రైలు కింద పడి వృద్ధురాలు మృతి | an old woman died in a train accident | Sakshi
Sakshi News home page

రైలు కింద పడి వృద్ధురాలు మృతి

Feb 28 2015 2:46 PM | Updated on Aug 24 2018 2:36 PM

రెంటచింతల మండలంలోని పాలువాయి గేటు గ్రామం వద్ద శనివారం రైలు కింద పడి ఒక వృద్ధురాలు మృతి చెందింది.

గుంటూరు: రెంటచింతల మండలంలోని పాలువాయి గేటు గ్రామం వద్ద శనివారం రైలు కింద పడి ఒక వృద్ధురాలు మృతి చెందింది. వివరాలు...పాలువాయి గేటు గ్రామంలో కొంతకాలంగా భిక్షాటనం చేసుకుంటూ జీవిస్తున్న అంకమ్మ(70) బహిర్భూమికి వెళ్లి తిరిగి వస్తుండగా గుంటూరు నుంచి మాచర్ల వైపు వెళ్తున్న ప్యాసింజర్ రైలు కిందపడి మృతిచెందింది. ఈమెకు కుటుంబసభ్యులు,బంధువులు ఎవరూ లేరని గ్రామస్తులు తెలిపారు.
(రెంటచింతల)

Advertisement
 
Advertisement
Advertisement