పదేపదే అనకూడని, వినకూడని మాటలతో.. | Shocking video shows Swedish woman being harassed and groped by gang of migrant men | Sakshi
Sakshi News home page

పదేపదే అనకూడని, వినకూడని మాటలతో..

Published Mon, Jan 18 2016 7:57 PM | Last Updated on Wed, Sep 26 2018 6:09 PM

పదేపదే అనకూడని, వినకూడని మాటలతో.. - Sakshi

పదేపదే అనకూడని, వినకూడని మాటలతో..

స్టాక్‌హోం: అది స్వీడన్ వీధి. సమయం రాత్రయింది. ఒంటరిగా ఓ ఆడపిల్ల నడిచి వెళుతోంది. అప్పుడే ఇద్దరు చిల్లరగా తిరిగే యువకులు ఆమె వెంటపడ్డారు. అనకూడని మాటలతో వేధించారు. అందులో ఒకరు ఎక్కడపడితే అక్కడ చేతులు వేస్తున్నాడు. మరొకడు మాటలతో వేధిస్తున్నాడు. ఆ క్షణంలో వారిని చంపేయాలన్నంత కోపం వచ్చినా.. పంటి బిగువునా దాచుకొని.. తనను తాను తమాయించుకుంటూ వారి చెత్త ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పింది. ఆ సమయంలో చోటుచేసుకున్న సంఘటనను ఆడియోతో సహా రికార్డు చేసింది. ఆ వీడియో చూసిన వారంతా ఆ నిందితులకు తగిన బుద్ధి చెప్పాలంటూ మండిపడుతున్నారు.

స్వీడన్లోని పశ్చిమ స్టాక్ హోంకు సమీపంలోని సోడర్మాన్ లాండ్ లో ఓ యువతి ఒంటరిగా నడిచి వెళుతుండటం చూసి ఇద్దరు స్వీడనేతర వ్యక్తులు వెంటపడ్డారు. వారిలో ఒకరు ఆ యువతిని అసభ్యకరంగా ముట్టుకునే ప్రయత్నం చేస్తుండగా మరొకడు మాత్రం ఈ రోజు నాతో(అసభ్య పదజాలం) గడుపుతావా అంటూ అడిగాడు.. డబ్బులిస్తాను అంటూ వేధించాడు. అప్పటి వరకు వారికి ఓపికతో సమాధానం చెప్పిన ఆ యువతి ఆ దుశ్చర్యకు సంబంధించిన వీడియోను రికార్డు చేస్తూనే 'నన్ను వేశ్య అనకుంటున్నావా.. దయచేసి వెళ్లిపో.. నన్ను ఒంటరిగా వదిలేయండి' అంటూ ప్రాధేయపడింది. అయినా, వినని ఆ ఇద్దరిలో ఒకడు పదేపదే అదే పదజాలంతో ఆమెను విసిగించగా ఆ తతంగాన్నంత వీడియో తీసి పోలీసులకు అప్పగించింది. పోలీసులు వారిని గుర్తించే పనిలో పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement