రామచంద్రాపురం: మెడలో ఆరడుగుల పామును వేసుకుని ప్రజలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేశాడొక యువకుడు. శుక్రవారం సాయంత్రం రామచంద్రాపురంలోని భారతీనగర్ చౌరస్తాలో ఈ సంఘటన జరిగింది. దాదాపు గంటకుపైగా ఆ యువకుడు పాముతో ప్రజలను బెంబేలెత్తించాడు. బీహెచ్‌ఈఎల్ టౌన్‌షిప్‌లో దేవాలయం ముందు భిక్షాటన చేసే యువకుడు మహేశ్ శుక్రవారం మద్యం తాగి నాగుపామును మెడలో వేసుకుని బయల్దేరాడు.
బెల్ టౌన్ షిప్ లోపలి నుంచి ఎల్‌ఐజీ చౌరస్తా (భారతీనగర్) వరకు వచ్చాడు. రోడ్డుపై అందరినీ బెదిరిస్తూ డబ్బులు అడిగాడు. దీంతో స్థానికులు పోలీసులు, పాములు పట్టే వారికి సమాచారం అందించారు. పాములు పట్టే వారు వచ్చి ఆ పామును స్వాధీనపరచుకున్న వెంటనే స్థానికులు కొందరు కోపంతో యువకుడిపై దాడికి దిగారు. పోలీసులు చేరుకుని మహేశ్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకుపోయారు. ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment