
సాక్షి, బొమ్మలరామారం: మారాజ.. మారాజ.. అంటూ చేతిలో తుపాకీతో, మాటల గారడీ చేస్తూ సంక్రాంతి వేళ భిక్షాటన చేస్తూ సందడి చేసే తుపాకీ రాముడు నేడు ట్రెండ్ మార్చాడు. పోలీస్ ఆఫీసర్‌లాంటి ఖాకీ యునిఫాం, చేతిలో కట్టె తుపాకీ, నెత్తికి టోపీ, నల్లరంగు బూట్లను ధరించే తుపాకీ రాముడు ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించుకుంటూ కొత్త అవతారమెత్తాడు.
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండల కేంద్రానికి చెందిన మిరాల రాములు సంచార జాతికి చెందిన వ్యక్తి. 42 ఏళ్లకు పైగా తుపాకీ రాముడి వేషధారణతో సంక్రాంతి సమయంలో భిక్షాటన చేస్తున్నాడు. ఇన్నేళ్లుగా నోటితో గారడీ మాటలు చెబుతూ భిక్షాటన చేసిన రాముడు నేడు ఆధునిక టెక్నాలజీని సైతం వినియోగించుకుంటున్నాడు.
వయసు మీద పడడంతో తన మాటలను రికార్డు చేసి బ్లూటూత్ స్పీకర్ సాయంతో జనానికి వినిపిస్తున్నాడు. సంక్రాంతి పండుగ వేళ బ్లూటూత్ సాయంతో మాటలు వినిపిస్తున్న తుపాకీ రాముడి సందడిని చూసి ప్రజలు ఔరా అని ఆశ్చర్యపోతున్నారు.
– మిరాల రాములు, బొమ్మలరామారం (తుపాకీ రాముడు)
(చదవండి: బోసిపోయిన భాగ్యనగరం..నిర్మానుష్యంగా మారిన రహదారులు)
Comments
Please login to add a commentAdd a comment