Married Indian Woman Travels To Pakistan To Meet Her Boyfriend Met On Facebook, Goes Viral - Sakshi
Sakshi News home page

UP Anju Facebook Love Story: ఇదో వింత ప్రేమ.. ఇద్దరు పిల్లలున్నా పాక్‌ యువకుడితో ప్రేమ.. అతడి కోసం సరిహద్దు దాటి.. 

Published Mon, Jul 24 2023 8:44 AM | Last Updated on Mon, Jul 24 2023 9:55 AM

Married Indian Woman Travels To Pak To Meet Her Lover - Sakshi

జైపూర్‌: ఇటీవలి కాలంలో ఆన్‌లైన్‌ పరిచయాలతో యువత ప్రేమలో మునిగిపోతున్నారు. కొద్దిరోజుల పరిచయాలకే సరిహద్దులతో పాటు దేశాలు కూడా దాటిపోతున్నారు. మొన్నటికి మొన్న పాకిస్థాన్‌కు చెందిన సీమా.. తన ప్రేమ కోసం భారత్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే భారత్‌కు చెందిన ఓ యువతి.. ఫేస్‌బుక్‌ ప్రేమలో పడి పాకిస్తాన్‌కు వెళ్లింది. వీరి ప్రేమ వ్యవహారం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. 

వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వివాహిత అంజు(34)కు.. సోషల్‌ మీడియాలో పాకిస్థాన్‌కు చెందిన నస్రుల్లా ఖాన్‌(29)తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వీరి పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. దీంతో, వీరిద్దరూ ఒకరిపై ఒకరు ప్రేమను పెంచుకున్నారు. ఇక, ఒకరినొకరు కాలవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అంజు.. సరిహద్దులు దాటి పాక్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ఫ్రావిన్స్‌లోని దీర్ సిటీకి జూలై 21న వెళ్లినట్టు తెలుస్తోంది. 

ఈ సందర్బంగా అంజు భర్త అరవింద్‌ మాట్లాడుతూ.. తన భార్య జైపూర్‌కు వెళ్తున్నాననే నెపంతో గురువారం ఇంటి నుంచి వెళ్లినట్టు తెలిపారు. కాగా, ఆమె పాకిస్థాన్‌కు వెళ్లినట్టు తెలిసిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన స్నేహితుడిని కలవాలని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయిందని వెల్లడించాడు. ఆమె ఆదివారం సాయంత్రం 4 గంటలకు అతనికి ఫోన్ చేసి, తాను లాహోర్‌లో ఉన్నానని, రెండు మూడు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పిందని తెలిపాడు. 

ఇదిలా ఉండగా.. యూపీకి చెందిన అంజుతో అరవింద్‌కు 2007లో వివాహం జరిగింది. వీరికి 15 ఏళ్ల బాలిక, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. అంజు ప్రస్తుతం.. ప్రైవేట్ సంస్థలో బయోడేటా ఎంట్రీ ఆపరేటర్‌గా ఉద్యోగం చేస్తోంది. అటు నస్రుల్లా.. వైద్య రంగంలో పనిచేస్తున్నాడు. అయితే, అంజు పాకిస్థాన్‌లో ఉన్నట్టు తెలియడంతో రాజస్థాన్‌ పోలీసులు అలర్ట్‌ అయ్యారు. కాగా, పాక్‌కు వెళ్లేందుకు అంజు వద్ద అన్ని ప్రయాణ పత్రాలు కరెక్ట్‌గానే ఉన్నాయని తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు అక్కడ సెక్యూరిటీ కల్పించాలని అధికారులను కోరారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనకు పాల్పడకుండా ఉండాలని సూచించారు. 

ఇది కూడా చదవండి: సీమా, సచిన్‌ల స్టోరీని తలపించే ఇక్రా, ములాయం లవ్‌ స్టోరీ.. చివరికి?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement