‌లోని డాగా హాస్పిటల్లో జన్మించింది. ఒక ఏడాది తర్వాత స్వీడిష్ దంపతులు ఆమెను దత్తత తీసుకున్నారు. తనన పెంచి పెద్ద చేసిన తల్లి తన కన్నతల్లి కాదని తెలుసుకుని భావోద్వేగానికి గురవ్వుతుంది. అయినప్పటికీ ఇన్నేళ్లు తనను ఎంతో ప్రేమగా పెంచిన పెంపుడు తల్లి పట్ల అపారమైన కృజ్ఞత ఉన్నప్పటికీ ఒక్కసారి తన తల్లిని తనవితీరా చూడాలని కోరుకుంటుంది. అందుకోసం ఆమె తన తల్లి ఎక్కడ ఉండేది అనే దిశగా ఆమె ఆచూకీకై వెతకడం ప్రారంభించింది. అలా ఆమె తన తల్లిని వెతుక్కుంటూ నాగ్‌పూర్‌కి చేరుకుంది. అక్కడ తన తల్లి ఆచూకీకి సంబంధించిన వివరాలు, ఆధారాలు సేకరించడం మొదలు పెట్టింది. ఆ భావోద్వేగపూరిత అన్వేషణలో ఎరిక్సన్కి అంజలా పవార్ అనే న్యాయవాది సాయం అందిస్తున్నారు. ఇలా జీవ సంబంధమైన తల్లుల కోసం వేరే దేశ యువతలు భారతదేశానికి వచ్చి కోరడం అనేది తొలిసారి కాదు. ఇంతకుమునుపు స్విస్ మహిళ విద్యా ఫిలిప్పన్ కూడా ముంబైలో తన జీవసంబంధమైన తల్లి కోసం ఒక దశాబ్దంగా వెతుకుతూ ఉంది. అయితే ఆ కేసులో ఆమె తల్లి చిరునామా, ప్రస్తుతం ఉనికిలో లేకపోవడమే ఆ యువతి ప్రధాన సవాలుగా మారింది. దీంతో ఆమె తల్లి ఎక్కడకు వెళ్లి ఉంటుందనేది చిక్కముడి వీడని మిస్టరీలా మారిపోయింది. #WATCH | Nagpur, Maharashtra: Swedish National Patricia Eriksson comes to Nagpur to search for her biological mother. She says, "The kids in school started to explain that they have their mother's hair and father's nose. Then I realised I couldn't do the same... From a child's… pic.twitter.com/bcyXL4se6o — ANI (@ANI) April 3, 2024 (చదవండి: హెయిర్ స్ట్రైయిట్‌నింగ్ చేయించుకుంటున్నారా? వైద్యులు వార్నింగ్) -
ఉత్తరప్రదేశ్ వాసిని పెళ్లాడిన స్వీడిష్ యువతి
ప్రేమకు హద్దులు లేవని ఇక్కడొక జంట నిరూపించారు. ఇంతవరకు మన భారతీయులు విదేశీయులను పెళ్లాడిన ఎన్నో ఉదంతాలను చూశాం. అచ్చం అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని ఎటాహ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..డెహ్రుడూన్‌లో బీటెక్ పూర్తి చేసిన పవన్ కుమార్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి స్వీడిష్ యువతి క్రిస్టెన్ లీబర్ట్ 2012లో ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత అది కాస్త ప్రేమగా మారీ అతని కోసం దేశం విడిచి వచ్చేంత వరకు వచ్చింది. ఈ మేరకు ఆమె అతడిని పెళ్లి చేసుకునేందుకు పవన్‌కుమార్ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని ఎటాహ్‌కి వచ్చింది. అక్కడ ఒక పాఠశాలలో ఆ జంట ఘనంగా వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి పవన్ కుమార్ తల్లిదండ్రులు అంగీకరించడం విశేషం. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఇరువురు పెళ్లితో ఒక్కటయ్యారు. ఐతే తమకు పిల్లల ఆనందంలోనే తమ సంతోషం దాగి ఉందని ఆనందంగా చెబుతున్నారు వరుడి తండ్రి గీతా సింగ్. ఈ పెళ్లికి తాము మనస్పూర్తిగా అంగీకరిచినట్లు తెలిపారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Swedish woman flies to India to marry longtime boyfriend from Uttar Pradesh. Read: https://t.co/GnxZODg05d pic.twitter.com/KJ2whmaC2k — editorji (@editorji) January 29, 2023 (చదవండి: అక్కడ ఉల్లి మహా ఘాటు..ధర వింటే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి) -
సోషల్ మీడియా స్నేహితుడి కోసం సాహసం!
ముంబై: సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పరిచయమైన స్నేహితుడిని కలవడం కోసం స్వీడన్‌కు చెందిన 16 ఏళ్ల బాలిక సాహసం చేసింది. స్నేహితుడిని కలిసేందుకు స్వీడన్ నుంచి ముంబైకి ఒంటరిగా చేరుకుంది. అయితే చివర్లో పోలీసులు సదరు బాలిక జాడ తెలుసుకొని తల్లిదండ్రులతో కలపడంతో కథ సుఖాంతమైంది. ఈ బాలిక తండ్రి భారతీయ మూలాలున్న వ్యక్తి. ఈయన నవంబర్ 27న స్వీడన్లో పోలీసు కంప్లైంట్ ఇచ్చారు. దీనిపై ఆ దేశం ఇంటర్‌పోల్ సాయం కోరింది. ఇంటర్‌పోల్ నుంచి యెల్లో నోటీసు అందుకున్న ముంబై క్రైంబ్రాంచ్ సదరు బాలిక కోసం అన్వేషణ సాగించింది. టెక్నాలజీ సాయంతో ఆమె ఆన్లైన్ యాక్టివిటీస్‌ను పరిశీలించిన పోలీసులు ఆమెకు ముంబైలో ఉన్న సోషల్ మీడియా ఫ్రెండ్‌ను గుర్తించారు. అతన్ని పోలీసులు విచారించగా, స్వీడన్ బాలిక ముంబై ట్రాంబే ఏరియాలోని చీతా క్యాంప్‌లో ఉన్నట్లు తెలిపాడు. అక్కడికి వెళ్లిన పోలీసులు బాలికను అదుపులోకి తీసుకొని స్వీడన్ ఎంబసీకి కబురందించారు. శుక్రవారం ముంబైకి వచ్చిన బాలిక కుటుంబ సభ్యులకు పోలీసులు ఆమెను అప్పజెప్పారు. టూరిస్టు వీసాపై ఆమె ఇండియాకు వచ్చింది. -
చెన్నైలో భిక్షమెత్తుకుంటున్న మహిళా పారిశ్రామికవేత్త
సాక్షి, చెన్నై: మానసిక ప్రశాంతత కోసం స్వీడెన్కు చెందిన ఒక మహిళా పారిశ్రామిక వేత్త కోయంబత్తూరు వీధుల్లో భిక్ష మెత్తుకోవడం స్థానికులను ఆశ్చర్యపరిచింది. స్వీడెన్ దేశానికి చెందిన కిమ్ అనే మహిళా పారిశ్రామికవేత్త. కొన్నినెలల క్రితం కోవైలోని ఈషాయోగా కేంద్రానికి చేరుకుని అక్కడి పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజలకు సహాయాలు చేస్తున్నారు. అయినా మానసిక ప్రశాంతత దొరక్కపోవడంతో రెండు చేతులూ జోడించి నమస్కరిస్తూ వీధుల్లో తిరుగుతూ భిక్షమెత్తడం ప్రారంభించారు. ప్రయాణికులిచ్చే ఐదు, పది రూపాయలను తీసుకుంటున్నట్లు కిమ్ తెలిపారు. ధనికురాలైన విదేశీ యువతి కోవై వీధుల్లో భిక్షమెత్తడం స్థానికంగా చర్చనీయాంశమైంది. చదవండి: ఆ బిలియనీర్ బ్లూమ్‌బర్గ్‌ను అమ్మేస్తాడు.. -
పదేపదే అనకూడని, వినకూడని మాటలతో..
