నల్లకుంట,న్యూస్‌లైన్: మనిషి వ్యక్తిత్వాన్ని బట్టే మానవ సంబంధాలు ఏర్పడుతాయని, ప్రస్తుతం మానవ సంబంధాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. నిజాయితీ, దయాగుణం, ఇతరులకు సాయం చేయాలనుకునే వారిని సమస్యలు దరిచేరవని చెప్పారు. ఆదివారం విద్యానగర్ సాయినగర్‌కాలనీలోని శ్రీ షిర్డీసాయిబాబా ఆలయంలో సంస్థాన్ అధ్యక్షుడు కె.సాయిబాబా అధ్యక్షతన ‘మహోన్నత మానవ సంబంధాలు’ అనే అంశంపై వ్యక్తిత్వవికాస శిక్షణ కార్యక్రమం జరిగింది.
ముఖ్యవక్తగా విచ్చేసిన కమర్షియల్‌ట్యాక్స్ జాయింట్ కమిషనర్ వై.సత్యనారాయణ మాట్లాడుతూ మని షిని మనిషిగా గుర్తించి, సాటిమనిషి వ్యక్తిత్వా న్ని గౌరవించే వారికి సమస్యలు రావన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ చంద్రమౌళి, ప్రముఖ వ్యక్తిత్వ నిపుణులు నాగేశ్వర్‌రావు, ప్రొ.జయసింహ, సంస్థాన్ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం వ్యక్తిత్వ శిక్షణ తరగతికి సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు.
సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలి..:
బాల్యం నుంచే సామాజిక కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. కుత్బుల్లాపూర్ మండలం బౌరంపేటలోని వీఎన్‌ఆర్ సీనియర్ సిటిజన్స్ హోం వార్షికోత్సవానికి జస్టిస్ చంద్రకుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టేందుకు స్వచ్ఛందసంస్థలు ముందుకురావాలని సూచించారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కారామయ్య, రాష్ట్ర వెలమ సంఘం అధ్యక్షుడు,ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, హోం చైర్మన్ వడ్డేపల్లి నర్సింగ్‌రావు, నారాయణరావు, రామ్మోహన్‌రావు, వడ్డేపల్లి కొండలరావు తదితరులు పాల్గొన్నారు.
వ్యక్తిత్వాన్ని బట్టే మానవ సంబంధాలు
Published Mon, Oct 28 2013 3:22 AM | Last Updated on Sat, Sep 2 2017 12:02 AM
Advertisement