లక్నో:ఉత్తరప్రదేశ్‌లోని ఓ పెళ్లిలో అనూహ్య సంఘటన జరిగింది. చందౌలీ జిల్లాలోని హమీద్‌పూర్ గ్రామంలో జరిగిన ఈ విచిత్ర పరిణామం అందరినీ షాక్‌కు గురి చేసింది. అసలేం జరిగిందంటే..పెళ్లి కోసం మెహతాబ్ అనే పెళ్లికొడుకు తన బంధు మిత్రులతో కలిసి పెళ్లి కూతురు ఇంటికి వచ్చాడు.
పెళ్లి కూతురు తరపు వాళ్లు పెళ్లికొడుకు బృందానికి ఘనంగా స్వాగతం పలికారు. ఇక్కడివరకు బాగానే ఉంది కానీ తమకు ఇక్కడ సరిపడా భోజనాలు లేవని పెళ్లికొడుకు బంధువులు అతడికి ఫిర్యాదు చేశారు. ఇంకేముంది ఆగ్రహానికి గురైన పెళ్లికొడుకు ఏకంగా పెళ్లి పీఠల మీద నుంచి లేచి వెళ్లిపోయాడు.
ఇంతటితో ఆగకుండా అదే రోజు రాత్రి తన బంధువైన మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికొడుకు నిర్ణయంతో అందరూ ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.పెళ్లికూతురు కుటుంబ సభ్యులు మెహతాబ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment