
గమ్యానికి 'ఊతం'!!!
మానవ సంబంధాలు కరెన్సీ బంధనాల్లో చిక్కుకుంటున్నారుు. చివరకు మానవత్వం కూడా నోట్ల కట్టల వాసన ఆస్వాదిస్తూ భూగోళానికి దూరంగా పారిపోతోంది. ..ఆప్యాయత.. అనురాగం.. మమకారాలు బ్యాంకు లాకర్లలో శాశ్వతంగా నిద్రపోవడానికి సిద్ధమవుతున్నారుు. దీనికి ఎన్నో ఉదాహరణలు నిత్యం సమాజంలో కనిపిస్తూనే ఉన్నారుు. అరుుతే అక్కడక్కడా.. అప్పుడప్పుడూ తోక చుక్కల్లా.. ఇంద్రధనసుల్లా స్వచ్ఛమైన ప్రేమ.. రుచికరమైన వెనీలా ఫ్లేవర్‌ను కురిపిస్తూనే ఉంది.
శ్రీరామ్మూర్తి అనే వికలాంగుడు ఎక్కడ నుంచో ఎన్నో ఏళ్ల క్రితం ఒంగోలుకు చేరుకున్నాడు. అరుునవాళ్లంతా కాదు పొమ్మంటే చక్రాల బండిపై తిరుగుతూ భిక్షాటన చేస్తున్నాడు. కొంతకాలానికి అఖిల అనే మహిళ తోడైంది. నీకు నేనున్నానంటూ అతని చేతికర్ర తీసుకుంది. స్త్రీ, పురుషుల బంధానికి డబ్బు.. భవంతులు.. సౌకర్యాలు అక్కరలేదని రెండు మనసులు ఒకటైతే చాలంది. అప్పటి నుంచి ఇద్దరూ కలిసి భిక్షాటన చేస్తున్నారు. కష్టసుఖాలు మాట్లాడుకుంటూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఈయన వికలాంగుడైనా.. ఆధార్ కార్డు ఉన్నా ప్రభుత్వం పింఛను అందించడంలేదు. - సాక్షి, ఒంగోలు