లక్నో: సామాజిక మాధ్యమ వేదిక ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యారు. ఆపైన ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ప్రియుడు యూపీ వాసి కాగా ప్రియురాలు పాకిస్తానీ. ఆమెను పెళ్లి చేసుకునేందుకు దొంగచాటుగా సరిహద్దులు దాటి పాకిస్తాన్ వెళ్లాడు. ప్రేమికురాలిని కలుసుకున్నాడు. అక్కడి పోలీసులకు దొరికిపోయి జైలు ఊచలు లెక్కిస్తున్నాడు.
యూపీలోని అలీగఢ్ జిల్లా నగ్లా ఖట్కారి గ్రామానికి చెందిన ప్రియుడు బాదల్ బాబు(30) కథ ఇది. పాక్ ప్రియురాలి కోసం ఇప్పటికే ఇతడు 2024 జులైలో ఒక పర్యాయం సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించాడు. బీఎస్‌ఎఫ్ జవాన్లు ఖఖర్ పోస్ట్ వద్ద ఇతడిని పట్టుకుని జమ్మూకశ్మీర్ పోలీసులకు అప్పగించారు. దీంతో తిరిగి సొంతింటికే చేరాడు.
తాజాగా రెండో ప్రయత్నంలో విజయం సాధించాడు. సరిహద్దులు దాటి పంజాబ్‌లోని మండి బహాఉద్దీన్ నగరంలో ప్రేమికురాలిని కలుసుకున్నాడు. అయితే, ఎలాంటి ప్రయాణ పత్రాలు, వీసా వంటివి లేకపోవడంతో డిసెంబర్ 27వతేదీన అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడిపై పారినర్స్ చట్టం కింద కేసు పెట్టారు. కోర్టు ఇతడిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపించింది. జనవరి 10వ తేదీన కేసు విచారణకు రానుందని పాక్ అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment