![Up: Facebook Friend Shoots Girl At Her Home After Dispute Hathras - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/21/gangster.jpg.webp?itok=F6XGpB2o)
లక్నో: యూపీలోని హత్రాస్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన స్నేహితుడితో కలిసి గర్ల్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్లి ఆమె తల్లి ముందే కాల్చి చంపాడు. సదరు వ్యక్తి బాలిక తల్లిపై కూడా కాల్పులు జరపగా ఆమె తప్పించుకుంది. నిందితుడిని మధురలోని హసన్ గ్రామంలో నివసిస్తున్న నరేంద్ర అలియాస్ రింకుగా గుర్తించారు. ఈ విషాదకర ఘటన కైలోరా గ్రామంలో జరిగింది.
అకస్మాత్తుగా కాల్పుల శబ్ధాలు రావడంతో అక్కడికి చేరుకున్న స్ధానికులు రింకూను పట్టుకోగా అతడి స్నేహితుడు తప్పించుకున్నాడు. బాలిక కడుపులో కాల్చడంతో తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను ఆసుపత్రికి తీసుకువెళుతుండగా మార్గమధ్యంలోనే మరణించింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి నుంచి నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బాలికకు ఫేస్‌బుక్‌లో పరిచయమై గత ఏడాది కాలంగా సన్నిహితంగా ఉంటున్నాడు. ఇటీవల ఇద్దరి మధ్య ఏదో విషయమై బేధాభిప్రాయాలు తలెత్తడంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది.
Comments
Please login to add a commentAdd a comment