ఉత్తరప్రదేశ్‌ వాసిని పెళ్లాడిన స్వీడిష్‌ యువతి | Viral Video: Swedish Woman Married Uttar Pradesh Local Resident | Sakshi
Sakshi News home page

ఉత్తరప్రదేశ్‌ వాసిని పెళ్లాడిన స్వీడిష్‌ యువతి

Published Sun, Jan 29 2023 9:12 PM | Last Updated on Sun, Jan 29 2023 9:12 PM

Viral Video: Swedish Woman Married Uttar Pradesh Local Resident  - Sakshi

ప్రేమకు హద్దులు లేవని ఇక్కడొక జంట నిరూపించారు. ఇంతవరకు మన భారతీయులు విదేశీయులను పెళ్లాడిన ఎన్నో ఉదంతాలను చూశాం. అచ్చం అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని ఎటాహ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..డెహ్రుడూన్‌లో బీటెక్‌ పూర్తి చేసిన పవన్‌ కుమార్‌ ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి స్వీడిష్‌ యువతి క్రిస్టెన్ లీబర్ట్ 2012లో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత అది కాస్త ప్రేమగా మారీ అతని కోసం దేశం విడిచి వచ్చేంత వరకు వచ్చింది.

ఈ మేరకు ఆమె అతడిని పెళ్లి చేసుకునేందుకు పవన్‌కుమార్‌ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని ఎటాహ్‌కి వచ్చింది. అక్కడ ఒక పాఠశాలలో ఆ జంట ఘనంగా వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి పవన్‌ కుమార్‌ తల్లిదండ్రులు అంగీకరించడం విశేషం. ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన ఇరువురు పెళ్లితో ఒక్కటయ్యారు. ఐతే తమకు పిల్లల ఆనందంలోనే తమ సంతోషం దాగి ఉందని ఆనందంగా చెబుతున్నారు వరుడి తండ్రి గీతా సింగ్‌. ఈ పెళ్లికి తాము మనస్పూర్తిగా అంగీకరిచినట్లు తెలిపారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

(చదవండి: అక్కడ ఉల్లి మహా ఘాటు..ధర వింటే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement