ముంబై: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పరిచయమైన స్నేహితుడిని కలవడం కోసం స్వీడన్‌కు చెందిన 16 ఏళ్ల బాలిక సాహసం చేసింది. స్నేహితుడిని కలిసేందుకు స్వీడన్ నుంచి ముంబైకి ఒంటరిగా చేరుకుంది. అయితే చివర్లో పోలీసులు సదరు బాలిక జాడ తెలుసుకొని తల్లిదండ్రులతో కలపడంతో కథ సుఖాంతమైంది.
ఈ బాలిక తండ్రి భారతీయ మూలాలున్న వ్యక్తి. ఈయన నవంబర్ 27న స్వీడన్‌లో పోలీసు కంప్లైంట్ ఇచ్చారు. దీనిపై ఆ దేశం ఇంటర్‌పోల్ సాయం కోరింది. ఇంటర్‌పోల్ నుంచి యెల్లో నోటీసు అందుకున్న ముంబై క్రైంబ్రాంచ్ సదరు బాలిక కోసం అన్వేషణ సాగించింది. టెక్నాలజీ సాయంతో ఆమె ఆన్‌లైన్ యాక్టివిటీస్‌ను పరిశీలించిన పోలీసులు ఆమెకు ముంబైలో ఉన్న సోషల్ మీడియా ఫ్రెండ్‌ను గుర్తించారు. అతన్ని పోలీసులు విచారించగా, స్వీడన్ బాలిక ముంబై ట్రాంబే ఏరియాలోని చీతా క్యాంప్‌లో ఉన్నట్లు తెలిపాడు.
అక్కడికి వెళ్లిన పోలీసులు బాలికను అదుపులోకి తీసుకొని స్వీడన్ ఎంబసీకి కబురందించారు. శుక్రవారం ముంబైకి వచ్చిన బాలిక కుటుంబ సభ్యులకు పోలీసులు ఆమెను అప్పజెప్పారు. టూరిస్టు వీసాపై ఆమె ఇండియాకు వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment