Pistol fire
-
పాకిస్తాన్లో చైనీయులే టార్గెట్‌గా కాల్పులు.. డ్రాగన్ వార్నింగ్ తప్పదా?
దాయాది దేశం పాకిస్తాన్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆసుప్రతిలోకి చొరబడిన ఆగంతకుడు విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ప్రమాదంలో ఒక చైనాకు చెందిన ఓ వ్యక్తి మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం.. కరాచీ నగరంలోని డెంటల్ క్లినిక్‌లోని ఆంగతకుడు రోగిలా నటిస్తూ ప్రవేశించాడు. అనంతరం, గన్‌తో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ప్రమాదంలో చైనాకు చెందిన ఓ వ్యక్తి మృతిచెందగా మరో ఇద్దరు(ఓ మహిళ) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని రోనిల్‌డి రైమండ్ చావ్, మార్గ్రేడ్ మరియు రిచర్డ్లుగా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాద ఘటనపై సింధ్ ముఖ్యమంత్రి మురాద్ అలీ షా స్పందించారు. కాల్పుల ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కాల్పులు జరిపిన వ్యక్తి వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో పాకిస్తాన్లో చైనీయులపై దాడులు ఎక్కువయయ్యాయి. కాగా, ఏప్రిల్‌లో కరాచీ యూనివర్సిటీలో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆత్మాహుతి దళ సభ్యురాలు తనను తాను పేల్చివేసుకున్న ఘటనలో నలుగురు చనిపోయారు. మృతుల్లో ముగ్గురు చైనీయులు ఉన్నారు. ఇక, ఈ దాడి తామే చేశామంటూ.. బెలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకుంది. దీంతో, పాక్తిసాన్కు వార్నింగ్ ఇచ్చింది. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించింది. #Karachi: Firing on Dental Clinic in Saddar area, One #Chinese Citizen killed while 2 others including a woman have got injured. pic.twitter.com/eEqsRISDTS — Drakshaan Baloch (@IsmailBaloch88) September 28, 2022 -
ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై అటాక్.. ఆ కారణం వల్లే పిస్టల్ తలకు గురిపెట్టి..
సాక్షి, హైదరాబాద్: ఆర్మూర్ ఎమ్మెల్యే ఎ.జీవన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో మాక్లూరు మండలం కల్లెడ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భర్త పెద్దగాని ప్రసాద్‌గౌడ్‌ను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డెవిస్ సోమవారం ప్రకటించారు. టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావుతో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. బిల్లులు ఆగాయని హత్యకు పథకం.. కొన్నాళ్లుగా జీవన్‌రెడ్డి, ప్రసాద్‌గౌడ్‌కు స్పర్థలున్నా యి. తన భార్య కల్లెడ సర్పంచ్‌గా ఉండగా ప్రసాద్ ఆ గ్రామంలో రూ.20 లక్షల విలువైన కాంట్రాక్టులు చేశాడు. ఈ పనుల్లో అవకతవ కలు జరిగినట్లు మాక్లూర్ ఎంపీఓ నివేదిక రూపొందించారు. దీంతో కలెక్టర్ కల్లెడ సర్పంచ్‌ను సస్పెండ్ చేశారు. ప్రసాద్‌కు రావాల్సిన బిల్లులు ఆగిపోయాయి. విచక్షణ కోల్పోయిన ప్రసాద్ ఎంపీఓపై దాడి చేయడంతో మాక్లూర్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. తనతో ఉన్న విభేదాలతో జీవన్‌రెడ్డే ఇవన్నీ చేయిస్తున్నాడని భావించిన ప్రసాద్.. హత్యకు పథకం వేశాడు. గత ఏప్రిల్‌లో నాందేడ్‌లో కత్తి, జూన్‌లో సంతోష్ సహకారంతో నగరంలోని నాంపల్లిలో ఎయిర్‌పిస్టల్, పిల్లెట్స్ కొన్నాడు. నేరుగా జీవన్‌రెడ్డి ఇంటికెళ్లినా ఆయన లేకపోవడంతో కొద్దిసేపు రెక్కీచేసి ఊరికి వెళ్లిపోయాడు. తలకు ఎయిర్‌పిస్టల్ గురిపెట్టి.. జూలై మొదటి వారంలో నిజామాబాద్‌కు చెందిన సుగుణ ద్వారా బాల్కొండకు చెందిన సురేందర్ ప్రసాద్‌కు పరిచయమయ్యాడు. రూ.60 వేలు తీసుకున్న సురేందర్.. బిహార్‌లోని మున్నాకుమార్ ద్వారా నాటుపిస్టల్ తెప్పించి, ప్రసాద్‌కిచ్చాడు. తూటాల కోసం దమ్మాయ సాగర్‌తో కలిసి ప్రయత్నించినా దొరకలేదు. దీంతో నాంపల్లిలోని ఆర్మరీకి వెళ్లిన తూటాలు కావాలని అడి గినా వారు ఇవ్వలేదు. ఈ క్రమంలో ఈనెల 1న రాత్రి ప్రసాద్ బంజారాహిల్స్‌లోని జీవన్‌రెడ్డి ఇంటికెళ్లాడు. నేరుగా బెడ్రూమ్లోకి వెళ్లి ఆయన తలకు ఎయిర్‌పిస్టల్ గురిపెట్టాడు. ఎమ్మెల్యే కేకలు వేయడం.. గన్మెన్లు అప్రమత్తం కావడంతో ప్రసాద్ పారిపోయాడు. జీవన్‌రెడ్డి ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసునమోదు చేశారు. ఆదివారం రాత్రి ప్రసాద్‌ను పట్టుకుని.. కారు, ఎయిర్ పిస్టల్స్, పిల్లెట్స్, నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. ఇతడిపై ఇప్పటికే 5 క్రిమినల్ కేసులున్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న సుగుణ, సంతోష్, మున్నాకుమార్, సురేందర్, దమ్మాయ సాగర్ కోసం గాలిస్తున్నారు. నిర్లక్ష్యంగా ఉన్న గన్మెన్లపై ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని, ప్రసాద్ భార్య పాత్రపై ఆధారాల్లేవని డీసీపీ తెలిపారు. ఇది కూడా చదవండి: ‘నేనే కాంగ్రెస్.. కాంగ్రెస్సే నేను’.. ఆసక్తికరంగా భట్టి విక్రమార్క వ్యాఖ్యలు -
ఫేస్బుక్ పరిచయం: గర్ల్‌ఫ్రెండ్ ఇంటికెళ్లి.. ఆమె తల్లి ముందే
లక్నో: యూపీలోని హత్రాస్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన స్నేహితుడితో కలిసి గర్ల్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్లి ఆమె తల్లి ముందే కాల్చి చంపాడు. సదరు వ్యక్తి బాలిక తల్లిపై కూడా కాల్పులు జరపగా ఆమె తప్పించుకుంది. నిందితుడిని మధురలోని హసన్ గ్రామంలో నివసిస్తున్న నరేంద్ర అలియాస్ రింకుగా గుర్తించారు. ఈ విషాదకర ఘటన కైలోరా గ్రామంలో జరిగింది. అకస్మాత్తుగా కాల్పుల శబ్ధాలు రావడంతో అక్కడికి చేరుకున్న స్ధానికులు రింకూను పట్టుకోగా అతడి స్నేహితుడు తప్పించుకున్నాడు. బాలిక కడుపులో కాల్చడంతో తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను ఆసుపత్రికి తీసుకువెళుతుండగా మార్గమధ్యంలోనే మరణించింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి నుంచి నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బాలికకు ఫేస్బుక్లో పరిచయమై గత ఏడాది కాలంగా సన్నిహితంగా ఉంటున్నాడు. ఇటీవల ఇద్దరి మధ్య ఏదో విషయమై బేధాభిప్రాయాలు తలెత్తడంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. చదవండి: ‘రోజూ నరకం చూపేవాడు.. కసితీరా పొడిచి చంపేశా’ -
కాల్చితే చనిపోలేదని కత్తితో హత్యచేశారు
సాక్షి, చెన్నై : చెక్ పోస్టులో విధుల్లో ఉన్న ఎస్ఐ విల్సన్‌ను తుపాకీతో తీవ్రవాది తౌఫిక్ కాల్చగా, మరో తీవ్రవాది అబ్దుల్ సమీమ్ కత్తితో పొడిచి హతమార్చినట్టు విచారణలో తేలింది. డీఎస్పీ గణేషన్ నేతృత్వంలోని బృందం శనివారం ఆ ఇద్దర్ని సంఘటన స్థలానికి తీసుకొచ్చి విచారణ జరిపారు. కన్యాకుమారి జిల్లా కళియకావిలై చెక్‌పోస్టులో ఎస్ఐ విల్సన్ హత్య కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. పట్టుబడ్డ తీవ్రవాదుల్ని కస్టడీలోకి తీసుకున్న డీఎస్పీ గణేషన్ నేతృత్వంలోని బృందం విచారణను వేగవంతం చేసింది. శనివారం ఆ ఇద్దర్నీ కళియకావిలై చెక్‌పోస్టుకు తీసుకొచ్చారు. హత్య పథకం అమలు గురించి ఆ ఇద్దర్ని అడిగి తెలుసుకున్నారు. ఎస్ఐ విల్సన్‌ను తుపాకీతో తౌఫిక్ కాల్చగా, సమీమ్ ఆక్రోశంతో తన వద్ద ఉన్న కత్తితో పొడిచి హతమార్చినట్టు విచారణలో తేలింది. ఎస్ఐ కూప్పకూలినానంతరం ఆ ఇద్దరు సమీపంలోని మసీదు వెనుక భాగంలో ఉన్న ప్రహరీ దూకి లోనికి వచ్చారు. ఏమి ఎరగనట్టుగా ముందు వైపు నుంచి కేరళ రాష్ట్రం తిరువనంతపురానికి తప్పించుకు వెళ్లే పనిలో పడ్డారు. మార్గమధ్యలో లిఫ్ట్ తీసుకునే యత్నం చేసినా, ఏ ఒక్క వాహనదారుడు వారికి సహకరించలేదు. చివరకు ఓ ఆటోలో కొంత దూరం వెళ్లి , అక్కడినుంచి బస్సు మార్గంలో తిరువనంతపురం చేరుకున్నట్టుగా ఆ నిందితులు విచారణలో పోలీసుల దృష్టికి తెచ్చారు. చెక్‌పోస్టులో సాగిన విచారణ అనంతరం ఆ ఇద్దర్నీ రహస్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ వీరి వద్ద విచారణ సాగుతోంది. ఈ విచారణ గురించి డీఎస్పీ గణేషన్ మీడియాతో మాట్లాడుతూ విచారణ వేగం పెంచామన్నారు. తుపాకీ, కత్తి స్వాధీనం చేసుకున్నామని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. ఇదిలా ఉండగా, ఈ హత్యకు సహకరించి అరెస్టయిన వారిలోని మరో ఇద్దరు సానుభూతిపరుల ఇళ్లపై ఎన్ఐఏ దృష్టి పెట్టింది. కడలూరు జిల్లా నైవేలిలోని ఖాజామొహిద్దీన్ కొండూరులోని అలీ ఇళ్లల్లో ఈ సోదాలు సాగాయి. -
కదులుతున్న కారులోనే భార్య, మరదలిని చంపి..
పట్నా : బీహార్ రాజధాని పట్నా సమీపంలోని సైదాబాద్ ప్రాంతంలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. ఒక ఆర్మీ జవాన్ తన పిల్లల కళ్ల ముందే కదులుతున్న కారులోనే తుపాకీతో కట్టుకున్న భార్యను, మరదలును కాల్చి చంపాడు. ఆపై తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పాలిగంజ్ డీఎస్పీ మనోజ్ కుమార్ పాండే వివరాల ప్రకారం.. 33 ఏళ్ల విష్ణు కుమార్ గుజరాత్లో ఆర్మీ జవాన్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య దామిని శర్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా రెండు నెలల క్రితం విష్ణుకుమార్‌కు డెంగ్యూ సోకింది. అప్పటి నుంచి విష్ణు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మానసిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో విష్ణుకు పట్నాలో చికిత్స చేయించడానికి తమ సొంత ఊరైన అరా నుంచి కారులో బయలుదేరారు. కారులో విష్ణుతో పాటు అతని భార్య, మరదలు డింపుల్ శర్మ, ఇద్దరు పిల్లలతో పాటు విష్ణు తండ్రి కూడా ఉన్నారు. డైవర్ పక్క సీటులో ఇద్దరు పిల్లలు వారి తాతయ్యతో కలిసి కూర్చోగా, వెనుక సీటులో విష్ణు, అతని భార్య, మరదలు కూర్చున్నారు. ఈ సందర్భంగా విష్ణు, దామినిల మధ్య చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకోవంతో విచక్షణ కోల్పోయిన విష్ణు తన దగ్గర ఉన్న తుపాకీతో భార్య దామిని, మరదలు డింపుల్‌ను కాల్చి తర్వాత తనను తాను కాల్చుకొని చనిపోయాడని మనోజ్ వెల్లడించారు. విష్ణు తండ్రి అందించిన సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. విష్ణు కాల్చిన తుపాకీతో పాటు కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు విష్ణు వాడిన తుపాకీ లైసెన్స్ కలిగి ఉందని నిర్థారించారు. -
చెన్నై ఎయిర్‌పోర్టులో జవాను ఆత్మహత్య
చెన్నై: సీఐఎస్ఎఫ్ జవాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం చెన్నై ఎయిర్‌పోర్టులోని టాయిలెట్ రూంలోకి జవాను వెళ్లాడు. అక్కడే తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.