human relations
-
చుట్టూ పక్కల చూడరా..!
కర్నూలు(హాస్పిటల్): మానవ సంబంధాల పేరుతో మనిషన్నవాడు మాయమవుతున్నాడు. అందరూ బాగుంటేనే సమాజం అన్న ధోరణి నుంచి నా కుటుంబం బాగుంటే చాలనే ధోరణితో జీవిస్తున్నాడు. ఈ క్రమంలో చివరికి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లలను సైతం దూరం చేసుకుంటున్నాడు. కేవలం భార్యాబిడ్డలు బాగుంటే చాలని అనుకుంటున్నారు. ఒకప్పుడు పక్కింట్లో పెళ్లంటే ఆ వీధిలో ఉన్న వారందరూ తలోచేయి వేసి ఇంట్లో మనుషుల మాదిరిగా పనులు చేసేవారు. ఇప్పుడు అయిన వారు కూడా చుట్టపుచూపుగా వస్తున్నారు.అయిన వారు అందరూ ఉన్నా పనులన్నీ ఈవెంట్ మేనేజర్లు చూసుకుంటున్నారు. పట్టణీకరణ పేరుతో మనుషులు దూరం అవుతున్నారు. కానీ ఇప్పటికీ పల్లెలు, పట్టణాల్లోని మురికివాడల్లో ఒకప్పటి అనుబంధాలు, ఆత్మీయతలు కొనసాగుతుండటం గమనార్హం. ఉన్నత చదువులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు మనుషులను దూరం చేయడానికా లేదా దగ్గర చేయడానికా అని ఆనాటి పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం ఎవ్వరికైనా ఏదైనా కష్టం వస్తే బంధువుల కంటే ముందు ఇరుగుపొరుగు వారే ముందుగా వచ్చి ఆదుకునేవారు. ఇంట్లో ఎవ్వరైనా చనిపోతే పక్కింటి వారే ఆ కుటుంబానికి అవసరమైన ఏర్పాట్లు చేసేవారు. ఇప్పుడు అపార్ట్మెంట్లలో, అద్దె ఇళ్లల్లో సైతం మృతదేహాన్ని ఉండనీయని పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడం, చిన్న కుటుంబాలు ఏర్పడటం, చిన్నతనంలో పిల్లలను హాస్టల్లో, వృద్ధాప్యంలో పెద్దలను ఆశ్రమాల్లో ఉంచడంతో కుటుంబ విలువలు తగ్గిపోతున్నాయి. ఉన్నత చదువుల పేరుతో ఆధునికత సంతరించుకోవడంతో ఎవ్వరికి వారే అన్న రీతిలో సమాజంలో జీవిస్తున్నారు. నిలవని ప్రేమ వివాహాలు..తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమవివాహాలు చేసుకోవడం ఇటీవల కాలంలో అధికమైంది. కొందరు తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటుండగా మరికొందరు ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటూ వేరుగా ఉంటున్నారు. ఆ తర్వాత ఏడాది, రెండేళ్లకే విడిపోయి తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరుకుంటున్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో వారానికి రెండు, మూడు కేసులైనా అమ్మాయి మిస్సింగ్ అని నమోదవుతున్నాయి. ఇలాంటి ఘటనలు ఇటీవల అధికంగా చూస్తున్న పోలీసులు చాలా మంది అమ్మాయిని వెతకడం అటుంచి రెండురోజులకు వారే వస్తారులే అన్న ధోరణితో మాట్లాడుతున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో వచ్చే చిన్న చిన్న మనస్పర్థలను సర్దిచెప్పేవారు లేక రెండు, మూడేళ్లకే విడిపోతున్నారు. పోలీస్స్టేషన్లు, వన్‌స్టాప్ సెంటర్లు, ఐసీడీఎస్ కార్యాలయాల్లో ఇలాంటి వారికి కౌన్సిలింగ్ నిర్వహించే ఉదంతాలు ఇటీవల అధికమయ్యాయి. కష్టమొస్తే భరోసానిచ్చే చేతుల్లేవు.. నాగరికత వెంట పరుగులు పెడుతున్న మనుషుల మధ్య దూరం మరింత పెరుగుతోంది. ఉన్నత చదువులు, ఉద్యోగాల పేరుతో ఎవ్వరికి వారు వేరుగా ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అపార్ట్మెంట్లో 40కి పైగా కుటుంబాలున్నా.. కష్టమొస్తే పలకరించేవారు ఎవ్వరూ రాని పరిస్థితి నెలకొంది. కానీ పండుగలు, చిన్నచిన్న శుభకార్యాలు మాత్రం చేసుకుని ఎంజాయ్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఎవ్వరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే అయిన వారే పలకరించే దిక్కులేదు. బంధువులు, స్నేహితులు సైతం సోషల్ మీడియాలో మాత్రమే పరామర్శలు చేస్తున్నారు. ఇంటికి వచ్చి ధైర్యం చెప్పేవారు కరువైపోయారు. పలకరించి ఎన్నాళ్లైందో.. ఒకప్పుడు ఇంటికి బంధువులు, స్నేహితులు వస్తే గంటల తరబడి మాట్లాడుకుంటూ ఉండిపోయేవారు. సమయానికి భోజనం చేయాలన్న విషయం కూడా మరిచిపోయేవారు. కుటుంబంతో పాటు ఊళ్లో, సమాజంలో ముచ్చట్లు, రాజకీయాలు, సినిమాలు అన్నీ ఈ మాటల్లో కనిపించేవి. కానీ ఇప్పుడు ఇంటికి ఎవ్వరైనా వస్తే ముఖస్తుతిగా పలకరించి రెండు నిమిషాలు మాట్లాడి వదిలేస్తున్నారు. ఎవ్వరి మొబైల్లో వారు బిజీగా గడుపుతున్నారు. ఎదురుగా ఉన్న వారిని పలకరించే సమయం లేకపోయినా ఎక్కడా కనిపించని వారిని సోషల్ మీడియాలో పలకరించుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. సమాజంలో ప్రస్తుతం మానవ సంబంధాలు ఎలా ఉన్నాయో ఈసంఘటనలే నిదర్శనం.కర్నూలు (Kurnool) నగరానికే చెందిన రాజ్‌కుమార్ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. మూడేళ్ల క్రితం అతని తల్లి అనారోగ్యంతో మరణించింది. విషయం తెలిసిన ఇంటి యజమాని మృతదేహాన్ని ‘మా ఇంట్లో ఉంచొద్దని, మీ బంధువుల ఇళ్లకు తీసుకెళ్లు’ అని గొడవ చేశాడు. ఎంత నచ్చజెప్పినా వినలేదు. దీంతో తప్పనిసరై నగరంలోని తన సోదరుని ఇంటికి అప్పటికప్పుడు మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. నంద్యాల (Nandyala) పట్టణంలో ఇటీవల ఓ వ్యక్తి తన కుమారుడి వివాహం చేశారు. బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఎక్కువ మంది వస్తారని పెద్ద ఫంక్షన్ హాల్, పెళ్లి భోజనంలో రకరకాల స్వీట్లు, వంటకాలు ఏర్పాటు చేశారు. అయితే పెళ్లి ముందు రోజు కూడా పెద్దగా బంధువులు, మిత్రులు రాలేదు. తలంబ్రాల సమయానికి హడావుడిగా వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించి తెచ్చిన గిఫ్ట్‌లను చేతిలో పెట్టి వెళ్లిపోయారు. ఆహార పదార్థాలు భారీగా మిగిలిపోవడంతో అనాథశ్రమానికి పంపించేశారు. ఎమ్మిగనూరుకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి పిల్లల చదువుల కోసం కర్నూలులో ఉంటున్నారు. ఆ వీధిలో అతను దాదాపు పదేళ్లుగా ఉంటున్నాడు. అయితే చుట్టు పక్కల వారితో ఇంత వరకు ఆయన మాట్లాడలేదంటే ఆశ్చర్యం కలగకమానదు. ఉదయాన్నే విధులకు వెళ్లడం, సాయంత్రం ఇంటికి రావడం, కుటుంబీకులతో గడుపుతారు. పక్క ఇళ్లల్లో శుభకార్యం జరిగినా వెళ్లింది లేదు.. ఆపద వచ్చినా పలకరించింది లేదు. -
చుట్టు పక్కల చూడరా..!
కర్నూలు: మానవ సంబంధాల పేరుతో మనిషన్నవాడు మాయమవుతున్నాడు. అందరూ బాగుంటేనే సమాజం అన్న ధోరణి నుంచి నా కుటుంబం బాగుంటే చాలనే ధోరణితో జీవిస్తున్నాడు. ఈ క్రమంలో చివరికి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లలను సైతం దూరం చేసుకుంటున్నాడు. కేవలం భార్యాబిడ్డలు బాగుంటే చాలని అనుకుంటున్నారు. ఒకప్పుడు పక్కింట్లో పెళ్లంటే ఆ వీధిలో ఉన్న వారందరూ తలోచేయి వేసి ఇంట్లో మనుషుల మాదిరిగా పనులు చేసేవారు. ఇప్పుడు అయిన వారు కూడా చుట్టపుచూపుగా వస్తున్నారు. అయిన వారు అందరూ ఉన్నా పనులన్నీ ఈవెంట్ మేనేజర్లు చూసుకుంటున్నారు. పట్టణీకరణ పేరుతో మనుషులు దూరం అవుతున్నారు. కానీ ఇప్పటికీ పల్లెలు, పట్టణాల్లోని మురికివాడల్లో ఒకప్పటి అనుబంధాలు, ఆత్మీయతలు కొనసాగుతుండటం గమనార్హం. ఉన్నత చదువులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు మనుషులను దూరం చేయడానికా లేదా దగ్గర చేయడానికా అని ఆనాటి పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం ఎవ్వరికై నా ఏదైనా కష్టం వస్తే బంధువుల కంటే ముందు ఇరుగుపొరుగు వారే ముందుగా వచ్చి ఆదుకునేవారు. ఇంట్లో ఎవ్వరైనా చనిపోతే పక్కింటి వారే ఆ కుటుంబానికి అవసరమైన ఏర్పాట్లు చేసేవారు. ఇప్పుడు అపార్ట్మెంట్లలో, అద్దె ఇళ్లల్లో సైతం మృతదేహాన్ని ఉండనీయని పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడం, చిన్న కుటుంబాలు ఏర్పడటం, చిన్నతనంలో పిల్లలను హాస్టల్లో, వృద్ధాప్యంలో పెద్దలను ఆశ్రమాల్లో ఉంచడంతో కుటుంబ విలువలు తగ్గిపోతున్నాయి. ఉన్నత చదువుల పేరుతో ఆధునికత సంతరించుకోవడంతో ఎవ్వరికి వారే అన్న రీతిలో సమాజంలో జీవిస్తున్నారు. సమాజంలో ప్రస్తుతం మానవసంబంధాలు ఎలా ఉన్నాయో ఈ సంఘటనలే నిదర్శనం. నంద్యాల పట్టణంలో ఇటీవల ఓ వ్యక్తి తన కుమారుడి వివాహం చేశారు. బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఎక్కువ మంది వస్తారని పెద్ద ఫంక్షన్ హాల్, పెళ్లి భోజనంలో రకరకాల స్వీట్లు, వంటకాలు ఏర్పాటు చేశారు. అయితే పెళ్లి ముందు రోజు కూడా పెద్దగా బంధువులు, మిత్రులు రాలేదు. తలంబ్రాల సమయానికి హడావుడిగా వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించి తెచ్చిన గిఫ్ట్‌లను చేతిలో పెట్టి వెళ్లిపోయారు. ఆహార పదార్థాలు భారీగా మిగిలిపోవడంతో అనాథశ్రమానికి పంపించేశారు. కర్నూలు నగరానికే చెందిన రాజ్‌కుమార్ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. మూడేళ్ల క్రితం అతని తల్లి అనారోగ్యంతో మరణించింది. విషయం తెలిసిన ఇంటి యజమాని మృతదేహాన్ని ‘మా ఇంట్లో ఉంచొద్దని, మీ బంధువుల ఇళ్లకు తీసుకెళ్లు’ అని గొడవ చేశాడు. ఎంత నచ్చజెప్పినా వినలేదు. దీంతో తప్పనిసరై నగరంలోని తన సోదరుని ఇంటికి అప్పటికప్పుడు మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.ఎమ్మిగనూరుకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి పిల్లల చదువుల కోసం కర్నూలులో ఉంటున్నారు. ఆ వీధిలో అతను దాదాపు పదేళ్లుగా ఉంటున్నాడు. అయితే చుట్టు పక్కల వారితో ఇంత వరకు ఆయన మాట్లాడలేదంటే ఆశ్చర్యం కలగకమానదు. ఉదయాన్నే విధులకు వెళ్లడం, సాయంత్రం ఇంటికి రావడం, కుటుంబీకులతో గడుపుతారు. పక్క ఇళ్లల్లో శుభకార్యం జరిగినా వెళ్లింది లేదు.. ఆపద వచ్చినా పలకరించింది లేదు.నిలవని ప్రేమ వివాహాలు..తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమవివాహాలు చేసుకోవడం ఇటీవల కాలంలో అధికమైంది. కొందరు తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటుండగా మరికొందరు ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటూ వేరుగా ఉంటున్నారు. ఆ తర్వాత ఏడాది, రెండేళ్లకే విడిపోయి తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరుకుంటున్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో వారానికి రెండు, మూడు కేసులైనా అమ్మాయి మిస్సింగ్ అని నమోదవుతున్నాయి. ఇలాంటి ఘటనలు ఇటీవల అధికంగా చూస్తున్న పోలీసులు చాలా మంది అమ్మాయిని వెతకడం అటుంచి రెండురోజులకు వారే వస్తారులే అన్న ధోరణితో మాట్లాడుతున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో వచ్చే చిన్న చిన్న మనస్పర్థలను సర్దిచెప్పేవారు లేక రెండు, మూడేళ్లకే విడిపోతున్నారు. పోలీస్స్టేషన్లు, వన్‌స్టాప్ సెంటర్లు, ఐసీడీఎస్ కార్యాలయాల్లో ఇలాంటి వారికి కౌన్సిలింగ్ నిర్వహించే ఉదంతాలు ఇటీవల అధికమయ్యాయి.పలకరించి ఎన్నాళ్లైందో..ఒకప్పుడు ఇంటికి బంధువులు, స్నేహితులు వస్తే గంటల తరబడి మాట్లాడుకుంటూ ఉండిపోయేవారు. సమయానికి భోజనం చేయాలన్న విషయం కూడా మరిచిపోయేవారు. కుటుంబంతో పాటు ఊళ్లో, సమాజంలో ముచ్చట్లు, రాజకీయాలు, సినిమాలు అన్నీ ఈ మాటల్లో కనిపించేవి. కానీ ఇప్పుడు ఇంటికి ఎవ్వరైనా వస్తే ముఖస్తుతిగా పలకరించి రెండు నిమిషాలు మాట్లాడి వదిలేస్తున్నారు. ఎవ్వరి మొబైల్లో వారు బిజీగా గడుపుతున్నారు. ఎదురుగా ఉన్న వారిని పలకరించే సమయం లేకపోయినా ఎక్కడా కనిపించని వారిని సోషల్ మీడియాలో పలకరించుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు.కష్టమొస్తే భరోసానిచ్చే చేతుల్లేవు..నాగరికత వెంట పరుగులు పెడుతున్న మనుషుల మధ్య దూరం మరింత పెరుగుతోంది. ఉన్నత చదువులు, ఉద్యోగాల పేరుతో ఎవ్వరికి వారు వేరుగా ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అపార్ట్మెంట్లో 40కి పైగా కుటుంబాలున్నా.. కష్టమొస్తే పలకరించేవారు ఎవ్వరూ రాని పరిస్థితి నెలకొంది. కానీ పండుగలు, చిన్నచిన్న శుభకార్యాలు మాత్రం చేసుకుని ఎంజాయ్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఎవ్వరికై నా ఆరోగ్యం బాగాలేకపోతే అయిన వారే పలకరించే దిక్కులేదు. బంధువులు, స్నేహితులు సైతం సోషల్ మీడియాలో మాత్రమే పరామర్శలు చేస్తున్నారు. ఇంటికి వచ్చి ధైర్యం చెప్పేవారు కరువైపోయారు. -
ఇది ఒక అమూల్యమైన సంపద..
తాతలు, నాయనమ్మలు, అమ్మమ్మలు అద్భుతమైన మానవీయ సంబంధాలు. వారి సమక్షం ఒక విశ్వవిద్యాలయమే. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఒక పాఠశాల ఉంది. పాఠశాలల్లో పేరంట్స్ డే జరపడం సర్వసాధారణమే.. కానీ అక్కడ గ్రాండ్ పేరెంట్స్ డే కూడా జరుపుతారు. అటువంటి పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే ఎంత గొప్ప విశేషమో తెలియ చేయడానికి వారిని ఎందుకు గౌరవించాలో బోధపరచడానికి వారీ ఉత్సవం నిర్వహిస్తారని తెలిసి చాలా సంతోషమేసింది. తాతలు, నానమ్మలు, అమ్మమ్మల దగ్గర పెరిగిన పిల్లల్లో ధైర్యం, సంస్కారం ఎక్కువగా ఉంటుందని ఆ పాఠశాల ప్రిన్సి΄ాల్ తన ప్రసంగంలో తెలియచేసారు. అటువంటి పెద్దల సమక్షంలో పెరిగే పిల్లల మానసిక పరిణతి, సంస్కారబలం వృద్ధి చెందుతాయి. పెద్దల విలువని ఎంతని లెక్కగట్టగలం!!! వారు లేరని బాధపడేవాళ్ళుంటారు చాలా మంది... అటువంటప్పుడు వారిని ఓల్డ్ ఫర్నీచర్ అని తప్పించడం ఎంత నీతిబాహ్యమైన చర్య? తండ్రి పెద్దవాడయిపోయాడు. కొడుకు భుజం మీద చెయ్యివేసుకుని వెళ్ళడం ఒక ఠీవి. తండ్రి చేతిని కొడుకు పట్టుకుని తీసుకెళ్ళి కూర్చోబెడితే అదొక ఠీవి. నా కొడుకును సహాయంగా తీసుకుని బయటకు వెళ్ళి రావడం నా అవసరం, నా ఆనందం. దాని ప్రయోజనం మరొకరికి ఎలా తెలుస్తుంది? కొదుకు ఎక్కడ ఉంటే అక్కడ ఉపశమనం. కోడలు ఎక్కడ ఉంటే అక్కడ ఒక ఊరట. మనసుకు గొప్పశాంతి. అది సంపద. అంత గొప్ప సంపదకు దూరంగా ఏకాకిగా బతకడమా!!! మనుమలతో కలసి బతకడం భగవంతుడిచ్చిన గొప్ప భాగ్యం. వారిలో తమను తాము చూసుకోవడం పెద్దలకు పెద్ద ఓదార్పు. ఈశ్వరుడిచ్చిన ఇంత గొప్ప సంపద నాకు ఎవరి వలన లభిస్తున్నది... కోడలు వలన. అంటే వివాహం అనేది ఈ సంపద సృష్టికి మూల కారణం అవుతున్నది. స్థిరచరాస్తులు ఎంత పోగేసుకున్నాం అన్నదానికంటే... కుటుంబంలో మనుషుల మధ్య మనసులు ఎంతగా కలిసాయన్నది ఈ ఆనందాలకన్నింటికీ హేతువవుతుంది. ఆరోగ్యకర సమిష్టి జీవనానికి దారివేస్తుంది.జీవితాన్ని కూడా గాలికి వదిలేసి సంపాదన లో మునిగితేలేవాడికి సంసార సుఖం తెలియదు. సంపాదన అవసరమే, కానీ సంసార జీవితాన్ని కలిసికట్టుగా ఆస్వాదించపోతే ఇక గహస్థాశ్రమ వైభవం ఎక్కడుంది? దాని ఫలాలను నీవెక్కడ ఆస్వాదిస్తున్నావు? అంటే బతకడానికి సం΄ాదన... అంతే తప్ప సంపాదన కోసం బతకడం కాదు కదా! శ్రీమంతుల ఇంట అయినా పేదల ఇంటయినా... అరమరికలు లేకుండా ఉమ్మడిగా బతకడం వర్తమానంలో సంతోషాలకే కాదు, తరువాత తరాలకు కూడా సంతోషకారకాలను అందిస్తున్నాం. అందుకే కొడుకు, కోడలు, కుమార్తె, అల్లుడు, తల్లిదండ్రులు, అత్తమామలు, తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు, మనుమలు.. ఇదంతా గొప్ప సంపద. ఈ సంపదకు మూలం వివాహ వ్యవస్థ. అందుకే గృహస్థాశ్రమ ప్రవేశం ఒక వైభవానికి నాంది. -
వివాహేతర సంబంధాలకు అసలు కారణాలు ఇవే..
సాక్షి, గుంటూరు డెస్క్: భార్యాభర్తల మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చాయి. దీంతో భార్య అలిగి పుట్టింటికి వెళ్లింది. ఇరు కుటుంబాల పెద్దలు సర్ది చెప్పడంతో కొద్దికాలంగా దంపతులు కలిసే కాపురం చేస్తున్నారు. పుట్టింటి వద్ద ఉన్న రెండేళ్ల కాలంలో ఓ యువకుడితో ఆమెకు వివాహేతర బంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో యువకుడు ఇంటికి వచ్చిపోతుండటం, భార్య తరచూ ఎక్కడికో వెళ్లి వస్తుండటంతో అనుమానం వచ్చిన భర్త ఆమెను పద్ధతి మార్చకోవాలని హెచ్చరించాడు. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించిన భార్య, ప్రియుడితో కలిసి హత్య చేయించింది. అనుమానమే పెనుభూతమై.. ఉపాధి కోసం ముగ్గురు పిల్లలతో పట్టణానికి వచ్చారు ఆ దంపతులు. ఇద్దరూ రోజువారీ కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అధిక సంతానానికి తోడు భర్త మద్యానికి బానిస కావడంతో ఖర్చులు పెరిగాయి. వీరుంటున్న ఇంటి పక్కనే భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళ వేరే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. వీరి ఇబ్బందుల్ని గుర్తించి ఆమె పలుమార్లు డబ్బుసాయం అందించింది. దీంతో ఎక్కువసార్లు భార్య ఆ ఇంటికి వెళ్లేది. ఇది గమనించిన భర్త తన భార్య కూడా తప్పు చేస్తోందనే అనుమానం పెంచుకున్నాడు. నిజం చెప్పాలంటూ భార్యను పలుమార్లు బెదిరించాడు. చివరకు మద్యంలో విషం కలుపుకుని తాగి చనిపోయాడు. ఫలితంగా భార్యాపిల్లలు రోడ్డున పడ్డారు. వివాహేతర సంబంధంతో అలజడి భార్యను దూరం పెట్టిన ఓ భర్త సహ ఉద్యోగినితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. రహస్యంగా ఆ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం సహజీవనం చేస్తున్న యువతి ప్రియుడికి తెలిసింది. తాను ప్రేమించిన యువతి డబ్బు మోజులో తనను మోసం చేసిందని స్నేహితులకు చెప్పుకుని ఏడ్చాడు. మిత్రుడి బాధను చూసి అంతా కలిసి స్కెచ్ వేశారు. ఉద్యోగిని మందు పార్టీకని పిలిచి అందులో విషం ఇచ్చి చంపేశారు. పోస్టుమార్టంలో అసలు నిజం వెలుగుచూసి వారందరూ అరెస్ట్ అయ్యారు. ఇక్కడ మృతుడి భార్య ఒంటరిదై పోయింది. ప్రేమించిన యువతి మోసంతో యువకుడు కటకటాలపాలయ్యాడు. ఇవి మానవ సంబంధాల్ని దెబ్బతీస్తున్న కొన్ని ఘటనలు. మన మధ్యే జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలకు వెనుక ఉన్న యథార్థ గాథలు..! సమాజంలో బంధాలు, అనుబంధాలకు ఎంతో విలువ ఉంది. కొన్ని సందర్భాల్లో అత్యాశ, అనుమానం, వ్యామోహం ఈ విలువలను దిగజార్చేలా చేస్తున్నాయి. ప్రేమ పెళ్లిళ్లు, కొన్నిచోట్ల పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు సైతం వివాహేతర సంబంధాల వల్ల విచ్చినమవుతున్నాయి. హద్దులు దాటాక ఊహించని పరిణామాలు జరిగి వ్యక్తుల జీవితాలు, కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. ప్రస్తుతం కాలంలో హత్యలు, ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఇందుకు వివాహేతర సంబంధాలే కారణం కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అక్రమ సంబంధాలు, ఆస్తికోసం అడ్డు వస్తున్నారని భార్య లేదా భర్త ఒకరినొకరు చంపేందుకు కూడా వెనుకాడటం లేదు. ప్రపంచంలోనే ఆదర్శ కుటుంబ వ్యవస్థ కలిగిన దేశం మనది. నూరేళ్ల జీవితాన్ని సంతోషంగా గడపాలని ఆశించి చేసుకున్న పెళ్లినాటి ప్రమాణాలు పటాపంచలవుతున్నాయి. ఫలితంగా ప్రాణంగా ప్రేమించిన వారు.. జీవితాంతం తోడుండాల్సిన వారే తోడేళ్లవుతున్నారు. బంధం బలపడాలంటే.. ♦దాంపత్యంలో దాపరికాలు ఉండకుండా చూసుకోవాలి. ♦పొరపాట్లు జరిగినా.. అనుమానాలు.. అవమానాలు ఎదురైనా ధైర్యంగా ఉండాలి. ♦భార్యాభర్తలు ప్రతిరోజు కొంత సమయం ఒకరికొకరు కేటాయించుకోవాలి. ♦ బాధ్యతల్లో పడి ప్రేమించే వారిని ఒంటరిగా వదిలేయకూడదు. ♦మనస్పర్థలు వచ్చినా కూర్చుని మాట్లాడుకోవాలి. ♦ఏమైనా పొరపొచ్చాలు వచ్చినా అపోహలు తొలిగే ప్రయత్నం రెండువైపులా జరగాలి. ♦ఎవరి తప్పు ఉందో తెలుసుకుని సున్నితంగా పరిష్కరించుకోవాలి. ♦మరోమారు అలాంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడాలి. ♦పిల్లల ముందు అస్సలు గొడవ పడరాదు. ♦ఎవరైనా మనసును ప్రభావితం చేస్తుంటే సున్నితంగా తిరస్కరించాలి. ♦తనకు జీవిత భాగస్వామి, పిల్లలు ఉన్నారని, కుటుంబ బాధ్యత ఉందని గుర్తెరగాలి. ♦వివాహేతర సంబంధాలు ఆర్థిక, సామాజిక, శారీరక, మానసిక అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని గమనించాలి. చదవండి: యజమాని భార్యతో డ్రైవర్ వివాహేతర సంబంధం.. చివరికి షాకింగ్ ట్విస్ట్ ఆదర్శమైన ఆ ఐదుగురు దంపతులు... గుండె గుడిలో లక్ష్మీదేవి నిండిపోయి ఉంటుందని చాటుతూ వక్షస్థలంపై చోటిచ్చిన లక్ష్మీనారాయణుల్లా.. దేహంలో సగభాగం పార్వతీ అంటూ అర్ధనారీశ్వురుడైన గౌరీశంకరుల్లా.. దంపతుల ఇద్దరి మాట ఒకటేనంటూ సతీ సరస్వతిని నాలుకపై నిలిపిన బ్రహ్మదీసరస్వతుల్లా.. జీవకోటిని మేల్కొపుతూ పరుగులు పెట్టే భర్తను అనుసరించే భార్య ఛాయాదేవి, సూర్యుడిలా.. సర్దుకుపోయేతత్వం ఉన్న రోహిణిచంద్రుడిని ఆదర్శంగా తీసుకుని అందంగా, ఆనందంగా తీర్చుదిద్దుకోవాలి. మొత్తం మీద భార్య నుంచి భర్తకు కావాల్సింది ఉపశమనం, సాంత్వన, పోషణ, కాని భార్యకు భర్త నుంచి కావాల్సింది అనుక్షణం సం‘రక్షణ’ ఒక్కటే. పెళ్లినాటి ప్రమాణాలు, నియమాలు, ఒప్పందాలను మర్చిపోకుండా మంచి సమాజం కోసం కుటుంబాన్ని ఆదర్శవంతంగా కొనసాగించినపుడే ఆ దాంపత్యంలో ఆనందం చిరస్థాయిగా ఉంటుంది. నమ్మకంతో మెలగాలి దంపతులు ఒకరిపై మరొకరు నమ్మకంతో మెలగాలి. దంపతుల మధ్య దాపరికాలు ఉండకూడదు. సోషల్ మీడియాకు సాధ్యమైనంత దూరంగా ఉంటూ ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపాలి. వృత్తికి, కుటుంబానికి సమపాళ్లలో సమయం కేటాయించాలి. భార్యాభర్తలు ఇంట్లో ఉన్నప్పుడు వ్యాయామం, భోజనం, అల్పాహారం కలిసి చేయడం ద్వారా ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడుతుంది. పండుగలు, వారంతపు సెలవుల్లో ఒక రోజు తప్పనిసరిగా కుటుంబ సభ్యులకు కేటాయించడం ద్వారా అంతరాలు తొలగిపోయి అనుబంధం బలపడుతుంది. -డాక్టర్ వడ్డాది వెంకటకిరణ్, మానసిక వ్యాధి వైద్య నిపుణుడు, జీజీహెచ్, గుంటూరు -
కరోనా వల్ల మేలెంత? కీడెంత?
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి ముమ్మాటికీ మా‘నవ’సంబంధాలను ప్రభావితం చేసింది. కుటుంబసభ్యుల మధ్య సంబంధాలు, అనుబంధాలు చిక్కగా మారాయి. ఆరోగ్యంపై చక్కటి అవగాహన ఏర్పడింది. కరోనా వైరస్ కట్టడికి 9 నెలల క్రితం దేశవ్యాప్తంగా విధించిన సుదీర్ఘ లాక్డౌన్ చాలామార్పులకు కారణమైంది. కొన్ని సానుకూల, మరికొన్ని ప్రతికూల పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆరోగ్యంపై ధ్యాస చాలావరకు మెరుగుపడినట్టు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మహమ్మారి కారణంగా ఎదురైన అనుభవాలు, అధిగమించిన విపత్కర పరిస్థితులు, వాటిని ఎదుర్కోవడంలో ఆదాయం, వయసు, జెండర్ (లింగ భేదం) వంటివి ఎలాంటి పాత్రను షోషించాయన్న దానిపై యూ గవ్–మింట్–సీపీఆర్ మిల్లెనీయల్ తాజాగా సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా 203 నగరాలు, పట్టణాల్లోని పదివేల మంది నుంచి వివిధ అంశాలపై సమాధానాలు రాబట్టింది. ఈ సర్వేలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఏది ఎక్కువగా మిస్సయ్యారంటే.. ఆప్తమిత్రులు, కుటుంబసభ్యులను కలుసుకోలేక పోతున్నామన్న వారు 57 శాతం బయట రెస్టారెంట్లు, హోటల్‌కు వెళ్లి తినలేకపోతున్నామన్న వారు 55 శాతం సెలవుల్లో టూరిస్ట్ సైట్లు, కొత్త ప్రదేశాలకు వెళ్లలేకపోతున్నామన్న వారు 54 శాతం ఆఫీసులు, కాలేజీలు, వర్క్‌పై క్యాంప్‌లకు వెళ్లడాన్ని మిస్ అవుతున్నామన్న వారు 53 శాతం కాన్సర్ట్‌లు, మ్యూజిక్, లైవ్ ఈవెంట్లు, నాటకాలు చూడలేకపోతున్నామన్న వారు 49 శాతం కష్టంగా వర్క్‌ఫ్రం హోం ఈ విధానం వల్ల పనిభారం పెరిగిందన్న వారు 81 శాతం ఆఫీసు పని, ఇంటి పనులు బ్యాలెన్స్ చేయడం కష్టంగా మారిందన్నవారు 60 శాతం తమ కెరీర్ వెనక్కి పోయిందన్న వారు 57 శాతం కొలీగ్స్‌తో కలసి పనిచేయలేకపోవడంపట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన వారు 55 శాతం పనిని ఎంజాయ్ చేయలేకపోతున్నామన్నవారు 55 శాతం ఇంటి సభ్యుల నుంచి డిస్టర్బెన్స్ ఉందంటున్నవారు 48 శాతం కుటుంబం, ఆరోగ్యం విషయంలో... లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి కుటుంబసభ్యులతో సంబంధాలు మెరుగుపడ్డాయన్న వారు 62 శాతం ప్రకృతితో మమేకం కావడానికి అవకాశం పెరిగిందన్న వారు 61 శాతం ఆరోగ్యంపట్ల ధ్యాస పెరిగి, దాని పరిరక్షణపై చర్యలు చేపట్టామన్న వారు 60 శాతం భక్తి భావనలు పెరిగాయన్న వారు 41 శాతం ఆఫీసుల్లో బాస్‌లతో స్నేహభావం, కొలిగ్స్‌తో సంబంధాలు పెరిగాయన్నవారు 34 శాతం ఆఫీసులు, కాలేజీలను మిస్ అవుతున్నామంటున్నవారు 40 శాతం -
చిన్న జీవితంలోని పరిపూర్ణత
‘జంటల మధ్య ప్రేమ తగ్గిపోతున్నప్పుడు, పిల్లలకు అందించడానికి ప్రేమ మిగలదు’ అన్న భావాన్ని ఆధారంగా తీసుకుని రాసిన నవల ఇది. తిషానీ దోషి రాసిన ‘స్మాల్ డేస్ అండ్ నైట్స్’లో– కథకురాలైన గ్రేస్(గ్రేజియా) 2010లో, అమెరికా నుండి తల్లి అంత్యక్రియల కోసం పాండిచ్చేరి వస్తుంది. ముప్పైల్లో ఉన్న గ్రేస్, తనకు పిల్లలు కావాలని అనుకోకపోవడం వల్ల, ఆమె వివాహం విచ్ఛిన్నం అవుతుంది. తల్లి తమిళురాలు. తండ్రి ఇటాలియన్. భార్యతో విడిపోయి వెనిస్లో ఉంటాడు. దహన సంస్కారాల తరువాత తనకు, ‘స్నేహా సెంటర్ ఫర్ గర్ల్స్’లో డౌన్స్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న లూచీయా అనే అక్క ఉందని తెలుస్తుంది. ‘ఏనాడూ స్వతంత్రంగా బతకలేకపోయే యీ పిల్ల కోసం నీకున్న ఒకే జీవితాన్ని వదులుకోగలవా?’ అనడిగిన తండ్రి మనస్తత్వం వల్ల, తల్లి తన చిన్నతనంలో అక్కని చూడ్డానికే వారం వారం మాయం అయేదని గ్రహిస్తుంది. తల్లిదండ్రుల సంవత్సరాల నిర్లక్ష్యానికి మూల్యంగా, అక్కను చూసుకోవాలనే నిర్ణయానికి వస్తుంది. ఆమెను తీసుకుని, తల్లినుండి సంక్రమించిన పరమంకేణి గ్రామంలో ఉన్న పదెకరాల సముద్రతీరపు ఇంటికి వెళ్తుంది. కుటుంబ జీవితపు ఆత్మీయతను తప్పించుకుంటూ, పిల్లల అవసరం కనపడని గ్రేస్‌కు అక్కను చూసుకోవడం సవాలుగా మారుతుంది. ‘ప్రతీ రోజూ మేము అవే పన్లు చేస్తున్నాం. నోట్లో చమ్చా పెట్టుకోవడం తప్ప మరేమీ చేయలేదు తను’ అన్నప్పటికీ, తరువాత విసుక్కుంటూ ఒప్పుకుంటుంది. ‘కొన్నిసార్లు తను రెండు గంటలు నములుతూ ఉండటం చూసి అరుస్తాను.’ అనేకమైన పెంపుడు కుక్కలున్న ఆ ‘పురుషులుండని, నీలం తలుపులున్న గులాబీ ఇంట్లో’ మల్లికను పనికి పెట్టుకుంటుంది. ‘చిన్నతనపు ఇంటికి ఉండే వినాశన బలాన్ని ఎవరూ ఊహించలేరు’ అనుకుంటుంది. లూచియాను చూసుకోడానికి చేయవలిసిన త్యాగాలు మరిన్ని సమస్యలు సృష్టిస్తాయి. మాట్లాడ్డానికి ఎవరూ లేక, లూచియాను మల్లికకు అప్పజెప్పి నెలకొకసారి మద్రాసు వెళ్తుంటుంది గ్రేస్. ఒకసారి ఆలస్యంగా వెనక్కొస్తుంది. ఆ లోపల, లూచియాను మల్లిక ఒంటరిగా వదిలేసి పోతుంది. స్నేహా సెంటర్ టీచర్ లూచియాను పట్టుకెళ్తుంది. నిర్లక్ష్యం ఆరోపణతో అక్కను కలుసుకోనివ్వరు. తను ఏర్పరచుకున్న చిన్నపాటి కుటుంబ నిర్మాణం కూలిపోయినప్పుడు, మానవ సంబంధాల నుండి తను కోరుకున్న స్వేచ్ఛ తనకి అక్కర్లేదని గుర్తిస్తుంది గ్రేస్. తన ఉద్దేశ్యాల ఓటమిని అర్థం చేసుకుని, తన చర్యలకు బాధ్యత వహించి, తమ అక్కాచెల్లెళ్ళ భవిష్యత్తును స్పష్టంగా చూడగలుగుతుంది. తనకున్న ‘తప్పించుకోవడం’ అన్న అలవాటును తెలుసుకుంటుంది. అక్కతోపాటు చిన్న విషయాలకే నవ్వుకుంటూ, తను చిక్కుకుపోయానన్న ఆలోచన మానుకుంటుంది. ఆ తరువాత, తనకీ లూచియాకూ సరిపడేలా ఇంటిని తిరిగి కట్టించి, సంతృప్తి పొందుతుంది. ప్రపంచానికి దూరంగా బతకడం కాక దాన్లోనే బతకడానికున్న ప్రాముఖ్యతను గ్రహిస్తుంది. నవల చివర్న, ‘రాబోయే రోజుల్లో పిల్లల గురించి మనకుండే భావాలకు అనుగుణంగా వాళ్ళు తయారు చేయబడతారు’ అంటుంది. ‘వెనక్కి రావడం, ఎప్పుడూ మనం ఆశించిన అనుభవం అయుండదు,’ అన్న గ్రేస్ ఆలోచనను పుస్తకమంతటా అనేక సంఘటనల ద్వారా బలోపేతం చేస్తారు రచయిత్రి. అసాధ్యమైన ఆదర్శాలతో స్త్రీత్వానికి దూరమయ్యే వారి గురించినదీ నవల. చివరి మాటకు ముందు కనిపించే ‘మనం ఒక దేశాన్ని కనుగొనేది చిన్న ఊళ్ళనుండే; చిన్న పగళ్ళు, రాత్రుళ్ళ నుండి వచ్చే పరిజ్ఞానంతో’ అన్న శిలాశాసనం, జేమ్స్ సాల్టర్ రాసిన ‘ఎ స్పోర్ట్ అండ్ ఎ పాస్టైమ్’ పుస్తకం నుండి తీసుకోబడింది. ‘జంటల మధ్య ప్రేమ తగ్గిపోతున్నప్పుడు, పిల్లలకు అందించడానికి ప్రేమ మిగలదు’ అన్న భావాన్ని ఆధారంగా తీసుకుని బాధ్యతలు, బంధుత్వాల గురించి ప్రశ్నలు లేవదీస్తూ, తల్లిదనం మీద కేంద్రీకరించి రాసిన ఈ నవలను బ్లూమ్స్బరీ ఏప్రిల్ 2019లో ప్రచురించింది. మద్రాసులో పుట్టిన రచయిత్రి తల్లి వెల్ష్, తండ్రి గుజరాతీ. దోషీ కవయిత్రి, పాత్రికేయురాలు, నర్తకి కూడా. అనేకమైన పురస్కారాలు పొందారు. చెన్నైలో ఉంటారు. -
క్రైమ్ కథా చిత్రం
-
మొగ్గల్ని చిదిమే అతి మోహం
సమకాలీనం ప్యూపా దశ నుంచి సీతాకోకచిలుక దశకు ఎదగడం సహజంగా జరగాలి. ఇందులో ప్రకృతి సిద్ధమైన శాస్త్రీయ సూక్ష్మత ఇమిడి ఉంది. గూడును చీల్చుకు వచ్చే దాని పెనుగులాట వల్ల రెక్కల్లోని రక్తనాళాలు తెరచుకొని, ప్రసరణ సవ్యంగా జరిగి అవి బలోపేతమౌతాయి. బయటకు వచ్చిన వెంటనే అది స్వతహాగా ఎగరగలుగుతుంది. కానీ, ఆ పెనుగులాట చూసి జాలిపడి, గూడుని మనమే చీల్చి దానికేదో సహాయపడుతున్నామనుకొని బయటకు లాగితే... రెక్కలు బలపడక మట్టిలో పడి కొట్టుకు చస్తుంది సీతాకోకచిలుక. ఈ మధ్య నేనో మిత్రుడి ఇంటికి ఫోన్ చేస్తే, వాళ్లబ్బాయి ఫోన్ ఎత్తాడు. ‘నాన్నున్నాడా?’ అంటే, ‘ఏమో అంకుల్, చూడాల’న్నాడు. ‘కనుక్కొని చెప్పరా’ అంటే, ఒకింత విసుగ్గా ‘సెల్‌కి చెయ్యండంకుల్’ అని కర్తవ్యబోధ చేసి ఫోన్ పెట్టేశాడు. ఎంత ఇల్లని? రెండు పడగ్గదుల చిన్నిల్లు. కానీ, గదుల మధ్యే కాదు మనుషుల మధ్య కూడా గోడలు మొలిచి, ఎదిగి, దృఢపడు తున్న కాలమిది! ప్చ్!! ఒకే ఇంట్లో మనుషులు పరస్పరం మాట్లాడుకోవడం, మనసు విప్పుకోవడం, కదలికలు తెలియడం కూడా తగ్గిపోయిన విచిత్ర తర మనిపించింది. ఆ ఇల్లని కాదు... మా ఇంట్లో పరిస్థితీ అదే! చిన్న క్యూబికల్ కుటుంబాల నుంచి పెద్ద జన సమూహాల వరకు మానవ సంబంధాల్లోనే ఏదో లోపమొచ్చినట్టనిపిస్తోంది. ఈ వెలితికి మూలాలెక్కడున్నాయ్? ఈ ప్రశ్న నాటినుంచి మనసును తొలుస్తూనే ఉంది. బహిరంతర కారణాలు లీలగా కనిపిస్తూనే ఉన్నాయి. అస్పష్ట సమాధానం అక్కడక్కడ దొరికినట్ట నిపిస్తూనే జారిపోతోంది. నలభయ్యేళ్ల కిందటి మా బాల్యం, కౌమారం అలలు అలలుగా గుర్తొచ్చింది. మనిషి బుద్ధి కొద్ది, ‘అప్పుడు– ఇప్పుడు’ అంటూ పోల్చుకోవడం మామూలే కదా! ప్రస్తుతంలోకి పాత జ్ఞాపకాల దొంతర దొర్లింది. కాలమెంత మారింది? పిల్లల పెంపకంలోనే చెప్పలేనంత తేడా! ఆలోచనల్లోనే అంతరం! ఎంతో దూరం అక్కర్లే... గత శతాబ్ది అరవై, డెబ్బైలలో మేం పెరిగాం. ఇప్పుడు పిల్లల్ని పెంచుతున్నారు. అక్షరాలే తేడా! పెరగటంలో కొన్ని లోపాలున్నా, పెంచడంలో ఉన్న లోపాలు వాటిని మించి పోయాయి. మనిషి ఎదిగే క్రమంలో వ్యక్తిత్వ వికాసానికి అవసరమయ్యే పటిష్ట పునాది పడటం లేదనిపిస్తోంది. బాల్యం కొంత వరకు నయమేమో కానీ, కౌమారం కర్కశంగా నలిగిపోతోంది. ఫలితంగా విశ్వాసం లోపించిన యవ్వనం భయం భయంగా మొదలవుతోంది. యుక్త వయసుకు ముందు సాగే కౌమార జీవన గమనంలో సహజత్వానికి బదులు కృత్రిమత్వం పెరిగి పోయింది. ఒత్తిడి వారిని నలిపేస్తోంది. మెదడు వికసించే దశలో పిల్లలు ప్రకృ తికి, సహజ వాతావరణానికి, పరిసరాల పరిశీలనకి, స్వతహాగా జనించే ఆలో చనా స్రవంతికి దూరమవడం కూడా ఈ వైకల్యానికి బలమైన కారణమేమో! తపన జడిలో తల్లిదండ్రులు బాల్యం నుంచి బతుకు ఒక్కపెట్టున నడివయసుకో, వృద్దాప్యంలోకో దుమి కితే..! అంతకన్నా దౌర్భాగ్యం మరోటుండదు. కానీ, అదే జరుగుతోంది. ‘కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు...’ అని మహాకవి శ్రీశ్రీ అన్నది ఇలాంటి వాళ్లనుద్దేశించేనేమో! మనిషి జీవితంలో అత్యంత కీలకమైన కౌమా రదశ కర్కశంగా చిదిమివేతకు గురౌతోంది. కొందరి విషయంలో అసలది ఉందో లేదో తెలీట్లేదు. ఫలితంగా కొన్ని జీవితాల్లో యవ్వనం బలవంతపు బతుకీడ్పుగా మొదలవుతోంది. కల్లోల కడలిలో నావలా నడివయసు. ఎండకు, వానకు అల్లాడే పండుటాకులా ఏ ఆసరా లేని ముదిమి. సరళ జీవి తాన్ని సంక్లిష్టం చేసుకుంటున్నాం. బాల్యం ముగిసి శారీరకంగా, మాన సికంగా ఎదుగుదల మొదలయ్యే పదో ఏటి నుంచి ఇరవయ్యో యేడు వరకు వయసును కౌమారం (అడులుసెంట్)గా పరిగణిస్తుంది సమాజం. ప్రపంచ ఆరోగ్య సంస్థా ఇదే లెక్క చెప్పింది. సరిగ్గా ఈ వయసులోనే ఆలోచనలు, దృక్పథాలు, ప్రవర్తనల్ని బలపరుచుకుంటూ మెదడు వికసిస్తుంది. ‘బాల్యం నుంచి పెద్దమనిషిగా ఎదుగుతూ, వ్యక్తిగా తాను నిర్వహించాల్సిన పాత్రను నేర్చుకునే సంధి దశ’గా కౌమారాన్ని ‘వికీపీడియా’ నిర్వచిస్తోంది. మొగ్గకు పువ్వుకూ మధ్యలోని దశ. ఇప్పటి పిల్లలు అనేకానేక కారణాల వల్ల సహజ మానవ సంబంధాలు, ప్రకృతి పరిణామాలు, సొంత ఆలోచన, వైవిధ్యా నుభూతులకు దూరమౌతున్నారు. అవి అనుభవంలోకి రాకుండానే ఆ దశను దాటేస్తున్నారు. ఫలితంగా ఎంతో కోల్పోతున్నారు. వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన గట్టి భూమిక ఏర్పడటం లేదు. బలవంతంగా వారిపై రుద్దుతున్న మన యాంత్రిక విద్యా విధానమూ కారణమే! పోటీ ప్రపంచంలో వారిని విజ్ఞానవంతుల్ని చేసి, మంచి స్థాయిలో ఉన్నతులుగా చూడాలని తల్లిదండ్రులు ఆశించడం సహజం. ఈ క్రమంలో తమకు తెలియకుండానే వారు తమ పిల్లలపై పెంచే ఒత్తిడి చిన్నారుల వ్యక్తిత్వ నిర్మాణం, ఎదుగు దలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. అనారోగ్యకర పోటీ వాతావర ణమూ సమస్యను జఠిలం చేస్తోంది. ‘మా పిల్లలు అన్నిట్లో అగ్రభాగాన ఉండాలి, ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. ఏదడిగినా టక టకా చెప్ప గలగాలి’ ఇటువంటి కల తల్లిదండ్రులది. అందరూ తమ పిల్లలు ఐఐటీ, ఐఏఎస్, ఐపీఎస్ సాధించాలనో అమెరికా, యూకే వెళ్లి పుష్కలంగా సంపద కూడగట్టాలనో కలలు కంటున్నారు. అందుకే, అయిదారు తరగతుల నుంచే కాన్సెప్ట్ స్కూల్స్, ఫౌండేషన్ కోర్సులొచ్చాయి. ఏ సిలబస్ చదివి, ఎన్ని మార్కులు సంపాదించి, ఎంత ర్యాంకు తెచ్చుకున్నాడనేదే కొలమానం! ఎంత జీవితాన్ని చదివాడు? ప్రాపంచిక విషయాలెన్ని తెలుసు! నిజ జీవి తంలో ఓ సమస్య వస్తే గట్టిగా నిలబడి ఎదుర్కోగలడా? ఎలా అధిగ మిస్తాడు! అన్న స్పృహ వారికి తట్టడం లేదు. స్వేచ్ఛగా ఆలోచించే వెసులు బాటు లేకుండా, పరిశీలనా తత్వం అలవడకుండా, ప్రాపంచిక విషయాలతో ప్రత్యక్ష సంబంధం లేకుండా ఎలా ఎదుగుతారు? ఇవేవీ పెద్దలకు పట్టడం లేదు. అమ్మ ఎంత కష్టపడుతోంది? నాన్న ఎన్ని త్యాగాలు చేస్తున్నాడు? నేను ర్యాంకు తీసుకురాకపోతే వారికెంత అవమానం! అని తెలియకుండానే పిల్ల లపై పెరిగే ఒత్తిడి స్లోపాయిజన్ లాంటిదే! ఆశించిన ఫలితం రానప్పుడు అనుభవించే వారి మానసిక క్షోభకు లెక్కే లేదు. ఈ అపరాధభావన నుంచి పుట్టే అసహనం ఓ ఆత్మన్యూనతకు, అది అయితే చెడు సావాసాలకో, కాకుంటే ఆత్మహత్యా భావనకో పురికొల్పుతోంది. ఇక జీవితం దుర్భరం. సిలబస్ బయట నేర్వగల పాఠాలెన్నో! కౌమారంలో శారీరకంగా లింగవైవిధ్యం స్థిరపడేటప్పుడు మానసిక స్థితిలో కొంత అలజడి ఉంటుంది. ఏదేదో చేయాలని, ఉనికిని ధృవపరచుకోవాలనే సంక్షోభం వెన్నాడుతుంది. అప్పుడు సహజసిద్ధమైన స్వేచ్ఛలో కన్నా కృత్రిమ నిర్బంధంలో పొరపాట్లకు ఆస్కారమెక్కువ. ఈ తరం యువత ఎదు ర్కొంటున్న ప్రధాన సమస్య ఇది. పిల్లల్ని ఏదేదో చేసేయాలనుకునే తల్లిదండ్రులు చూపే శ్రద్ధాసక్తులు, నిరంతర పరిశీలన–నిఘా, ప్రమేయాలు వారిని స్వేచ్ఛగా ఉండనివ్వవు. అవి వారి స్వీయ ఆలోచనలపై ఆంక్షలుగా కనిపిస్తాయి. రెండువైపుల ఇష్టాయిష్టాల మధ్య ఓ సంఘర్షణ. గతంలో ఇదుండేది కాదు. పిల్లలు ఏం చదువుతున్నారు? ఎక్కడ తిరుగుతున్నారు? తాము నిర్దేశించిన తీరులో ఉన్నారా–లేరా? వంటి తలిదండ్రుల నిరంతర నిఘా అప్పట్లో ఇంత లేదు. ఒక్కొక్కసారి పెద్ద పట్టింపే ఉండేది కాదు. మేం ఆరేడు నుంచి పదో తరగతి వరకు ఆడిన ఆటలు, తిరిగిన తిరుగుళ్లు ఇప్పుడు గుర్తొస్తే ఆశ్చర్యమేస్తుంది. చేలు, పొలాల్లో పంట కాపలాకో, గ్రామ పొలి మేరల్లో ఆటలకో, దిగుడు బావుల్లో ఈదులాటకో... ఎక్కడెక్కడికో వెళ్లేది. సెలవుల్లో వారాల తరబడి సమీప బంధువుల ఊళ్లకెళ్లేది. ఆ రోజుల్లో మా వయస్కులైన అత్యధికుల అనుభవాలివే! అప్పుడు మా ఊళ్లో రెండు వేలకు మించని జనాభా! వేసవి రాత్రులు భోంచేసి పడుకోవడానికి ఆరుబయట అరుగులపైనో, వాకిళ్లలోనో పక్క పరచుకునేది. పెద్దోళ్లు ఇళ్లల్లో నిద్దరోయాక, పది–పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండే టౌన్లో సెకండ్‌షో సినిమాకో, సురభి వారి నాటకానికో వెళ్లొచ్చేది. అయిదారుగురికి తగ్గకుండా గుంపుగా కూడి నడిచో, సైకిళ్లపైనో వెళ్లి ఆట చూసి వచ్చాక... ఏమీ జరగనట్టు/ ఎరుగనట్టు చఢీచప్పుడు లేకుండా పడుకోవడం ఓ వింత అనుభూతి. కృష్ణ లీలలు, మాయాబజార్, బాలనాగమ్మ, తోటరాముడు వంటి సురభి నాట కాలు ఇలా చూసినవే. బయటి ప్రపంచంలో ఇంకా ఎన్నెన్ని చూసేదో! ఇలా సిలబస్ పుస్తకాల్లో లేని బోలెడు పాఠాల్ని నేర్పేది జీవితం. గ్రామీణ వాతా వరణంలో ఉన్న ఈ వెసులుబాటు పట్టణ, నగర జీవితంలో చాలా వరకు కొరవడింది. పట్టణీకరణ పెరిగిన క్రమంలోనే విద్యార్జన స్వరూప స్వభా వాల్లో చాలా తేడా వచ్చింది. కౌమారానికి పట్టిన దుస్థితి పల్లెల్లో కన్నా పట్టణాలు, నగరాల్లో మరీ ఎక్కువ. తాజా దుస్థితికి దోషులెందరో! పిల్లల్లో సహజాతిసహజమైన అమాయకతను తల్లిదండ్రులు భరించలేని స్థితి వచ్చింది. ‘అయ్యో! మీ వాడికింకా ఫొటోల డౌన్లోడ్ రాదా...? మా వాడైతే, సెల్ పట్టాడంటే...!’ ఇదీ వరస!! చిన్న వయసులోనే పిల్లలకు అన్నీ తెలుసని, తెలియకపోతే అదో లోపమని పెద్దలు బడాయిపోయే రోజులివి. అనవసరపు పోలికలు, అశాస్త్రీయమైన పంథా! జ్ఞానానికి, పరిజ్ఞానానికి తేడా తెలియని ప్రవాహంలో తల్లిదండ్రులు, టీచర్లు కొట్టుకుపోతున్నారేమో అనిపిస్తుంది. ఫక్తు వ్యాపార పంథాలో సాగే విద్యా సంస్థలూ అలాగే తయారయ్యాయి. పిల్లల్లో జ్ఞానతృష్ణ పెరగడానికి బదులు తల్లిదండ్రుల జ్ఞానవాంఛ వారిని వాస్తవాల్ని తెలుసుకోనీకుండా చేస్తోంది. దీనికి తోడు పిల్లలకి అనేక విష యాలు నేర్పుతున్నామనో, వనరుల్ని అందుబాటులో ఉంచుతున్నామనో... ఏదేదో చేసేయడం వారికి రివాజయింది. తమ మాటల్లో, చేతల్లో దాన్నొక త్యాగంగా చూపిస్తుంటారు. ప్యూపా దశ నుంచి సీతాకోకచిలుక దశకు ఎదగడం సహజంగా జరగాలి. ఇందులో ప్రకృతి సిద్ధమైన శాస్త్రీయ సూక్ష్మత ఇమిడి ఉంది. గూడును చీల్చుకు వచ్చే దాని పెనుగులాట వల్ల రెక్కల్లోని రక్తనాళాలు తెరచుకొని, ప్రసరణ సవ్యంగా జరిగి అవి బలోపేతమౌతాయి. బయటకు వచ్చిన వెంటనే అది స్వతహాగా ఎగరగలుగుతుంది. కానీ, ఆ పెను గులాట చూసి జాలిపడి, గూడుని మనమే చీల్చి దానికేదో సహాయపడు తున్నామనుకొని బయటకు లాగితే... రెక్కలు బలపడక మట్టిలో పడి కొట్టుకు చస్తుంది సీతాకోకచిలుక. తెలిసో–తెలియకో పిల్లల కౌమారాన్ని నలిపి మన మదే చేస్తున్నాం. దీనికి తోడు బాధ్యతా రహితంగా తీసే చౌకబారు సిని మాలు, అర్థంపర్థంలేని కార్యక్రమాలతో సాగే నేలబారు టీవీ ప్రసారాలు ఒక తరం యువతను పెడదోవ పట్టిస్తున్నాయి. ఇంటర్నెట్ విచ్ఛిత్తి తర్వాత, మరీ ముఖ్యంగా ‘సామాజిక మాధ్యమాల’ విస్తృతి పెరిగాక సెల్‌ఫోన్ ఈ తరం పిల్లల్ని, యువతని భ్రష్టుపట్టిస్తోంది. సానుకూలంగా మార్చుకోవాల్సిన ఓ ఆధునిక సదుపాయం సరైన మార్గదర్శకత్వం లేక పెడదారి పట్టిస్తోంది. ఇప్పుడీ దేశంలో యువతరానికి ఆదర్శప్రాయంగా నిలిచే నాయకత్వం, వ్యక్తులు లేకపోవడం ఓ దురదృష్టకర సన్నివేశం! తగిన కృషి, ఆదరణ కొరవ డటం వల్ల తరం మారుతున్న కొద్దీ కళా–సాంస్కృతిక వారసత్వం కూడా బలహీనపడుతోంది. సెల్‌ఫోన్–నెట్ దుర్వినియోగం చూసినపుడు, మానవ సంబంధాల పరంగా వరం కావాల్సిన శాస్త్ర సాంకేతికత యువతకు శాపమైం దేమోనన్న సందేహం కలుగుతుంది.‘‘నాకో భయం, శాస్త్రసాంకేతికత మానవ సంబంధాలని దాటేసిన రోజు ఈ ప్రపంచంలో మూర్ఖుల తరమే మిగులు తుంది’’ అన్న అల్బర్ట్ ఐన్‌స్టీన్ మాటలు గుర్తొస్తాయి. మన అడుగులు అటే పడుతున్నాయేమోననే సందేహం. పిల్లల్ని సహజంగా పెంచాలి. ప్రకృతికి దగ్గరగా ఉంచాలి. స్వేచ్ఛగా ఆలోచించనివ్వాలి. సరైన వయసులో సమ గ్రంగా ఎదగనివ్వాలి. ఇప్పటికైనా నిర్లక్ష్యం చేయకుండా మనం జాగ్రత్త పడితేనే, భవిష్యత్ ఆలోచనల్ని, ఆచరణల్ని ప్రభావితం చేసే ప్రస్తుత తరం ‘కౌమారం’ ధృతరాష్ట్ర కౌగిలిలోకి జారకుండా నిలుపుకోగలుగుతాం. దిలీప్ రెడ్డి ఈమెయిల్: dileepreddy@sakshi.com -
గమ్యానికి 'ఊతం'!!!
మానవ సంబంధాలు కరెన్సీ బంధనాల్లో చిక్కుకుంటున్నారుు. చివరకు మానవత్వం కూడా నోట్ల కట్టల వాసన ఆస్వాదిస్తూ భూగోళానికి దూరంగా పారిపోతోంది. ..ఆప్యాయత.. అనురాగం.. మమకారాలు బ్యాంకు లాకర్లలో శాశ్వతంగా నిద్రపోవడానికి సిద్ధమవుతున్నారుు. దీనికి ఎన్నో ఉదాహరణలు నిత్యం సమాజంలో కనిపిస్తూనే ఉన్నారుు. అరుుతే అక్కడక్కడా.. అప్పుడప్పుడూ తోక చుక్కల్లా.. ఇంద్రధనసుల్లా స్వచ్ఛమైన ప్రేమ.. రుచికరమైన వెనీలా ఫ్లేవర్‌ను కురిపిస్తూనే ఉంది. శ్రీరామ్మూర్తి అనే వికలాంగుడు ఎక్కడ నుంచో ఎన్నో ఏళ్ల క్రితం ఒంగోలుకు చేరుకున్నాడు. అరుునవాళ్లంతా కాదు పొమ్మంటే చక్రాల బండిపై తిరుగుతూ భిక్షాటన చేస్తున్నాడు. కొంతకాలానికి అఖిల అనే మహిళ తోడైంది. నీకు నేనున్నానంటూ అతని చేతికర్ర తీసుకుంది. స్త్రీ, పురుషుల బంధానికి డబ్బు.. భవంతులు.. సౌకర్యాలు అక్కరలేదని రెండు మనసులు ఒకటైతే చాలంది. అప్పటి నుంచి ఇద్దరూ కలిసి భిక్షాటన చేస్తున్నారు. కష్టసుఖాలు మాట్లాడుకుంటూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఈయన వికలాంగుడైనా.. ఆధార్ కార్డు ఉన్నా ప్రభుత్వం పింఛను అందించడంలేదు. - సాక్షి, ఒంగోలు -
ఇదేం పోయే కాలమో..?!
► ఆస్తి కోసం తల్లి, ► సోదరుడి కుటుంబాన్ని గెంటేసిన దుర్మార్గుడు ► న్యాయం కోసం ఇంటి ఎదుటే బాధితుల ధర్నా ► రంగంలోకి దిగిన పోలీసులు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి. భూమికి విలువ పెరిగాక మనుషుల్లో స్వార్థం పెరిగిపోయింది. ఆస్తి కోసం అయిన వారే కాని వారవుతున్నారు. తన రక్తాన్ని పాలుగా మార్చి పెంచిన తల్లిని, రక్తం పంచుకుపుట్టిన సోదరుడ్ని, అతని కుటుంబాన్ని ఇంటి పెద్దకుమారుడు నిర్దాక్షిణ్యంగా గెంటేశాడు. న్యాయం కోసం బాధితులు రోడ్డెక్కారు. అటుగా వెళ్తున్న వారందరూ చూసి ఇదేం పోయే కాలమో..? నంటూ పెదవి విరిచారు. ధర్మవరం అర్బన్ : ఆస్తి కోసం ఓ వ్యక్తి కర్కశంగా ప్రవర్తించాడు. తన తల్లిని, తమ్ముడి కుటుంబాన్ని ఇంటి నుంచి గెంటేశాడు. రోడ్డునపడ్డ బాధితులు ఇంటి ఎదుటే ధర్నాకు దిగారు. చివరకు వీరి పంచాయితీ పోలీసుస్టేషన్‌కు చేరింది. శుక్రవారం చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. ధర్మవరం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఓలేటి వరలక్ష్మమ్మ నివాసముంటోంది. ఆమెకు నలుగురు కుమారులు ఉన్నారు. వరలక్ష్మమ్మ తన పుట్టినింటివారు కానుకగా ఇంటిని ఆమె పేరున రాసిచ్చారు. ప్రస్తుతం ఆ ఇంట్లో వరలక్ష్మమ్మతోపాటు చిన్న కుమారుడు విజయ్‌కుమార్, అతని భార్య సుధామణి, కుమార్తెలు వర్షిత, బిందుశ్రీ ఉంటున్నారు. రెండో కుమారుడు శంకర్నారాయణశెట్టి, అతని భార్య సావిత్రి ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడి తమను రౌడీలతో కొట్టించి ఇంటినుంచి బయటకు నెట్టేశారని బాధితురాలు వరలక్ష్మమ్మ వాపోయింది. ఆమెతోపాటు చిన్నకుమారుడు, అతని భార్య, పిల్లలతోసహా శుక్రవారం ఉదయం 7.30 నుంచి ఇంటిముందు రోడ్డుపై బైఠాయించారు. చిన్న కుమారుడు విజయ్‌కుమార్ మాట్లాడుతూ తనను టీడీపీ నాయకులు రెండురోజుల క్రితం పిలిపించి కొట్టారని, మీ అమ్మ పేరున ఉన్న ఇంటిని అమ్మేసి మీ రెండో అన్నకు ఇవ్వాలని బెదిరించారని వాపోయాడు. ఉదయం కూడా టీడీపీకి చెందిన ఓ ఫ్యాక్షన్ నేత మనుషులు నలుగురు ఇంట్లోకి చొరబడి తమను కొట్టి బయటకు గెంటేశారన్నాడు. వరలక్ష్మమ్మ మాట్లాడుతూ తాను చనిపోయిన తర్వాత నలుగురు కుమారులూ ఇంటిని పంచుకునేలా వీలునామా రాశానని తెలిపింది. కుటుంబ సభ్యులంతా రోడ్డుపై ధర్నా చేయగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో పట్టణ పోలీసులు జోక్యం చేసుకొని బాధితులతోపాటు, ఇంటిని దౌర్జన్యంగా ఆక్రమించుకున్న రెండో కుమారుడు శంకర్నారాయణశెట్టిని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేస్తున్నారు. -
పెనుభూతం
సోల్/అనుమానం అనుమానం పెనుభూతం అంటారు. ఔను! ఇది నిజంగా పెనుభూతమే. ఎలాంటి భూతం పట్టినా వదిలించవచ్చు గానీ, అనుమానం పట్టుకుంటే మాత్రం వదిలించడం దాదాపు అసాధ్యం. అనుమానం వల్ల మానవ సంబంధాలు దెబ్బతినడమే కాదు, మనశ్శాంతి కూడా కరువవుతుంది. మారుతున్న కాలంలో అనుమానం కొంతవరకు అవసరమే. అన్నింటినీ గుడ్డిగా నమ్మి, అలా నమ్మడం వల్ల మోసపోయి, తర్వాత తాపీగా విచారించే కంటే కొన్ని లావాదేవీల్లో ముందుకు పోవాలనుకున్నప్పుడు కొంచెం అనుమానించి, ఆపై ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకుని నిర్ణయం తీసుకోవడం మేలు. తగు మోతాదుగా ‘అణు’మాత్రం అనుమానం ఉంటే ఫర్వాలేదు. పాపిష్టి లోకంలో సురక్షితంగా మనుగడ సాగించడానికి అది ఎంతైనా అవసరం కూడా. కాకపోతే, ఆ అనుమానం అణువంత కాకుండా, పెనుభూతంగా ఎదిగి పట్టి పీడిస్తేనే తంటా. అన్నింటినీ గుడ్డిగా నమ్మడం ఎలా క్షేమం కాదో, అన్నింటినీ అతిగా అనుమానించడమూ శ్రేయస్కరం కాదు. అను‘మాన’ధనులు అభిమానధనులను లోకం నెత్తికెత్తుకుంటుంది. వారిపై లోకులకు ఉండే అభిమానం అలాంటిది మరి! అయితే, ప్రపంచంలో అభిమానధనులు అరుదుగా ఉంటారు. స్వాభిమానాన్ని కాపాడుకుంటూనే జనాల అభిమానాన్నీ పొందగలరు వాళ్లు. అలాంటి వాళ్లే లోకానికి ఆదర్శప్రాయులుగా మన్ననలు అందుకుంటారు. కానీ, లోకుల్లో కొందరు ఉంటారు... ఉత్త అను‘మాన’ధనులు. నిష్కారణంగా భార్యలను అనుమానించే భర్తలు, భర్తలను అనుమానించే భార్యలు, తోబుట్టువులను, తోటి స్నేహితులను అనుమానించేవారు, సహోద్యోగులను అనుమానించేవారు ఇలాంటి వాళ్లే. తీరికగా ఉన్నప్పుడు కాలక్షేపానికి ఎవరైనా మాట్లాడుకుంటూ ఉంటే, తమ గురించే మాట్లాడుకుంటున్నారని అనుమానిస్తారు. నేరకపోయి ఎవరైనా స్వచ్ఛందంగా సాయం చేయడానికి ముందుకొచ్చినా, ఏదో ప్రతిఫలాన్ని ఆశిస్తున్నారేమోనని అనుమానిస్తారు. ఎవరైనా తమను పొగిడినా, ఆ పొగడ్తలను మనస్ఫూర్తిగా స్వీకరించలేరు సరికదా, పొగడ్తల వెనుక ఏదైనా వ్యంగ్యం ఉందేమోనని శంకిస్తారు. లేకుంటే కాకా పట్టేందుకే ఎదుటి వారు పొగుడుతున్నారని అనుమానిస్తారు. ఇలాంటి శాల్తీలనే నిత్యశంకితులని కూడా అంటారు. నిత్యశంకితుల వల్ల ఎవరికీ ఎలాంటి ఉపయోగం లేకపోగా, అపకారమే ఎక్కువగా జరుగుతుంది. అందుకే, భర్తృహరి నిత్యశంకితులను కూడా కాపురుషుల జాబితాలో చేర్చాడు. అపనమ్మకమే మూలం అనుమానానికి అపనమ్మకమే మూలం. అనుమానవంతులు లోకంలో దేనినీ నమ్మరు. తల్లిదండ్రులను, తోబుట్టువులను, భార్యాబిడ్డలను కూడా నమ్మరు. ఇలాంటి వాళ్లు అందరితో పాటే గుళ్లకు గోపురాలకు తిరుగుతూ ఉంటారు గానీ, దేవుణ్ణి కూడా నమ్మరు. అన్నిటినీ అనుమానిస్తూ, అందరినీ అనుమానిస్తూ జీవితంలో ఆత్మీయులనే వాళ్లే లేని పరిస్థితిని తెచ్చిపెట్టుకుంటారు. చివరకు తమ నీడను తామే నమ్మలేని స్థితికి చేరుకుని, మానసిక రోగులుగా మిగులుతారు. ఇలాంటి నిత్యశంకితులు సమాజంలో ఇమడలేరు. అలాగని ఒంటరిగానూ బతకలేరు. తమకు తాముగా శాంతంగా ఉండలేరు. చుట్టుపక్కల ఉన్నవాళ్లనూ శాంతంగా ఉండనివ్వరు. శాంతంగా ఉండలేరు కాబట్టి, వీళ్లకు జీవితంలో సుఖశాంతులనేవే ఉండవు. సంకుచితుల నేస్తం ‘సంకుచిత మనస్తత్వం గలవాళ్లకు అనుమానమే నేస్తం’ అని బ్రిటిష్-అమెరికన్ తత్వవేత్త శతాబ్దాల కిందటే చెప్పాడు. లోకంపై, లోకులపై కాస్తంత విశాల దృక్పథం ఉన్నవాళ్లు అనవసరమైన అనుమానాలతో మనసు పాడుచేసుకోరు. విశాల దృక్పథం, ఔదార్యం వంటి సానుకూల లక్షణాలేవీ లేని సంకుచితులే అయినదానికీ, కానిదానికీ అన్నింటినీ అనుమానిస్తూ నిత్యశంకితులుగా మారుతారు. అనుమానం ఉన్నచోట మైత్రి మనుగడ సాగించలేదు. అనుమానంతో సతమతమయ్యే వారికి స్నేహితులు కరువవుతారు. లేనిపోని అనుమానాల వల్ల మనుషుల మధ్య సహజంగా ఉండాల్సిన ప్రేమాభిమానాలు నశించి, పగ, ద్వేషం వంటి ప్రతికూల భావనలు పెచ్చరిల్లుతాయి. ప్రతికూల భావనలు ముప్పిరిగొన్నప్పుడు సంకుచితత్వాన్ని విడనాడి వీలైనంత త్వరగా వాటి నుంచి బయటపడే ప్రయత్నాలు చేయడం మంచిది. అలాంటి ప్రయత్నాలేవీ చేయకుండా, ఇంకా సంకుచితంగానే వ్యవహరిస్తుంటే, అలాంటి వాళ్లకు బంధుమిత్రులందరూ దూరమై, అనుమానమే నేస్తంగా మిగులుతుంది. అంతర్జాతీయ అవలక్షణం అనుమానం ఒక అంతర్జాతీయ అవలక్షణం. ఇది ఏదో ఒక జాతికో, ఒక ప్రాంతానికో పరిమితమైనది కాదు. ప్రపం చం నలుమూలలా మనుషుల్లో అనుమానించే లక్షణం కనిపిస్తూనే ఉంటుంది. అనుమానించే లక్షణం పట్ల మనుషులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా, అనుమానం పెనుభూతమై మనసంతటినీ ఆక్రమిస్తుందని ఇంగ్లిష్ తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు ఫ్రాన్సిస్ బేకన్ చెప్పాడు. ఒకవేళ పాలకులకే ఈ లక్షణం ఉంటే, వాళ్లు నియంతలుగా పరిణమించి ప్రజలను పీడించుకు తింటారని కూడా ఆయన హెచ్చరించాడు. చరిత్రలో ఇలాంటి నిత్యశంకితులైన నియంతలు ఎందరో కనిపిస్తారు. హిట్లర్, ముసోలినీ, ఇడీ అమీన్ వంటి వాళ్లు సొంత నీడనైనా నమ్మని రకాలు. వాళ్ల కారణంగా మానవాళికి వాటిల్లిన కష్టనష్టాలు అందరూ ఎరిగినవే. అపరాధ భావనతో నిండిన మనస్సును అనుమానం వేధిస్తుందని షేక్స్పియర్ చెప్పా డు. అపరాధాలకు పాల్పడని వాళ్లు, తమ పట్ల ఇతరులు చేసిన అపరాధాలను క్షమించగలిగిన వాళ్లు ఇతరులను అనవసరంగా అనుమానించరు. మరో ఇంగ్లిష్ రచయిత శామ్యూల్ జాన్సన్ అయితే, అనుమానాన్ని ‘అనవసర వేదన’గా అభివర్ణించాడు. అంతేకాదు, అనుమానం ఒక అనవసర మానసిక భారం. స్కాటిష్ కవి రాబర్ట్ బర్న్స్ అనుమానాన్ని ‘భారకవచం’గా అభివర్ణించాడు. మనిషికి రక్షణ ఇవ్వడానికి కవచం అవసరమే. అయితే, కవచమే మోయలేని భారంగా మారితే, ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అనుమానం పెనుభూతంగా పరిణమిస్తే, మనసుకు మోయలేని భారంగా మారి, మనిషిని నిలువెల్లా కుంగదీస్తుంది. అందువల్ల కనికల్ల నిజము తెలుసుకుని, అనుమానాలను ఎప్పటికప్పుడు పటాపంచలు చేసుకోవడమే విజ్ఞుల లక్షణం. -
ఇంటింటికొస్తుంది... హింసపాదు!
బమ్మిడి కథల్లో....వెన్నెల్లో ఆడుకునే పిల్లలూ వాళ్ల కమ్మని కథలూ ఉంటాయి. దట్టమైన చీకటి లోలోతుల్లోకి తీసుకెళ్లి వాస్తవాల వెలుగులను చూపించే కథలూ ఉంటాయి. మావనసంబంధాల్లో పూడ్చలేని అగాథాలు, వైరుధ్యాలు, లైంగిక దోపిడి, లైంగిక హింస, రాజ్యహింసలను ఆయన కథలు బలంగా పట్టి చూపుతాయి. పుస్తకాన్ని చేతిలో తీసుకున్నప్పుడు- ‘ఇవి ఉత్తరాంధ్ర కథలు’ అనిపిస్తుంది. పుస్తకం తిరిగేసిన తరువాత ‘కానే కాదు’ అనిపిస్తుంది. ఎందుకంటే, ఊరు మారుతుంది, ఆ ఊళ్లో పాత్ర పేరు మారుతుంది... కానీ సమస్య వేరు మాత్రం అన్నిచోట్ల ఒక్కటే అవుతుంది. ‘దూరానికి దగ్గరగా’ కథలో ఉన్న అప్పలమ్మ వరంగల్లోనూ ఉంది. పేరు వేరై ఉండొచ్చు. ‘‘ఇంజనీర్లయితే ఇంజన్ల నీరు పోస్తారని గదరా?’’ అని ‘సున్నా’ కథలో అమాయకంగా అడిగిన గంగమ్మలు కరీనగర్లోనూ ఉండొచ్చు. రాజ్యహింసకు సంబంధించిన కథల్లో అయితే ఈ హద్దులు పూర్తిగా చెదిరిపోయి ‘ఏడనైనా ఒకటే’ అనే భావనకు గురిచేస్తాయి. విధ్వంసకర విషయాల గురించి చేసే సైద్ధాంతిక చర్చ పరిమిత సమూహాలకు మాత్రమే పరిమితం కావచ్చు. కానీ అది కథారూపం తీసుకుంటే దాని పరిధి విస్తృతం అవుతుంది. తన కథల ద్వారా బమ్మిడి ఈ పనిని సమర్థవంతంగా చేశాడు. సామ్రాజ్యవాద సంస్కృతి, పరాయికరణ, సాంకేతికత సృష్టించిన మనోవిధ్వంసం, హింసోన్మాదం... ఇలా ఎన్నో విషయాలను తన కథల ద్వారా ప్రతిఫలించాడు. రచయిత ఒకచోట అంటాడు- ‘‘ఇవన్నీ ఇలా ఎందుకు జరుగుతున్నాయి? తర్కించుకున్నాను. ప్రశ్నించుకున్నాను. జవాబులు వెదుక్కున్నాను. బోధపరుచుకున్నాను’’. పుస్తకం పూర్తి చేసిన తరువాత మనం కూడా తర్కించుకుంటాం. ప్రశ్నించుకుంటాం. బోధపరుచుకుంటాం. ఈ కథల్లో ‘సిక్కోలు’ మాత్రమే కనిపించదు. అన్ని ప్రాంతాలు ఒక సార్వజనీనమైన సత్యమై కదలాడుతుంటాయి. యాకుబ్ పాషా యం.డి. హింసపాదు(కథలు); రచన: బమ్మిడి జగదీశ్వరరావు పేజీలు: 290; వెల: 180 ప్రతులకు: సిక్కోలు బుక్ ట్రస్ట్, ఎంఐజి 100. హౌసింగ్ బోర్డు కాలనీ, జిల్లా పరిషత్ ఎదురుగా, శ్రీకాకుళం-532001; ఫోన్: 99892 65444 -
మానవత్వం బతికే ఉంది..
రోడ్డు ప్రమాదంలో పెంపుడు కుక్క మృతి ఆస్పత్రి పాలైన యజమాని బంజారాహిల్స్: మానవ సంబంధాలు మటు మాయమైపోతున్న రోజుల్లో మానవత్వం ఇంకా బతికే ఉందని తెలియజెప్పే ఘటన జరిగింది. తాను ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న కుక్క... తన కళ్లెదుటే విలవిల్లాడుతూ ప్రాణం విడవడం తట్టుకోలేక ఓ యువకుడు స్పృహ తప్పిపడిపోయి ఆస్పత్రిపాలయ్యాడు. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... రహ్మత్‌నగర్‌కు చెందిన రఘువీర్ సింగ్ సోమవారం ఉదయం ఎప్పటిలాగే తన పెంపుడు కుక్కను తీసుకుని ఇంటినుంచి వాకింగ్‌కు బయలుదేరాడు. అదే సమయంలో యూసుఫ్‌గూడ ఫస్ట్ బెటాలియన్‌లో నివసించే ఏఆర్ కానిస్టేబుల్ రవీందర్ బైక్‌పై వెళ్తూ కుక్కను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కుక్క అక్కడికక్కడే మృతి చెందింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుక్క రక్తపు మడుగులో కొట్టుకుంటూ ప్రాణం వదిలిన దృశ్యం చూసిన ర ఘువీర్‌సింగ్ తట్టుకోలేక కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు అతడిని 108 అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా, సివిల్ డ్రస్‌లో ఉన్న రవీందర్ కానిస్టేబుల్ అని తెలియక స్థానికులు అతడిపై చేయి చేసుకున్నారు. అనంతరం అతడిపై చర్య తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మానవ సంబంధాలు మృగ్యం
ఆస్తుల కోసం అన్నదమ్ముల కుమ్ములాటలు. తల్లిదండ్రులపై సైతం భౌతిక దాడులు. ధన కాంక్షతో హత్యలు. వేధింపుల నేపథ్యంలో భర్తలను హతమారుస్తున్న భార్యలు. కామంతో కళ్లు మూసుకుపోయి బాలికలు, విద్యార్థినులపై అత్యాచారాలకు తెగబడుతూ వారి జీవితాలను ఛిద్రం చేస్తున్న మృగాళ్లు. ఇవీ జిల్లాలో... మృగ్యమవుతున్న మానవ సంబంధాలకు కొన్ని ఉదాహరణలు. సాక్షి, గుంటూరు : ప్రేమానురాగాలు, ఆప్యాయత ఆనందాలతో వెల్లివిరియాల్సిన మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. సోదరభావంతో కలసిమెలిసి ఉండే పల్లెల్లో సైతం కొన్ని కుటుంబాలు పగలు, ప్రతీకారాలతో రగిలిపోతున్నాయి. ప్రాణాలను తృణప్రాయంగా తీసేస్తున్నారు. రాజధాని నిర్మాణ నేపథ్యంలో భూముల ధరలకు రెక్కలు రావడంతో ఆ గ్రామాల్లో పాత గొడవలు తిరిగి రేగుతున్నాయి. తల్లీతండ్రి, అక్కా చెల్లెలు, అన్నాతమ్ముడు, బావమరుదులు, భార్యాభర్తలు ఈ సంబంధాలేవీ డబ్బుకంటే ఎక్కువ కాదంటూ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో మానవ సంబంధాలపై చైతన్యం కలిగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కొన్ని ఘటనలు పరిశీలిస్తే... ఆప్యాయంగా అక్కున చేర్చుకోవాల్సిన అన్న కుమారుడిని ఓ మానవ మృగం కానరానిలోకాలకు పంపిన ఘటన గత నెలలో కృష్ణానది వద్ద జరిగింది. తెనాలికి చెందిన చిన్నారి మోక్ష జ్ఞ తేజను సొంత బాబాయే హతమార్చి కృష్ణానదిలో పడవేశాడు. ఈ సంఘటన జిల్లాలో తీవ్ర సంచలనం కలిగించింది. బాపట్లకు చెందిన ప్రత్యూష అనే ఇంటర్ విద్యార్థిని ఇంటివెనుక ఉన్న మార్కెట్‌యార్డులోకి తీసుకు వెళ్లి అత్యాచారం చేసి, ఆపై ప్రాణాలు తీసిన ఓ మృగాడి కిరాతక చర్య జిల్లా ప్రజలను ఉలికిపాటుకు గురిచేసింది. ఈ ఘటనలో తల్లితో సహజీవనం చేస్తూ తండ్రి స్థానంలో ఉండి కాపుకాయాల్సిన వ్యక్తే హంతకుడుగా తేలడం మానవ సంబంధాలను ప్రశ్నార్థకం చేసింది. రెండు రోజుల క్రితం నరసరావుపేట పట్టణం పాతూరులో ఆస్తి కోసం సొంత అన్నను కిరాతకంగా హతమార్చిన ఓ తమ్ముడు చివరకు తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనలో తమ్ముడు మృత్యువుతో పోరాడుతున్నాడు. నగరం మండలంలో ఓ మహిళ తన భర్తను హతమార్చి కుమారుడి సహాయంతో పూడ్చిపెట్టింది. భర్త వేధింపులు తాళలేకే ఆ మహిళ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు తేలింది. తల్లిదండ్రులతో భర్త తరచూ గొడవపడటాన్ని తట్టుకోలేని ఓ మహిళ కిరోసిన్ పోసుకుని నిప్పంటిచుకోగా కాపాడేందుకు వెళ్లిన అక్క, పక్కనే నిద్రిస్తున్న చిన్నారికి మంటలు అంటుకున్న సంఘటన గురజాల మండలం మాడుగులలో జరిగింది. ఆ మహిళతోపాటు చిన్నారి కూడా మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇలా జిల్లాలో జరుగుతున్న సం ఘటనలను పరిశీలిస్తే మానవసంబంధాలు ఎటుదారితీస్తున్నాయనే ప్రశ్న తలెత్తకమానదు. మానవ సంబంధాలు, రాజధాని నిర్మాణం, మృగాలు, Human relations, capital structure, animals -
కుమార్తెపై తండ్రి లైంగిక దాడి
నున్న పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘటన విజయవాడ: కుమార్తెను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే ఆమె పాలిట కసాయిగా మారాడు. కామంతో కళ్లు మూసుకుపోయి బాలికపై కొన్ని నెలలుగా లైంగిక దాడి చేశాడు. సభ్యసమాజం తలదించుకునే విధంగా మానవ సంబంధాలను మంటగలుపుతూ ఈ అకృత్యానికి పాల్పడ్డాడు. మైనర్ అయిన కుమార్తెకు కొన్ని నెలలుగా నిద్రమాత్రలు ఇచ్చి లైంగికదాడి చేస్తున్నట్లు సమాచారం. నున్న పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లి.. కుమార్తెను తీసుకుని నున్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై సీఐ కె.వరప్రసాద్ వెంటనే స్పందించి కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సీఐ అందించిన సమాచారంతో ఏసీపీ లావణ్యలక్ష్మి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వచ్చి బాధితురాలి నుంచి వివరాలు తెలుసుకుని నిందితుడిని విచారణ చేస్తున్నారు. వివరాల వెల్లడి సాధ్యం కాదు : ఏసీపీ మానవ సంబంధాలకు విఘాతం కలిగించే ఇలాంటి అవాంఛనీయ ఘటనలపై నమోదైన కేసుల్లో వివరాలు వెల్లడించడం సాధ్యం కాదని సెంట్రల్ ఏసీపీ లావణ్యలక్ష్మి విలేకరులకు తెలిపారు. అత్యంత సున్నితమైన ఇలాంటి కేసులో బాధితురాలి గౌరవం, భద్రత దృష్ట్యా నిందితుడి వివరాలను సైతం వెల్లడించలేమని ఆమె పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తును అత్యంత గోప్యంగా జరుపుతామన్నారు. -
అంతరించిపోతున్న మానవ సంబంధాలు..
అనుబంధానికి రక్తపు మరకలు.. రక్త సంబంధీకుల మధ్య సంబంధాలు తెగిపోతున్నాయి. క్షణికావేశంలో అనార్థాలు చోటు చేసుకుంటున్న ఘటనలు జిల్లాలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. భార్యను భర్త చంపడం, భర్తను భార్య చంపడం.. తండ్రిని కొడుకు చంపడం.. తల్లిని కొడుకు చంపడం.. వంటి ఘాతుకాలు అనుబంధానికి విఘాతం కలిగిస్తున్నాయి. పేగు బంధాన్ని మరిచి ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారు. జీవితాంతం తోడునీడగా ఉండాల్సిన భార్యాభర్తలు చిన్నచిన్న కారణాలతోనే బంధాలను తెంచుకుంటున్నారు. వరకట్న వేధింపులు, వివాహేతర సంబంధాలు, కుటుంబ తగాదాలే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. రక్త సంబంధంలో ప్రాణాలు అర్పించైనా తన వారిని కాపాడుకోవాలనే వారే కరువయ్యారు. కేవలం డబ్బుల కోసం మనుషుల ప్రాణాలు తృణప్రాయంగా తీస్తున్న సంఘటనలు కోకొళ్లం. జిల్లాలో జరిగిన హత్యలు మచ్చుకుకొన్ని.. మద్యానికి డబ్బు ఇవ్వలేదని తండ్రి హత్య : ఆదిలాబాద్ మండలం బంగారిగూడకు చెందిన రామకృష్ణ తన తండ్రి సత్యనారాయణ (70) మద్యానికి డబ్బులు ఇవ్వలేదని క్షణికావేశంలో జూన్ 12న కర్రతో దాడి చేసి హత్య చేశాడు. స్నేహితున్ని కడతేర్చాడు : కూలీ పంపిణీ విషయమైన ఇద్దరి స్నేహితుల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసింది. జూన్ 16న మంచిర్యాల తిలక్‌నగర్‌కు చెందిన మబ్బు రాజశేఖర్‌ను తనతో పనిచేసే మందిగ సిర్సులు గొడ్డలితో నరికి హత్య చేశాడు. రాజకీయ హత్య : బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ సర్పంచ్ మంద రవిని రాజకీయ కక్షలతో జూన్ 21న కొంత మంది ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ఇది జిల్లాలోనే పెనుకలకలం రేపింది. భార్య అందంగా లేదని హత్య : కోటపల్లి మండలంలోని రొయ్యలపల్లి గ్రామానికి చెందిన సల్పాల సంతోష్ తన భార్య అందంగా లేదంటూ చిత్రహింసలకు గురిచేసేవాడు. ఈ క్రమంలో జూన్ 26న భార్య లలిత (23)తో గొడవ పెట్టుకొని ఆమెను చున్నితో ఉరివే సిహత్య చేశాడు. అనుమానం పెనుభూతమై.. : వేమనపల్లికి చెందిన శాంత ఉరఫ్ ఫాతిమా (40) కూలీపని చేస్తూ కుటుంబాన్ని పోషించింది. పనికి వెళ్లిన తన భార్య ఇతరులతో చనువుగా ఉంటుందని ఆమెపై భర్త యూసుఫ్ అనుమానం పెంచుకొని జూన్ 27న రోకలి బండతో దాడిచేసి హత్యకు పాల్పడ్డాడు. చిచ్చురేపిన గుడుంబా : జూలై 2న జన్నారం మండలం బొమ్మన గ్రామానికి చెందిన ఆరే భీమయ్య (38) బంధువులతో కలిసి గుడుంబా తాగుతుండగా జరిగిన గొడవ హత్యకు దారితీసింది. సదరు బంధువులు తిరుపతి, భానుచందర్, నరేందర్ భీమయ్యను రాయితో బాది హత్యకు పాల్పడ్డారు. వివాహేతర సంబంధం : సిర్పూర్-టి డోరపల్లి గ్రామానికి చెందిన దహెగావ్కర్ లహానుబాయి (46) భర్త రామ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. జూలై 12న భర్తను వేరే మహిళతో వెళ్తుండగా చూసిన లహానుబాయి వారిని వెంబడించి పట్టుకొని భర్తను నిలదీసింది. దీంతో గొడవ పెరిగి ఆగ్రహంతో రామ భార్య లహనుబాయిని చీర కొంగుతో ఉరివేసి హత్య చేశాడు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో నిత్యం చోటు చేసుకుంటున్నారు. భార్య చేతిలో.. : జూలై 12న భర్త వేధింపులు భరించలేక మంచిర్యాలలోని ఎన్టీఆర్నగర్లోని మౌటం సారయ్య (50)ను అతడి భార్య అంజమ్మ రోకలి బండతో కొట్టి చంపింది. పందుల వ్యాపారి హత్య : జూలై 19న జైపూర్ మండలం పెగడపెల్లి గ్రామానికి చెందిన దుగ్యాల రాములు (28) అనే పందుల వ్యాపారిని గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో కొట్టి చంపారు. గొంతుకోసి : నిర్మల్ పట్టణానికి ఉపాధి కోసం వలస వచ్చిన మహారాష్ట్ర వాసి సీహెచ్ సురేష్ (40)ని అతడి భార్య చంద్రకళ జూలై 20న పట్టణంలోని బైల్‌బజార్‌లో హత్య చేసింది. భర్త వేధింపులు భరించలేక మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి గొంతుకోసి హత్యకు పాల్పడ్డారు. దారుణహత్య : లక్ష్మణచాంద మండలంలోని రాచాపూర్ గ్రామ శివారులో జూలై 23న కుంటాల మండలం గొల్లమాడ గ్రామానికి చెందిన బట్టి నాగయ్య(55)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. చిత్రహింసలకు గురిచేసి.. : ఆగస్టు 23న నెన్నెల మండలంలోని కోనంపేటకు చెందిన కొడిపే ఎంకమ్మ (38)ను భర్త మల్లయ్య కాల్చి పొడిచి హత్య చేశాడు. రోజూలాగే మద్యం తాగివచ్చి భార్యతో చిత్రహింసలు చేసి హత్య చేశాడు. రైతు హత్య.. : ఆగస్టు 23న కడెం మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన చౌడారపు కిష్టయ్య (55) అనే రైతును అదే గ్రామానికి చెందిన ఇందూర్ నరేష్ పాత కక్షల నేపథ్యంలో గొడ్డలితో దాడిచేసి హత్యకు పాల్పడ్డాడు. ఫొటోగ్రాఫర్ దారుణ హత్య.. : ఆగస్టు 25న బెల్లంపల్లి పట్టణంలో తాండూర్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ కొడిపే నర్సిములు (25)ను తన స్నేహితుడు సతీష్ ఇంటికి పిలిపించి ముగ్గురి సహాయంతో వాహన క్లచ్‌వైర్‌తో నర్సిములుకు ఉరివేసి దారుణ హత్య చేశారు. ఇద్దరి దారుణ హత్య.. : ఆగస్టు 30న నిర్మల్ పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న కల్లు బట్టి కార్మికులు మేకల నర్సిములు (65), ఎర్గట్ల బాపురావు (51)ను గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో దాడిచేసి హత్యకు పాల్పడ్డారు. ఇంటికి పిలిచి.. విషం కలిపి.. : ఆగస్టు 30న బెజ్జూర్ మండలం అగర్‌గూడ గ్రామానికి చెందిన కాటెల దామాజీ (54)ని అదే గ్రామానికి చెందిన దన్నూరి గంగ పాత కక్షలతో ఇంటికి పిలిపించి విషం కలిపిన మద్యాన్ని తాగించి మరీ హత్యకు పాల్పడింది. ఇనుప రాడ్‌తో దాడి చేసి.. : సెప్టెంబర్ 11న మంచిర్యాల పట్టణంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన పంజ సులోచన (30)తో సహజీవనం చేస్తున్న మందమర్రి మండలం బొక్కలగుట్ట తిమ్మాపూర్‌కు చెందిన వెంకటేశ్ ఆమె మెడపై ఇనుప రాడ్‌తో కొట్టి దారుణంగా చంపాడు. వీఆర్ఏ హతం.. : సెప్టెంబర్ 11న బెజ్జూర్ మండలంలోని దింద గ్రామానికి చెందిన వీఆర్ఏ వగాడి నారాయణ (48)ను అదే గ్రామానికి చెందిన వెంకటి గొడ్డలితో నరికి చంపాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని హత్యకు పాల్పడ్డాడు. కారంపొడి చల్లి.. కత్తులతో నరికి... : సెప్టెంబర్ 12న జన్నారం మండలం పొన్కల్ గాంధీనగర్‌కు చెందిన కోట రవి (31) బైక్‌పై వస్తున్నప్పుడు మార్గమధ్యలో కాపుకాసిన గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కళ్లలో కారంచల్లి కత్తులతో నరికి చంపారు. -
మంచి ఇంకా మిగిలే ఉంది!
మానవ సంబంధాలకు విలువ తగ్గిందని, పట్టణ సంస్కృతి పెరిగాక ఎవరి జీవితం వారిది అన్నట్టుగా తయారైందని, కష్టంలో ఉన్నప్పుడు ఒక్కోసారి ఓదార్చే చెయ్యి కూడా కరువవుతోందని కొందరు ఆవేదన చెందుతూ ఉంటారు. కానీ అందరూ అలానే లేరు. కొందరిలో మంచితనం ఇంకా మిగిలేవుంది. అందుకు ఉదాహరణే ఇది. అమెరికాలోని మిసోరీలో నివసించే శాండ్రా అనే మహిళకు, స్థానిక రెడ్ లాబ్‌స్టర్ రెస్టారెంటు అంటే చాలా ఇష్టం. చాలాసార్లు అక్కడికి వెళ్లేది. ముఖ్యంగా తన పెళ్లి రోజును అక్కడే చేసుకునేది. ఒకటీ రెండుసార్లు కాదు... 31 ఏళ్లపాటు ఆ రెస్టారెంటులోనే చేసుకుంది. కానీ ఈ సంవత్సరం అందుకు అవకాశం లేదు. ఎందుకంటే... ఆమె భర్త హఠాన్మరణం చెందాడు. అది కూడా తమ 32వ పెళ్లి రోజు మరికొద్ది రోజులు ఉందనగా. భర్త మరణాన్ని తట్టుకోలేకపోయింది శాండ్రా. వేదనలో మునిగిపోయి బయటకు వెళ్లడమే మానేసింది. ఆమెను సంతోషపెట్టేందుకు ఆమె పిల్లలు రకరకాల ప్రయత్నాలు చేశారు. కూతురైతే తల్లికి ఇష్టమైన ఆహారం తీసుకొచ్చి పెట్టాలని రెడ్ లాబ్‌స్టర్ రెస్టారెంటుకు వెళ్లింది. అక్కడ వెయిట్రస్‌తో తన తల్లి పడు తోన్న బాధ గురించి చెప్పింది. ఆ వెయిట్రస్ వెంటనే విషయాన్ని యాజమాన్యానికి తెలియజేసింది. వారు ఆ వెయిట్రస్‌తో కలిసి శాండ్రాకు ఓ ఉత్తరం రాశారు. అందులో ఇలా ఉంది... ‘మీకు కలిగిన వేదనకు మేము ఎంతో చింతిస్తున్నాం. 31 సంవత్సరాల పాటు మీరు మీ జీవితంలోని అతి ముఖ్యమైన రోజును మా రెస్టారెంటులో గడిపారు. వచ్చే పెళ్లిరోజు నాడు కూడా మా దగ్గరకు వచ్చి, మా రెస్టారెంటులో భోజనం చేసి వెళ్లండి’. ఉత్తరం చదివి కన్నీటి పర్యంతమైన శాండ్రా, 32వ పెళ్లి రోజున రెస్టారెంటుకు వెళ్లింది. అక్కడ ఆమెకు ఘనస్వాగతం లభించింది. ఆమె ఎప్పుడూ తన భర్తతో కలసి కూర్చునే టేబుల్‌నే కేటాయించారు. మంచి విందును ఉచితంగా ఇచ్చారు. అంతేకాదు... ప్రతి ఏటా ఆ రోజున వచ్చి తాము ఇచ్చే విందును ఆరగించమని కూడా కోరారు. అందుకే అనేది... మంచితనం ఇంకా మిగిలే ఉందని! -
వ్యక్తిత్వాన్ని బట్టే మానవ సంబంధాలు
నల్లకుంట,న్యూస్‌లైన్: మనిషి వ్యక్తిత్వాన్ని బట్టే మానవ సంబంధాలు ఏర్పడుతాయని, ప్రస్తుతం మానవ సంబంధాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. నిజాయితీ, దయాగుణం, ఇతరులకు సాయం చేయాలనుకునే వారిని సమస్యలు దరిచేరవని చెప్పారు. ఆదివారం విద్యానగర్ సాయినగర్‌కాలనీలోని శ్రీ షిర్డీసాయిబాబా ఆలయంలో సంస్థాన్ అధ్యక్షుడు కె.సాయిబాబా అధ్యక్షతన ‘మహోన్నత మానవ సంబంధాలు’ అనే అంశంపై వ్యక్తిత్వవికాస శిక్షణ కార్యక్రమం జరిగింది. ముఖ్యవక్తగా విచ్చేసిన కమర్షియల్‌ట్యాక్స్ జాయింట్ కమిషనర్ వై.సత్యనారాయణ మాట్లాడుతూ మని షిని మనిషిగా గుర్తించి, సాటిమనిషి వ్యక్తిత్వా న్ని గౌరవించే వారికి సమస్యలు రావన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ చంద్రమౌళి, ప్రముఖ వ్యక్తిత్వ నిపుణులు నాగేశ్వర్రావు, ప్రొ.జయసింహ, సంస్థాన్ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం వ్యక్తిత్వ శిక్షణ తరగతికి సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలి..: బాల్యం నుంచే సామాజిక కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. కుత్బుల్లాపూర్ మండలం బౌరంపేటలోని వీఎన్ఆర్ సీనియర్ సిటిజన్స్ హోం వార్షికోత్సవానికి జస్టిస్ చంద్రకుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టేందుకు స్వచ్ఛందసంస్థలు ముందుకురావాలని సూచించారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కారామయ్య, రాష్ట్ర వెలమ సంఘం అధ్యక్షుడు,ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, హోం చైర్మన్ వడ్డేపల్లి నర్సింగ్‌రావు, నారాయణరావు, రామ్మోహన్రావు, వడ్డేపల్లి కొండలరావు తదితరులు పాల్గొన్నారు.