స్టాక్‌హోం: అది స్వీడన్ వీధి. సమయం రాత్రయింది. ఒంటరిగా ఓ ఆడపిల్ల నడిచి వెళుతోంది. అప్పుడే ఇద్దరు చిల్లరగా తిరిగే యువకులు ఆమె వెంటపడ్డారు. అనకూడని మాటలతో వేధించారు. అందులో ఒకరు ఎక్కడపడితే అక్కడ చేతులు వేస్తున్నాడు. మరొకడు మాటలతో వేధిస్తున్నాడు. ఆ క్షణంలో వారిని చంపేయాలన్నంత కోపం వచ్చినా.. పంటి బిగువునా దాచుకొని.. తనను తాను తమాయించుకుంటూ వారి చెత్త ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పింది. ఆ సమయంలో చోటుచేసుకున్న సంఘటనను ఆడియోతో సహా రికార్డు చేసింది. ఆ వీడియో చూసిన వారంతా ఆ నిందితులకు తగిన బుద్ధి చెప్పాలంటూ మండిపడుతున్నారు. స్వీడన్‌లోని పశ్చిమ స్టాక్ హోంకు సమీపంలోని సోడర్మాన్ లాండ్ లో ఓ యువతి ఒంటరిగా నడిచి వెళుతుండటం చూసి ఇద్దరు స్వీడనేతర వ్యక్తులు వెంటపడ్డారు. వారిలో ఒకరు ఆ యువతిని అసభ్యకరంగా ముట్టుకునే ప్రయత్నం చేస్తుండగా మరొకడు మాత్రం ఈ రోజు నాతో(అసభ్య పదజాలం) గడుపుతావా అంటూ అడిగాడు.. డబ్బులిస్తాను అంటూ వేధించాడు. అప్పటి వరకు వారికి ఓపికతో సమాధానం చెప్పిన ఆ యువతి ఆ దుశ్చర్యకు సంబంధించిన వీడియోను రికార్డు చేస్తూనే 'నన్ను వేశ్య అనకుంటున్నావా.. దయచేసి వెళ్లిపో.. నన్ను ఒంటరిగా వదిలేయండి' అంటూ ప్రాధేయపడింది. అయినా, వినని ఆ ఇద్దరిలో ఒకడు పదేపదే అదే పదజాలంతో ఆమెను విసిగించగా ఆ తతంగాన్నంత వీడియో తీసి పోలీసులకు అప్పగించింది. పోలీసులు వారిని గుర్తించే పనిలో పడ్డారు. -
వామ్మో...అలారం
-
వామ్మో...అలారం
స్వీడన్: పొద్దున్నే మర్చిపోకుండా నిద్ర లేవాలంటే ఎవరైనా ఏం చేస్తాం.. అలారం పెట్టుకుంటాం. అయనా ఠంచన్ గా అలారం మోగినా లేవడానికి బద్దకించేవాళ్లు చాలామందే ఉన్నారు. అంతేకాదు దాని నెత్తిమీద ఒకటి మొట్టి మరీ మళ్లీ ముసుగు తన్ని పడుకోవడం కూడా కామనే... అవునా.. కాని ఇపుడు ఓ అలారం ఆ పప్పులేవీ ఉడకవు అంటోంది. పాఠం అప్పచెప్పకపోతే బెత్తం తీసుకుని వాయించే టీచర్ లా.. లేచే దాకా మొఖం మీద ఫెడీ. ఫెడీ వాయిస్తూనే ఉంటానంటోంది. ఎంతటి కుంభకర్ణులకైనా దెబ్బకు దెయ్యం అదేనండి..నిద్ర పారిపోవాల్సిందే అంటోంది. దీనికి సంబంధించి స్వీడిస్ మహిళ విడుదల చేసిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వేకప్ అలారాన్ని చూసిన నెటిజన్లు, ఇదేమీ అలారం రా బాబూ అనుకుంటూనే లైక్ ల మీద కొడుతూ, వేల కొద్దీ షేర్ లు చేస్తున్నారట.